మెదక్

రుణాలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 1 : డిసిసిబి ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ సహకార బ్యాంక్‌ను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
గజ్వేల్ పరిదిలో 50 మంది రైతులు రుణాలు పొంది తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తుండగా, వారు పొందిన రుణాలు చెల్లిస్తే వేయి మంది రైతులకు ప్రయోజనం జరగుతుందని స్పష్టం చేశారు. కాగా డిసిసిబి ద్వారా తక్కువ వడ్డీతో అన్ని రకాల రుణాలు అందజేస్తుండగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 300కోట్ల పంట రుణాలు, రూ. 200కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా గత యేడాది రూ. 250కోట్ల పంట రుణాలు, రూ. 100కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా రైతుల ఆర్ధికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వివిద పథకాలు వర్తింపజేస్తుండగా, తమ బ్యాంక్ ద్వారా రుణాలపై 9.9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, ఏ ఇతర బ్యాంక్‌లు ఇంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వవని వివరించారు.

హరితహారానికి నెలవేతనం విరాళం
* ప్రకటించిన పేట చైర్మన్, వైస్ చైర్మన్
సిద్దిపేట, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంకు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్‌కు నెల వేతనం 23వేలను విరాళంగా ఫ్రకటించి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు అందించారు. సోమవారం కరీంనగర్‌లో జరిగిన రాష్టస్థ్రాయి మున్సిపల్ సమావేశంలో కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి పలువురికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. మున్సిపాల్టీలో తడి,పొడిచెత్త వేర్వేరుగా వందశాతం సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం లక్ష్యాన్ని అధిగమించి అమలు చేయడం అభినందనీయమన్నారు.