మెదక్

నేడు ఘణపురం ప్రాజెక్ట్‌కు చేరనున్న సింగూరు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఆగస్టు 26: సింగూర్ నుంచి ఈ నెల 24న ఉదయం 9 గంటలకు ఘణపురం ప్రాజెక్ట్‌కు విడుదల చేసిన 0.35 టిఎంసిల నీరు ఈ నెల 27న ఉదయం ఘణపురం ప్రాజెక్ట్‌కు చేరుకుంటుందని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు తెలిపారు. శుక్రవారం నాడు వారు విలేఖరులతో మాట్లాడుతూ ఘణపురం ప్రాజెక్ట్ రైతుల విజ్ఞప్తి మేరకు మెదక్ ఎమ్మెల్యే, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సంప్రదింపుల మేరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.35 టిఎంసి నీళ్లను ఘణపురం ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. విడుదల చేసిననీరు ఆ రోజు రాత్రి 8 గంటలకు మంజీరాకు చేరుకున్నట్లు వారు తెలిపారు. సింగూర్ నుంచి ఘణపురం ప్రాజెక్ట్ వరకు వంద కిలోమీటర్ల పొడవున కెనాల్ ఉన్నట్లు ఇంజనీర్లు తెలిపారు. మంజీర నుంచి ఆ రాత్రి 8 గంటలకు ఘణపురం ప్రాజెక్ట్ నీటిని విడుదల చేశారని ఇంజనీర్లు ఏసయ్య, శివనాగరాజులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12:40 గంటలకు తుక్కాపూర్ గ్రామానికి పైన ఆ నీరు చేరుకున్నట్లు తెలిపారు. ఈ నెల 27న ఘణపురం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం విడుదల చేసిన సింగూర్ నీరు చేరుకుందని తెలిపారు. అయితే సింగూర్ నుంచి ఘణపురం ప్రాజెక్ట్ వరకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ ప్రదేశాలలో భారీయెత్తున గుంతలు ఎత్తిపోతల పథకాలు, మోటర్లు ఉండటమే కాకుండా ఆ కాలువ ప్రాంతమంతా డ్రై ఏరియాగా మారడంతో నిలిచిన నీళ్లన్నీ పీల్చుకొని చివరకు ఘణపురం ప్రాజెక్ట్‌కు చేరుకోబోతున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూర్ నుంచి ఘణపురం ప్రాజెక్ట్ వరకు విడుదల చేసిన నీరు ఎండిన కాలువ మొత్తం నీటిని పీల్చుకొని చివరకు ఘణపురం ప్రాజెక్ట్‌కు అందించబోతున్నట్లు తెలిపారు. ఘణపురం ప్రాజెక్ట్ క్రింద 21,625 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అంతకు మించి రైతులు వరినాట్లు వేసినట్లు అంచనా ఉందన్నారు. అయినా సింగూర్ నుంచి విడుదల చేసిన 0.35 టిఎంసిల నీరు సుమారు వారం రోజుల పాటు పంటలకు అందుతుందనే అంచనగా ఉన్నట్లు తెలిపారు. కాగా 0.35 టిఎంసి నీటిని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఆ నీరు వంద కిలోమీటర్ల పొడవున ఎండిక కాలువ పీల్చుకుంటూ తడుచుకుంటూ ఆ పొడవున ఉన్న బోర్లు నిండుతూ చివరకు వచ్చిన నీళ్లు ఘణపురం ప్రాజెక్ట్‌లో నిండిన నీళ్లు ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్స్ క్రింద ఉన్నటువంటి పంటలకు సరిపడేనా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలు చివరకు దక్కుతాయా లేదా అనేది ప్రశ్నార్దకంగా మారింది. గత ప్రభుత్వంలో కూడా ఘణపురం ప్రాజెక్ట్ క్రింద ఉన్నటువంటి కెనాల్స్ క్రింద వేసిన పంటలకు నీళ్లు వదిలేందుకు ప్రభుత్వాలను సంప్రదించారని రైతులు తెలిపారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. కాగా గత ప్రభుత్వాలను అధిగమించి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ కోసం రైతులే కాదు ప్రతి ఒక్కరు ఓట్లు వేసి తెలంగాణను సాధించుకున్నారు. అందువలన తెలంగాణ రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.