మెదక్

పడకేసిన పల్లెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, ఆగస్టు 21: తీవ్రమైన విష జ్వరాలు సోకి పల్లెలు వణుకుతున్నాయి. ఇంటిల్లిపాదీ జ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల విరేచనాలతో పలువురు మంచాలు పడుతున్నారు. ఐనప్పటికీ వైద్యాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. మండలంలో మూడు పిహెచ్‌సిలలోకి వస్తున్న ఓపి పేషెంట్‌లలో ఎక్కువ మంది విష జ్వరాలబారిన పడినవారే ఉంటున్నారు. వైద్యులు అందుబాటులో ఉండకపోవడం కారణంగా అధిక సంఖ్యలో బాదితులు ప్రైవేటు వైద్యం కోసం పట్టణాల బాట పడుతున్నారు. వైద్య ఖర్చులకు డబ్బులులేక నానా తంటాలు పడుతున్నారు. విష జ్వరాల మహమ్మారి గ్రామాలను పట్టిపీడిస్తున్నది. అయినప్పటికీ వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఉదాహరణకు మండలపరిదిలోని అనాజీపూర్ గ్రామంలో సుమారు ఇంటింటికీ జ్వరబాధితులే కనిపిస్తున్నారు. ఏ ఇంట్లో చూసినా విష జ్వరాలతో బాధపడుతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ విషయమై ఇందుప్రియాల్ వైద్యాధికారిని రమాదేవిని అడగగా ఇందుప్రియాల్ పిహెచ్‌సి పరిధిలోని గ్రామాల్లో విష జ్వరాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతి రోజూ పిహెచ్‌సిలో సుమారు 100 మంది వరకు చికిత్స చేసి పంపిస్తున్నామని పేర్కొన్నారు. విష జ్వరాలపై తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. దౌల్తాబాద్ పిహెచ్‌సి పరిధిలో అంతగా విష జ్వరాలు లేవని వైద్యాధికారిని ఫరానా తెలిపారు. మామూలు జ్వరాలు మాత్రం అక్కడక్కడా వస్తున్నాయని పేర్కొన్నారు. కాగా రాయపోల్ పిహెచ్‌సి వైద్యాధికారిణి రాజేశ్వరి ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.