మెదక్

వర్షానికి చిత్తడైన గంజ్‌మైదాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 26: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాకేంద్రం చిత్తడిగా మారింది. కురుస్తున్న వర్షాలతో నిత్యావసర సరుకులు,కూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. వరుణుడు శాంతిచడంతో ప్రతి సోమవారం కొనసాగే కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.మార్కెట్ పూర్తిగా మురికినీరు, బురదతో నిండిపోవడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొందరూ వెనుదిరిగి వెళ్లిపోయినప్పటికి గత్యంతరం లేక కొందరు బురదలోనే వెళ్లి కూరగాయలను కొనుగోలు చేశారు. తీసుకొచ్చిన తమ కూరగాయలు పాడైపోతాయనే భయంతో విక్రయదారులు సైతం అదే బురదలో విక్రయించారు. మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులు ఉండేవి కాదని విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.