మెదక్

ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, సెప్టెంబర్ 11. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్‌ను సాధించే వరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాడు కౌడిపల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్‌రెడ్డి మాట్లాడారు. నర్సాపూర్ తాలుకాకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని (ఆరు మండలాలు) నర్సాపూర్, కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం మండలాల ప్రజలకు పరిపాలన పరంగా, అన్నిరకాలుగా సౌకర్యంగా ఉంటుందని అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి మెదక్ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షులు చిలుముల కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు మండలాల ప్రజలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలను చేస్తామని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని అన్నారు. ఈ సమావేశంలో నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట ఎంపిపిలు శ్రీనివాస్‌గౌడ్, పద్మనర్సింహ్మరెడ్డి, హరిక్రిష్ణ, మండల పరిషత్ ఉపాధ్యాక్షులు సున్నం సతీష్, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామాగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు నర్సింహ్మరెడ్డి, వెంకట్‌రెడ్డి, శత్రునాయక్, దర్జి చెంద్రం, క్రిష్ణగౌడ్, మోతీలాల్‌గౌడ్, గొర్రె రవి, శ్రీనివాసరావు, నాయికోటి రాజు, శంకర్‌గౌడ్, హత్నూర మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.