మెదక్

ఖాసింపూర్‌లో అతిసార కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 18: మండలంలోని ఖాసింపూర్ గ్రామంలో అదివారం అతిసార వ్యాధిసోకి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోచేరి చికిత్స పొందుతున్నారు. అతిసార సోకినవారిలో తులసిరాం, వెంకట్, సామెల్, మాణయ్య, పాపమ్మ, బిపాషా, సుదర్శన్, లాజర్, శ్రీకాంత్, చుక్కప్ప, స్వరూప, శ్రీను, తిప్పన్న జగన్, రాజులు అతిసార సోకిన వారిలో ఉన్నారు. గ్రామంలోరి హరిజన్‌వాడ, బిసి కాలనీల గుండా వెళ్తున్న ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజిలు ఏర్పడ్డాయి. లీకేజి ద్వారా సరఫరా అయిన నీటిని తాగడంతో స్థానికులకు అతిసార సోకింది. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న స్థానికులు ఒక్కరి తరువాత మరొక్కరు ఆసుపత్రికి రావడం మొదలైంది. సాయంత్రం వరకు మొత్తం 15 మంది అతిసారతో బాధపుడుతూ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వారు తమను పరిశీలించలేదని, వైద్య సిబ్బంధి మాత్రమే చికిత్సలు నిర్వహిస్తోందని రోగులు ఆరోపించారు. గ్రామంలోని హరిజన్‌వాడ, బిసి కాలనీల్లో నీరు కలుశితం కావడంతో ఆయా కాలనీలవాసులు ఆస్తవస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఈ పైప్‌లైన్‌ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడంమానేశారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు

గజ్వేల్, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన గనత సిఎం కెసిఆర్‌కె దక్కుతుండగా, పేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా సర్కార్ సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలంగాణ అర్టీసీ చెర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్కారు. ఆదివారం గజ్వేల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనతోపాటు తాగునీరు, తాగునీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మున్నూరు కాపులకు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేసిన సిఎం కెసిఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉందామని తెలిపారు. కాగా మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థ్ధికంగా, సామాజికంగా ముందున్ననాడే తగిన ప్రాధాన్యతను పాలకులు గుర్తిస్తారన్న విషయాన్ని గమనించాలని సూచించారు. అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమకు అప్పగించగా సిఎం కెసిఆర్ అందించిన సహకారంతో లాబాల దిశలో పయనింపజేస్తున్నట్లు వివరించారు. కాగా మొదటగా ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణను మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సత్తయ్య, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేశ్‌బాబు, నేతలు ఆర్కె శ్రీనివాస్, అల్వాల బాలేశ్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి, అక్రమాలకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 18: అవినీతి, అక్రమాలకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీయేనని, వివాదస్పద మాటలు మాట్లాడి చరిత్ర కెక్కాలనుకోవడం అవివేకమని, జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలోని టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు, పేదల సంక్షేమం, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ అకుంటి దీక్షతో పని చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు జవాబుదారీగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవగాహాన రాహిత్యంగా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నాడని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అవినీతి తెరాస నాయకులను జైలుకు పంపిస్తామంటూ మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నాడని, పిచ్చి కూతలు కూస్తే సహించేది ఘాటుగా హెచ్చరించారు. జైళ్లకు వెళ్లే చరిత్ర కాంగ్రెస్ కే ఉందని, తెరాస నాయకులను జైలుకు పంపించడం నీ తరం, నింన్ను పుట్టించిన వారి తరం కూడా కాదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 48, టిడిపి 17యేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు కదా.. మీ హయంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఆంధ్ర నాయకుల ముడుపులకు ఆశపడి తెలంగాణను వ్యతిరేకించి, లక్ష మేజార్టీతో గెలుపొందకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న జగ్గారెడ్డి మాటాలేమయ్యాయని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అవగాహాన లేకుండా మాట్లాడుతున్నారని, 2013 చట్టంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మించిందా? అన్నింటికి శాశ్వత పరిష్కారం నీరే.. నీరు కావాలంటే ప్రాజెక్టులు వద్దా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి 70యేళ్లు గడుస్తున్న జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించలేదు కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పెట్టిన భిక్షతోనే జగ్గారెడ్డి శాసన సభ్యుడైన సంగతి మరిచాడన్నారు. 2019 ఎన్నికల కోసం కళలు కంటున్న నీకు మళ్లీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు ప్రభుగౌడ్, మానిక్యం, జలాలోద్దీన్‌బాబా, రవి, జివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సింగూర్ ప్రాజెక్టులోకి
15 టిఎంసీల నీరు
జోగిపేట, సెప్టెంబర్ 18: అందోల్ నియోజకవర్గంలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్‌లోకి ఆదివారం సాయంత్రం నాటికి 15 టిఎంసీల వరద నీరు వచ్చి చేరింది. పుల్కల్ మండలంలో నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్‌లో మొత్తం 30 టిఎంసీల నీటి కెపాసిటి ఉండగా నేటికి 15 టిఎంసీల వరకు చేరుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, జహిరాబాద్ తదితర ప్రాంతాల నుండి ఏకదాటిగా నీరు రావడంతో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతుంది. గత ఆరు రోజుల క్రితం 5 టిఎంసీల నీరు ఉండగా ఒకేసారి 15 టిఎంసీల వరకు చేరుకోవడంతో మంజీర నదీ పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ నుండి అందోల్, పుల్కల్, హత్నుర, కౌడిపల్లి, టేక్మాల్, మండలాల మీదుగా ఘణపురం ఆనకట్ట వరకు ఈ నీరు నిలిచింది. మంజీర నదీ కూడా ప్రస్తుతం నీటితో నిండుకుండల మారింది. భారీ వర్షాలే నీరు రావడానికి కారణమని చెప్పవచ్చును. మరో నాలుగు రోజులు వర్షాలు కురిస్తే సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండే అవకాశం(మిగతా 3వ పేజీలో) ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ వద్ద ఇప్పటికే మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సింగూర్‌లోకి నీరు చేరుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ నిండితేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం సింగూర్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం వల్ల దిగువ ప్రాంతాలకు వదలలేకపోయారు. ఈ సారి వేసవిలో ఘణపురం ఆనకట్టకు నీరు వదిలే అవకాశం ఉంది.

వనదుర్గ క్షేత్రంలో భక్తజన సందడి

పాపన్నపేట, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో ఘణపురం ఆనకట్ట పొర్లుతోంది. ఘనపురం ఆనకట్టను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లేదారి ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడింది. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వనదుర్గామాత దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఓడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

వర్గల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం

గజ్వేల్, సెప్టెంబర్ 18: వర్గల్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆద్యాత్మిక, సాంస్కృతిక, బజన కార్యక్రమాల మద్య వినాయకున్ని వర్గల్ పుర వీదుల్లో ఊరేగించి పెద్ద చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆర్యవైశ్య సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పాండురంగం, మండల శాఖ అధ్యక్షుడు విశ్వనాతం, అనుబంద సంఘాల నేతలు నూకా లింగమూర్తి గుప్త, పెద్ది రత్నయ్య, బచ్చు పవన్, నాగరాజు, బద్రినాత్, పెద్ది రాజేశ్, నరేశ్, సింగరీశ్, జగన్, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌లో ..
దౌల్తాబాద్: దౌల్తాబాద్‌లో ఆదివారం గణేషుని శోబాయాత్ర ఘనంగా జరిగింది. వినయకుని విగ్రహాన్ని వాహనంపై పురవీదుల్లో ఊరేగించారు. బాజాబజంత్రీలు, యువకుల ఆటపాటలతో శోబా యాత్ర కొనసాగింది. అనంతరం స్థానిక చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

ఎటిఎంలో చోరీకి
విఫలయత్నం
హత్నూర, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని దౌల్తాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఐడియా-1 ఎటిఎంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసేందుకు విఫల యత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దౌల్తాబాద్ గ్రామంలో రాత్రి పోలీసులు గస్తీ తిరుగుతుండగా గమనించిన దొంగలు వారితో తెచ్చుకున్న వస్తువులను వదిలేసి పరార్ అయ్యారు. ఆదివారం తూఫ్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ సిఐ తిరుపతిరాజ్, ఎస్‌ఐ బాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంను రప్పించారు. ఎంటిఎంలో డబ్బులు చోరీకి గురికాలేదని తెలిపారు.

విలీన గ్రామాల్లో నిత్యం తాగునీటి సరఫరాకు చర్యలు

సిద్దిపేట, సెప్టెంబర్ 18 : సిద్దిపేట మున్సిపాల్టీలో విలీన గ్రామపంచాయతీల్లో నిత్యం తాగునీరు అందించేందుకు అవసరమగు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వెల్లడించారు. మిషన్ భగీరథ పథకంలో 38 కోట్లతో పైపులైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. ఆదివారం 8వ వార్డులో మార్కెట్ యార్డు ట్యాంకు నుండి నర్సాపూర్ తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు పూర్తికాగానే పాత పట్టణంలో వలే విలీన గ్రామాల్లో సైతం నిత్యం తాగునీరు సరఫరా అవుతుందన్నారు. నర్సాపూర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మించాల్సి అవసరం ముందన్నారు. డ్రైనేజీ సమస్యపై మంత్రి హరీష్‌రావు సహకారంతో స్పెషల్ గ్రాంట్ మంజూరు చేయించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని సమస్యలను ప్రాధాన్యత క్రమాన పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. సిద్దిపేట మున్సిపాల్టీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమన్నారు. ప్రజల సహకారంతో మున్సిపాల్టీని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, కౌన్సిలర్లు నర్సింలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.