మెదక్

రైతుల ప్రయోజనాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : వ్యవసాయ మార్కెట్లు, గోదాంలను బలోపేతం చేసి ..రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ కమిటీల అభివృద్ధి చేయటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో చిన్నకోడూడూరు మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు చెక్కులను అందచేశారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ కమిటీలను అభివృద్ధి చేసి ఆదాయం పెంపొదించాలన్నారు. అభివృద్ధి ఫలాలను రైతులకు అందించాలన్నదే తమ సంకల్పమన్నారు. మార్కెట్ కమిటీల్లో రైతులకు అన్ని సదుపాయాలు సమకూర్చటంతో పాటు, వారికి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తామన్నారు. యార్డు నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన 7గురు రైతులు 11.58లక్షల చెక్కులను అందచేశారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపిపి మాణిక్యారెడ్డి, ఎఎంసి చైర్మన్ కుంట వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎఎంసి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏటిగడ్డకిష్టాపూర్ శివారులో
గ్రామాల మధ్య హద్దుల సర్వే
తొగుట, సెప్టెంబర్ 25: మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్‌లో ఆదివారం మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు చేసిన భూముల రిజిస్ట్రేషన్లపై తహశీల్దార్ దేశ్యా ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ శివారులోని సర్వే నెంబర్లు భూముల హద్దులపై డిప్యూటి ఇన్స్‌పెక్టర్ జగన్నాథం, సర్వేయర్లతో కలిసి సర్వే నిర్వహించారు. గ్రామాల హద్దులను ఈ సందర్భంగా గుర్తించారు.
వర్షాలతో దెబ్బతిన్న
కూరగాయ పంటలు
* నష్టపరిహారం కోసం రైతుల మొర
శివ్వంపేట, సెప్టెంబర్ 25: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శివ్వంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో వేసిన టమోట, బెండ, వంకాయ, మిర్చి తదితర కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆదివారం తమ ఆవేధనను వ్యక్తం చేశారు. వర్షాలకు పంటలు నీటిలో మునగడంతో తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. అల్పపీడనం వలన వివిధ రకాల వాణిజ్య పంటలకు కూడా నష్టం జరిగిందన్నారు.