మెదక్

సింగూర్ నుంచి ఘనపురానికి 0.3 టిఎంసిల నీరు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఆగస్టు 19: ఘనపురం ఆయకట్టు రైతులకు సాగునీరు, తాగునీటి కోసం సింగూర్ నుంచి 0.3 టిఎంసీ నీటిని విడుదల చేయాలని శుక్రవారం నాడు తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. 2004లో కూడా సింగూర్ ప్రాజెక్ట్‌లో 6 టిఎంసీల నీరు ఉండగా ఘణపురం ప్రాజెక్ట్‌కు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు సింగూర్ ప్రాజెక్ట్‌లో 6 టిఎంసీ నీరు నిలువ ఉందన్నారు. ఇందులో ఘణపురం ప్రాజెక్ట్‌కు నీరు విడుదల చేస్తే మెదక్ పట్టణంతో పాటు మెదక్ నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాలకు సుమారు 20 వేల ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రస్తుత కరవు సమయంలో రైతులను దృష్టిలో పెట్టుకొని సింగూర్ నీరును విడుదల చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు. జూలైలో కురిసిన వర్షాలతో రైతులు నారుమల్లు పోసుకోవడమే కాకుండా నాట్లు కూడా వేసుకున్నారన్నారు. ఈ పంటలను కాపాడుకోడానికి సింగూర్ నుండి నీళ్లు విడుదల చేయాలని శశిధర్‌రెడ్డి కోరారు.