మెదక్

నయాం గ్యాంగ్ కదలికలపై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 9: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం మెదక్ జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. నరుూం చెల్లులు నివాసం ఉంటున్న మండల కేంద్రమైన కోహీర్‌లో జహీరాబాద్ టౌన్ సిఐ నాగరాజు, జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో కోహీర్‌లోని నరుూం చెల్లెలు అయిషాబేగం, బావ సలీం ఇంటిపై దాడులు నిర్వహించి తనిఖీలు చేసారు. సలీం సా మిల్లు, కట్టెల వ్యాపారిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వీరికి వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు ప్లాట్లు, స్వంత ఇల్లు ఎకరం వ్యవసాయ పొలం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 20 తులాల బంగారు ఆభరణాలు కూడా పోలీసులు గుర్తించారు. నరుూం ఈ ప్రాంతంలో సంచరించాడా, ఏమైనా సెటిల్మెంట్లు కొనసాగించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం షాద్‌నగర్‌లో గ్రేహౌండ్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ నిర్వహించి మట్టుబెట్టిన అనంతరం నరుూం బంధువులు, మిత్రులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జహీరాబాద్ పోలీసులు నరుూం చెల్లెలు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న జహీరాబాద్‌లో నరుూం ఏమైనా కార్యకలాపాలు నిర్వహించి ఉండవచ్చన్న అనుమానంతో పాటు జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో సంచరించాడా అన్న కోణంలో జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రాంతమైన పటన్‌చెరు, రామచంద్రాపూర్ ప్రాంతాల్లో కూడా నరుూం ముఠా కార్యకలాపాలను నిర్వహించి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసు శాఖ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కోహీర్‌లోని నరుూం చెల్లెలు అయిషాబేగం నుంచి స్వాధీనం చేసుకున్న ఫ్లాట్ల డాక్యుమెంట్లను ఉన్నతాధికారులకు అందించేందుకు జహీరాబాద్ పోలీసులు సిద్దమయ్యారు. కాగా నరుూం ఈ ప్రాంతంలో సంచరించినా ఎవరికి అనుమానం రాకపోగా కనీసం నరుూం చెల్లెలు కోహీర్‌లో ఉంటుందన్న విషయం కూడా జిల్లా పోలీసులకు సమాచారం లేకపోవడం విశేషం.