మెదక్

నిర్వాసితులకు అఖిలపక్షాల బాసట: రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 25: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లాలో అఖిలపక్షం పిలుపుమేరకు గజ్వేల్‌లో బంద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ టిడిపి నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, బిజెపి నేత రఘునందన్‌రావును అక్కడి పోలీసులు అరెస్టు చేసి శివారు ప్రాంతంలోని దుందిగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా మల్లన్నసాగర్ బాధితులు అన్యాయానికి గురవుతున్నారని రాజీవ్ రహదారిలో ఆందోళనను చేపడుతున్న విషయం తెలుసుకుని ముందస్తుగానే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుని లాఠీలను జులిపించడం అమానుషమని అన్నారు. 2013 భూసేకరణ చట్టప్రకారం భూసేకరణ నిర్వహించాలని, రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణ చట్టం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో 123 ఉందని, 2013 భూసేకరణ చట్టం ఉందని చెబుతూనే(మిగతా 3వ పేజీలో) కేవలం జీవో 123 ప్రకారం మాత్రమే మల్లన్నసాగర్‌కు భూసేకరణను చేస్తూ రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ ముంపు బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి 2013 భూసేకరణ చట్టప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. రైతులపై దాడులను చేస్తే, ప్రతిపక్షాలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లలో నిర్భందిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు రజాకార్లు, నవాబులతో, పటేల్ పట్వారీ వ్యవస్థపై, భూస్వాములతో పోరాటాలు చేశారని, అవసరమైతే హరీష్‌రావు, కెసిఆర్‌తో కొట్లాడటానికి వెనుకాడరని అన్నారు. ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచి సరైన నష్టపరిహారం తెచ్చుకుంటామని, అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలను కూడగట్టుకుని ఆగస్టు 13, 14 తేదీలలో ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్షలు చేపడతామని చెప్పారు. పది జిల్లాల భూనిర్వాసితులను అక్కడికి తీసుకువచ్చి దీక్షలు చేస్తామని పేర్కొన్నారు.