మెదక్

సౌలభ్యమా..సంకటమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 26: పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునఃర్విభజన ద్వారా కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాల ముఖ చిత్రాలను ప్రభుత్వం వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది. దశాబ్దాల కాలంగా సువిశాలంగా విస్తరించిన మెదక్ జిల్లా మూడు ముక్కలుగా విడిపోతున్న విషయం విధితమే. పాత జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలు కేంద్రంగా రెవెన్యూ డివిజన్లుగా కొనసాగాయి. అవే పేర్లతో కొత్తగా జిల్లాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలకు చెందిన ముఖ చిత్రాలను తీక్షణంగా పరిశీలిస్తే ఖండాలను తలపించే విధంగా కనిపిస్తున్నాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాలు చూడటానికి బాగానే కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాయే మంజీర నది ఎలా వంపులు తిరిగిందో అదే తరహాలో దర్శనమిస్తుండటం విశేషం. కాగా మండలాల విలీనం నియోజకవర్గాల వారిగా లేకపోవడంతో జిల్లా, మండలం ఒకటైతే నియోజకవర్గం మరొకటి కావడంతో భవిషత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని విశే్లషకులు పేర్కొంటున్నారు. మండల కేంద్రాలుగా చేయాలన్న డిమాండ్‌తో చేగుంట మండలం నార్సింగిలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. రేగోడు, అల్లాదుర్గం మండలాలను మెదక్ జిల్లాలోకి విలీనం చేయడాన్ని ఆ రెండు మండలాల ప్రజలు ససేమిరా అంటూ అంగీకరించడం లేదు. జిల్లాల పునఃర్విభజన ప్రక్రియ ప్రారంభం నుంచే రెండు మండలాల పరిధిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి తమ డిమాండ్‌ను వినిపించినా అధిరులుకానీ, ప్రభుత్వంకానీ పట్టించుకోలేదు. జిల్లాల ఏర్పాటును చేస్తూ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసి ఆ రెండు మండలాలను మెదక్ జిల్లా పరిధిలోకి మార్చారు. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆందోళను నిర్వహిస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గురువారం నాటి రాస్తారోకోలో చిక్కుకుని ఆందోళనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంగారెడ్డి జిల్లాలో ఉండే విధంగా చూస్తానంటూ హామీ ఇవ్వడం గమనార్హం. ఇక రంగంపేట, జహీరాబాద్ మండలం మొగడంపల్లి, చింతమడక, నారాయణరావుపేట, హవేలిఘన్‌పూర్ తదితర వాటిని మండల కేంద్రాలుగా మార్చాలన్న డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని పెద్దశంకరంపేటను కూడా మెదక్ జిల్లాలో కలపడాన్ని ఆ మండల ప్రజలు ఎంత మాత్రం అంగీకరించడం లేదు. అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్ మండలాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తే ప్రయాణ సౌలభ్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినరి బస్సులో ప్రయాణించాల్సి ఉండటం, సుమారు మూడు నుంచి నాలుగు గంటలు ప్రయాణిస్తేకానీ గమ్యానికి చేరుకోలేమన్న ఆందోళనను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడిన కొత్త జిల్లాల ప్రకారంగానే భవిషత్తులో అసెంబ్లీ నియోజకవర్గాల పునఃర్విభజన కొనసాగే అవకాశం లేకపోలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. మొత్తంమీద కొత్త జిల్లాల ముఖ చిత్రాల విడుదల ద్వారా ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకుని ఉంటుందని, నెల రోజుల వరకు చేపట్టిన అభ్యంతరాల కార్యక్రమం కూడా తూతూ మంత్రమేనని స్పష్టమవతుందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేస్తే జిల్లాల ముఖ చిత్రాల సారూప్యత కూడా మరోమారు మార్పులు చేసి విడుదల చేయాల్సి వస్తోంది. మొత్తంమీద జిల్లాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.