మెదక్

మంచిర్యాలను జిల్లా చేయడం కెసిఆర్‌కు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఆగస్టు 22: తూర్పు ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలకు కేంద్రమైన బెల్లంపల్లి పట్టణాన్ని కాదని అభివృద్ధి చెందిన మంచిర్యాల పట్టణాన్ని జిల్లా చేయడం సరైందికాదని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని, కొత్త జిల్లాల ఏర్పాటులో దళిత, గిరిజన ప్రాంతాలపై ముఖ్యమంత్రి వివక్షత చూపడం సరికాదన్నారు. తూర్పు జిల్లాలోని గిరిజన, దళిత వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ది చెందని బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే మంచిర్యాల పట్టణం ఎంతో అభివృద్ది చెందిందని, దీనిని జిల్లాకేంద్రం చేయాల్సిన అవసరం ఏముందని, గత 30 సంవత్సరాలుగా బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లా చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయని జిల్లా సాధన కమిటీ అనేక ఉద్యమాలు చేపడుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ బెల్లంపల్లిపై వివక్షత చూపడం దారుణమన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు విషయాన్ని వెనక్కు తీసుకోవాలని, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన అభ్యంతరాల స్వీకరణ గడువును బెల్లంపల్లి జిల్లా సాధన సమితి పూర్తిగా వినియోగించుకుంటుందని, బెల్లంపల్లి జిల్లా సాధనకు ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేపడుతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల విషయమై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.