మెదక్

క్రీడాభివృద్ధికి పెద్దపీట: మంత్రి హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 29: సిద్దిపేటలో క్రీడా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మినీ స్టేడియంలో మంత్రి హరీష్‌రావు క్రీడాకారుల సమక్షంలో కేక్‌కట్ చేశారు. అనంతరం క్రీడాకారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలు నిర్లక్ష్యానికి గురైనాయన్నారు. ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసి బడ్జెట్‌ను రెట్టింపు చేసిందన్నారు. మినీ స్టేడియంలోనే 5కోట్లతో అంతర్జాతీయ నిర్మాణాలతో స్విమ్మింగ్‌ఫూర్ నిర్మిస్తున్నారన్నారు. మినీ స్టేడియం చుట్టు మెష్, సంపుహౌజ్ మంజూరు చేసినట్లు తెలిపారు. స్టేడియంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్, ఖోఖో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ కోసం టర్ఫ్ పిచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, నేతలు సాయిరాం, మల్లిఖార్జున్, సత్యనారాయణ, ప్రవీణ్, మహేష్, విజయ్, గుండు శ్రీను, ఆనంద్ పాల్గొన్నారు.