మెదక్

నిరాశపరచిన సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 26: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆర్వీఎం ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమం 10 నిమిషాల్లోనే ముగియడంతో పలువురిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆర్వీఎం ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రారంభోత్సవం కోసం నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో రోగులను వైద్య చికిత్స కోసం గజ్వేల్ నియోజకవర్గంనుంచి వివిధ గ్రామాల నుంచి రప్పించారు. ఆర్వీఎం ప్రారంభోత్సవం అనంతరం పక్కనే పెద్దఎత్తున సిఎం ప్రసంగించేందుకు వేదిక ఏర్పాటు చేశారు. సుమారు 500మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. సిఎం రాకకోసం మధ్యాహ్నం 12గం. నుంచే వేచి చూస్తున్నారు. డిఐజి అకున్ సభర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎం పర్యటన కోసం పార్కింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారిని పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. మధ్యాహ్నం 2.20గం.కు సిఎం కెసిఆర్ , డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వచ్చారు. సిఎం కెసిఆర్, మంత్రుల బృందాన్ని నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఆర్వీఎం ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. లోపలికి వెళ్లి 10ని. వచ్చి తనవాహనంలో హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమైనారు. ఆర్వీఎం ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం ప్రసంగం కోసం వేచి ఉన్న వైద్య విద్యార్థులు, ప్రజలు 10ని. వచ్చిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. సిఎం వెళ్లాక ఆస్పత్రిలో రోగులకు వైద్య చికిత్సలు చేశారు. ఎంతో హంగు, ఆర్భాటాలతో సిఎం కోసం ఏర్పాటు చేసినా 10నిమిషాల్లోనే వెళ్లిపోవడం పలువురిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.