మెదక్

ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 9: పౌర సరఫరాల అధికారులు, డీలర్లు సక్రమంగా పని చేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను చక్కదిద్దాలని జాయింట్ కలెక్టర్ పి.వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీలర్లు, మిల్లర్లు, అధికారులతో ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2012-13, 2013-14 ఖరీఫ్ పంట కాలానికి గాను మిల్లర్లు 4కోట్ల 62లక్షలు డిఫాల్ట్ అయినందున రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేసి తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎఫ్‌ఐఆర్ నమోదుకై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పంటకాలంలో ఇంకా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు లెవీగా సమకూర్చాల్సి ఉందని, ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లెవీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. 13చౌకధర దుకాణ డీలర్లు సమయ పాలన పాటించనందున గతవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 10వేల చొప్పున జరిమాన విధించినట్లు తెలిపారు. డీలర్లు తప్పులు చేస్తే సహించేది లేదని, డీలర్ షిప్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 587 చౌకధర దుకాణాలకు ఇంకా సరుకు చేరాల్సి ఉన్నందున శని, ఆది వారాలు సెలవుదినాలు అయినప్పటికీ ఎంఎల్‌ఎస్ పాయింట్స్ పనిచేసి సోమవారం ఉదయం లోగా సరుకులు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. డిటిలు, ఎఎస్‌ఓలు క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. బియ్యం, ఇతర పప్పు దాన్యాలు ఆటోలు, ట్రక్కులు, డిసిఎంలలో అక్రమంగా రవాణా చేస్తే సీజ్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని డీలర్లు, మిల్లర్లకు సూచించారు. సమావైశంలో డిఎస్‌ఓ, ఎఎస్‌ఓలు, డిప్యూటి తహసీల్ధార్లు పాల్గొన్నారు.