మెదక్

స్థానిక ఉపఎన్నికల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ అగస్టు 27: గత అరు నెలలుక్రితం ఖేడ్ మండలం జగనాథ్‌పూర్ ఎంపిటీసీ డేవిడ్ రోడ్డు ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికలు అవార్యమయ్యాయ. ఈనెల 26 నుంచి ఎంపిటీసీలకు, సర్పంచ్‌లకు వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 29వరకు నామినేషన్, వచ్చే నెల 8న ఎన్నికలు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. ఇందుకుగాను జగనాథ్‌పూర్ ఎంపిటీసీ ఎన్నికల్లో అప్పట్లో మణిక్యం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు రావడంతో మాణిక్యం టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా రంగంలో దిగుతున్నారు. ఎమ్మెల్యే ఎం. భూపాల్‌రెడ్డి అదేశాల మేరకు శుక్రవారంనాడు సాయంత్రం టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మాణిక్యం నామినేషన్ వేశారని ఎంపిడివో విశ్వప్రసాద్ శనివారంనాడు విలేఖరులకు తెలిపారు. ఖేడ్ మండలంలో చాప్టా కెలో 7వార్డుకు , వెంకటాపూర్ 4వార్డు సభ్యుని ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈనెల 29వరకు ఎన్నికల్లో పోటీ చేసే వారు నామినేషన్ వేసుకునేందుకు గడువు ఉందన్నారు. శనివారంనాడు సాయంత్రం వరకు ఇతర పార్టీల అభ్యర్థులు ఎంపిటీసీకిగాను. వార్డు సభ్యులకుగాను ఎవరు నామినేషన్ వేయలేదన్నారు.
కిచ్చనపల్లిలో సర్పంచ్ ఎన్నికల వేడి
జోగిపేట: అందోల్ మండల పరిధిలోని కిచ్చన్నపల్లి గ్రామ సర్పంచ్ పదవికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్ల కార్యక్రమం ఉంటుంది. ఇందులో తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో గ్రామంలో ప్రచారం ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. పగలు, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 8న ఈ ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్, తెరాస పార్టీల మధ్య గట్టి పోటీ నిలిచే అవకాశాలున్నాయి. అందోల్ మండలంలో ఒకే ఒక ఎన్నిక జరుగుతున్నందున రెండు పార్టీలు దృష్టి సాధించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ మృతి చెందినందున ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. మద్యం, కల్లు వంటివి అభ్యర్థులు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ గ్రామాన్ని అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ దత్తత తీసుకున్నప్పటికీ ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. గత సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో మల్లి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారనే ప్రచారం వినిపిస్తుంది. తెరాస అభ్యర్థి కూడా గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
4వ వార్డుకు ఒక నామినేషన్
మిరుదొడ్డి: మండల పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయితి 4వ వార్డుకు శనివారంనాడు ఒక నామినేషన్ దాఖలైనట్లు ఎంపిడిఓ నగేష్ తెలిపారు. గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి 4వ వార్డుకు నామినేషన్ వేసినట్లు తెలిపారు. నామినేషన్ గడువు సోమావారంతో ముగిస్తుందన్నారు.

ఆలయాల్లో శ్రావణ సందడి
సిద్దిపేట, ఆగస్టు 27 : సిద్దిపేట వేంకటేశ్వరాలయంలో శ్రావణ శనివారం చివరి రోజు కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తులతో ఆలయం సందడిగా మారింది. సిద్దిపేట మోహినిపురా వేంకటేశ్వరాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రత్యేక అర్చన, పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం ఆఖరి శనివారం సందర్భంగా ఆలయంలో మూల విరాట్ విగ్రహాలను పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ అమ్మవారులను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని 10 రూపాయల నోట్లతో లక్ష్మి అవతారంలో అలంకరించారు. భక్తులు ఉదయం నుండి పెద్దఎత్తున బారులు తీరారు. ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేంకటాచార్యులు, అర్చకులు రఘనాధచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఇఓ శ్రీనివాసశర్మ, సిబ్బంది మైసాగౌడ్, అమర్, బిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
వైభవంగా శ్రీ గోదారంగనాథ కల్యాణోత్సవం
మెదక్: శ్రావణమాసం చివరి శనివారం నాడు మెదక్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో భక్తులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురిపించి ప్రజలు సురక్షితంగా ఉండాలని భక్తులు శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక మొక్కులు సమర్పించుకున్నారు. పాడి పంటలు సంవృద్దిగా కలిగించాలని భక్తులు కోరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శ్రీ గోదారంగనాథ స్వామి కల్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తీర్దప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. మెదక్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఆలయ చైర్మన్ కంచి మధుసూదన్, పూజారి శ్రీ పవనకుమార్, కృష్ణమాచార్యులు, యాదగిరిచారి శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణోత్సవం జరిపారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారాయణరావుపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి
* దీక్షలకు కాంగ్రెస్ సంఘీభావం
సిద్దిపేట, ఆగస్టు 27: నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేయాలని గ్రామంలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. మండలంలోనే పెద్దగ్రామమైన నారాయణరావుపేట మండల ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. గతంలో సైతం గ్రామాన్ని మండలం ఏర్పాటు చేద్దామని ప్రకటించారని, తీరా కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో నారాయణరావుపేట లేకపోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా అర్హతలు ఉన్న నారాయణరావుపేటను మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. నారాయణరావుపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు రంగాగౌడ్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి పెంపునకు ఎబివిపి కృషి
* రాష్ట్ర కార్యసమితి సభ్యుడు విష్ణువర్ధన్
సిద్దిపేట, ఆగస్టు 27: విద్యార్థుల మధ్య చీలికలు తెచ్చేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఏబివిపి రాష్ట్ర కార్యసమితి సభ్యుడు విష్ణువర్దన్ అన్నారు. శనివారం ఏబివిపి ఆధ్వర్యంలో పట్టణంలోని పలుకళాశాలల కమిటిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భణగా మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి నింపేందుకు 67ఏండ్లుగా ఏబివిపి పని చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, యుజి, పిజి విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం కళాశాలల నూతన కమిటిలను ఎన్నుకున్నారు. వైపిఆర్ అధ్యక్షునిగా నాగరాజు, ఎస్‌ఆర్‌కె అధ్యక్షునిగా శ్రీనాథ్, బిఎంఆర్ అధ్యక్షులుగా ప్రభాకర్, మనూషా, మాస్టర్స్ అధ్యక్షునిగా ఇమ్రాన్, ప్రతిభ అధ్యక్షునిగా రామకృష్ణ, గీతాంజలి అధ్యక్షునిగా రాజ్‌కుమార్, మాస్టర్‌మైండ్స్ అధ్యక్షునిగా హబీబుద్దీన్ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో ఏబివిపి నేతలు మధు, నవీన్, హరీష్, సాయి, మనీష్, ప్రశాంత్, విజయ్, శశికర్, రమేశ్ పాల్గొన్నారు.

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల మెటీరియల్
సిద్దిపేట, ఆగస్టు 27 : గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల మెటీరియల్ పాఠకులకు అందుబాటులో ఉంచాలని మంత్రి హరీష్‌రావు ఓఎస్‌డి బాలరాజు అన్నారు. శనివారం సిద్దిపేట గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. గ్రంథాలయాల్లో పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. లైబ్రైరియన్ విన్నవించిన సమస్యలను మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. టిఆర్‌ఎస్ నేత బ్రహ్మం, శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.