మెదక్

రూ. 1024 కోట్లతో గోదాముల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 9: అన్నదాతల అభ్యున్నతిని కాంక్షింస్తూ టిఅర్‌ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున నిదులు కేటాయిస్తోందని, ఇందులో భాగంగానే రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు రూ. 1024 కోట్లతో గోడౌన్‌ల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర మార్కెటింగ్, భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో రూ. 17.5 కోట్ల విలువ చేసే వివిద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రూ. 40కోట్లతో గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో ఆదునీకరణ చర్యలు చేపడుతుండగా, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా దాన్యం ఆరబెట్టే డ్రయ్యర్‌ను గజ్వేల్‌కు మంజూరీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే వంటిమామిడి మార్కెట్ యార్డ్‌కు రూ. 2.50కోట్లు, రూ. 4కోట్లతో కొండపాకలో మార్కెట్ యార్డ్, తూప్రాన్‌లో రైతు బజార్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దటమే సిఎం కెసిఅర్ లక్ష్యమని, ఇందులో భాగంగానే 100 పడకల ఆసుపత్రి, ఆడిటోరియం, సమీకృత పాఠశాల ఏర్పాటు, వెజిటేబుల్ మార్కెట్ నిర్మానం, నాలుగు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం, కోటి వ్యయంతో స్మశానవాటిక, పాండవుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌ల తీర్చిదిద్దటం, బట్టర్‌ఫ్లై ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటు, పాతూరు రాజీవ్ రహదారిపై మినీ కూరగాయల మార్కెట్ ఏర్పాటు తదితర అభివృద్ది పనులను చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే గజ్వేల్ పట్టణానికి త్వరలోనే స్వచ్చమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటుండగా, కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మానంతో బీడుభూములు సాగులోకి తెచ్చి రైతుల కాల్లు కడుగుతామని వివరించారు. కాగా మొదటగా పట్టణ శివారులోని పాండువుల చెరువు మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించడంతోపాటు వినాయక నిమజ్జనం కోసం నీటిని నింపుతామని స్పష్టం చేశారు. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ దేవేందర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ దుంబాల అరుణబూపాల్‌రెడ్డి, ఎంపిపి అధ్యక్షులు చిన్నమల్లయ్య, జెడ్‌పిటిసి వెంకటేశంగౌడ్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్, నేతలు తదితరులు పాల్గొన్నారు.