మెదక్

ఖరారుకాని టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 22: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరిరోజు సమీపిస్తున్నా అభ్యర్థుల టికెట్ ఖరారు కాకపోవడంతో టిఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా ఉన్న సిద్దిపేటలో టిఆర్‌ఎస్ బలీయమైన శక్తిగా ఎదిగింది. తెలంగాణ సాకారోద్యమం సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం వల్ల టిడిపి, కాంగ్రెస్, బిజెపిల నుంచి టిఆర్‌ఎస్‌కు నాయకులు, మాజీ కౌన్సిలర్లు వలస రావడంతో సిద్దిపేటలో టిఆర్‌ఎస్ మరింత బలపడింది. ఇతర పార్టీల నేతలు, మాజీ కౌన్సిలర్లు పార్టీలో చేరేప్పుడు షరతుతో వచ్చినా ప్రస్తుత సమీకరణాల్లో ఆ పార్టీ నాయకులకు టికెట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఒక్కో వార్డు నుంచి 4-10మంది వరకు టిఆర్‌ఎస్ నాయకులే టికెట్ ఆశిస్తుండడంతో ఎవరికి టికెట్ కేటాయించాలో అధిష్టానానికి, మంత్రి హరీష్‌రావుకు తలనొప్పిగా పరిణమించింది. వార్డుల వారీగా సర్వే చేపట్టి జనాభిప్రాయం మేరకే టికెట్ కేటాయిస్తామని పార్టీ అధిష్టానం చెప్పినా పోటీలో ఉండేందుకు టిఆర్‌ఎస్ నేతలు ఆసక్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. టిఆర్‌ఎస్‌లో గెలుపు గుర్రాల ఎంపిక కోసం ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, రాష్ట్ర నేత దేవేందర్‌రెడ్డితో త్రిసభ్య కమిటి వేసి వార్డుల వారీగా దరఖాస్తులు చేపట్టారు. మంగళవారం సాయంత్రంలోగా ఏకాభిప్రాయం కుదిరినా 9-15టికెట్ల వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామనిప్రచారం జరిగిన రాత్రి 8గంటలైనా ఫ్రకటించకపోవడంతో టిఆర్‌ఎస్ నేతల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. తమటు పార్టీ టికెట్ వస్తుందా లేదా, రాకుంటే బరిలో ఉండాలా, వద్దా అని నాయకులు చర్చించుకుంటున్నారు. కొంతమంది నేతలు మాత్రం టికెట్ రాకున్నా రెబెల్‌గా బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు. రెబెల్ అభ్యర్థులు బరిలో నిలుస్తే పార్టీ అభ్యర్థుల విజయానికి గండిపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా అసంతృప్తి నేతలను బుజ్జగింపులు టిఆర్‌ఎస్ నేతలకు తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది.
టిడిపి, కాంగ్రెస్, బిజెపిలకు కరువైన అభ్యర్థులు
సిద్దిపేటలో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉండి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్, టిడిపిలు ప్రస్తుతం మున్సిపాల్టీలో ఉనిఖి కాపాడుకునేందుకే పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలోని 34వార్డుల్లో కొన్ని వార్డులు మినహా చాలా వార్డుల్లో పోటీనిచ్చే బలమైన కాంగ్రెస్, టిడిపిలకు కరవైనారు. కొంతవరకు కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో అధికార పార్టీకి పోటీనిచ్చే అవకాశం ఉన్నా, టిడిపి మాత్రం మరీ దీనస్థితిలో ఉంది. నామినేషన్ చివరిరోజు ఉండడంతో టిడిపి పక్షాన ఇద్దరే అభ్యర్థులు వేశారంటే ఆ పార్టీ స్థితి ఎంత దీనస్థితిలో ఉందో తెలుస్తుంది. కాంగ్రెస్ పక్షాన ఇప్పటి వరకు 18మంది నామినేషన్లు వేశారు. 34వార్డుల్లో పోటీ చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, టిడిపిలకు ఏ వార్డులో ఎవరిని బరిలో నిలపాలో అంతుచిక్కక తలలు పట్టుకుంటున్నారు. రేపటిలోగా అన్ని వార్డుల్లో పోటీకి నిలుపుతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. టిడిపి మాత్రం పోటీ చేసే అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతుకుంది. జిల్లా అధ్యక్షురాలు శశికళ, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి పార్టీ వర్గాలతో సమావేశం నిర్వహించారు. చివరిరోజు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. బిజెపిలో సైతం ఒకప్పుడు బలంగా ఉన్నా ఫ్రస్తుతం కొన్ని వార్డులకే పరిమితమైంది. 34వార్డుల్లో పోటీ చేస్తామని చెప్పినా ప్రస్తుతం బలంగా ఉన్న కొన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కమ్యూనిస్టు, ఎంఐఎంలు తమకు అనుకూలంగా ఉన్న కొన్ని వార్డుల్లో బరిలోనిలుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో టిఆర్‌ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తుండగా, కాంగ్రెస్, టిడిపి నేతల్లో అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆరాటపడుతున్నారు. ఏదేమైనా టికెట్ల ఎంపిక టిఆర్‌ఎస్‌కు శిరోభారం తప్పదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.