మెదక్

ఎండ తీవ్రతపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 28: ఎండ తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచి ముందస్తు జాగ్రత్తలను తెలియజేసేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్‌లో ఎండ తీవ్రత - వడదెబ్బ విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఇందుకు ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సుమారు 10లక్షల ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలని, వీటిని ఆర్టీసీ బస్టాండ్లు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కరపత్రాలను పంపిణీ చేయాలని, కేబుల్ నెట్‌వర్క్‌లో ముందస్తు జాగ్రత్తలు ప్రదర్శింపజేయాలన్నారు. ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతాల్లో టెంట్లు, ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, వడదెబ్బకు గురైన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మందులు, ఇతర వైద్య సదుపాయాల లోటు లేకుండా చూడాలన్నారు.
కార్మిక శాఖ ద్వారా పరిశ్రమలు, నిర్మాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రదేశాల్లో పని చేసే కార్మికుల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పశువుల నీటి తొట్టిల నిర్వాహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. సమీక్షలో డిఆర్వో దయానంద్, పశుసంవర్ధక శాఖ జెడి లక్ష్మారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ చక్రవర్తి, ఆర్వీఎం పిఓ యాస్మీన్ భాషా, డిపిఓ సురేష్‌బాబు, డ్వామా పిడి సురేందర్‌కరణ్, కార్మిక శాఖ ఉప కమీషనర్ కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వార్ వన్‌సైడేనా?
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, మార్చి 28: ఉత్కంఠంగా సాగుతుందనుకున్న ఉద్యమ గడ్డ అయిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగనున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వరాష్ట్ర సాధన ఉద్యమ కాలంలోనే టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన నిలిచిన పట్టణ ప్రజలు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో ఇతర పార్టీలను ఏ మేరకు ఆదరిస్తారన్న అభిప్రాయం కొనసాగుతుంది. 34 వార్డులు ఉన్న సిద్దిపేటలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 6 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని ఖా తాను ప్రారంభించింది. మిగిలిన 28 వార్డులకు ఎన్నిక అనివార్యమైనా పోటీ నామమాత్రమేనని టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి స్వంత పట్టణం, మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో టిఆర్‌ఎస్ పార్టీ తన సత్తాను సంపూర్ణంగా చాటుకోవాలనే కృతనిశ్చయంతో ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలతో పాటు ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపినా టిఆర్‌ఎస్‌పై పెద్ద ప్రభావం చూపించబోదని ఆ పార్టీ నేతలు తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఆయా వార్డుల నుంచి టికెట్లు ఆశించి భంగపాటుకుగురైన టిఆర్‌ఎస్ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఇతర పార్టీలకు లాభం చేకూరుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందినా వారు తిరిగి తమ స్వంత గూటిలోకి చేరడం తప్ప మరోమార్గం ఉండదు. పోటీ జరుగుతున్న 28 వార్డుల్లో కాంగ్రెస్‌కానీ, టిడిపికానీ, బిజెపికానీ మొత్తం వార్డులకు అభ్యర్థులను రంగంలోకి దింపకపోగా మెజార్టీకి అవసరమైన వార్డుల్లో కూడా పోటీ చేయడం లేదు. దీంతో సిద్దిపేట బల్దియా పీఠం గులాబి మయం కావడం ఖాయమే. మాజీ చైర్మన్ కడువెర్గు రాజనర్సుకే రెండవ సారి చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఉంటుందని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. మాజీ వైస్ చైర్మన్ చిన్నా కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నా 90 శాతం అవకాశాలు రాజనర్సుకే ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు, 11వ తేదీన ఓట్ల లెక్కింపుతో కుర్చీలో కూర్చునే అదృష్టం ఎవరిని వరిస్తుందన్న తేలిపోనుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే పోటీలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిత్వంపై ఆదారపడుతుందని, టిఆర్‌ఎస్ పార్టీలో కొంత మంది అభ్యర్థులను ఓటర్లు ఆదరించకపోతే తమకు అనుకూలిస్తుందనే ఉద్దేశంతో సదరు అభ్యర్థుల లోపాలను ఎత్తిచూపి లబ్దిపొందేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తంమీద పురిటి గడ్డలో కొనసాగుతున్న లోకల్ వార్ వన్ సైడే అవుతుందని చెప్పవచ్చు.