మెదక్

ఆరు నెలల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, సెప్టెంబర్ 27: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆరు మాసాల క్రితం జీవితంపై విరక్తి చెందిన గృహిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా తాజాగా తండ్రి కూడా అదే దారిని ఎంచుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిన సంఘటన సదాశివపేట పట్టణ పరిధిలోని సిద్దాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సున్నపులింగం (42) పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం వద్ద సెక్యూరిటి గార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడి అర్ధాంతరంగా తనువు చాలించింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా మారాడు. మృతుడికి పెళ్లీడుకొచ్చిన కూతురు, పదేళ్ల కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటంతో ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు తెలిపారు.