మెదక్

ఆరు కిలోమీటర్లు పొలం గట్లపై నడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, సెప్టెంబర్ 27: భారీవర్షంతో నీట మునిగిన పంట పొలాలను డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, వరదలపై ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు నియమించిన ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లు మంగళవారం మండలంలోని రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని బాల్‌నగర్ శివారులో పరిశీలించారు. సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన పొలం గట్లపై పర్యటించి 120 ఎకరాల వరకు నీట మునిగిన వరిపంటలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా కల్పించారు. భారీ వర్షాలతో హల్దీ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వరిపొలాలు సుమారు 150 ఎకరాల వరకు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి రజత్‌కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌లు సందర్శించి నీట మునిగిన పంటలను స్వయంగా పరిశీలించారు. మరో రెండు, మూడు రోజుల్లో సమగ్రంగా వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారులను డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. మెదక్ మండలంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు పంటలు నీటమునిగినట్లు మండల వ్యవసాయ అధికారి రెబెల్‌సన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయ, రెవెన్యు శాఖల అధికారులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు. పంటలు ఏమేరకు మునిగాయన్న వివరాలు ఇంకా సమగ్ర రాలేవన్నారు. పంట నుండి నీరు వెళితే పూర్తి నష్టం వివరాలు వస్తాయన్నారు. నష్టం వివరాలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేయాలన్నారు. గ్రామం యూనిట్‌గా బాధిత రైతులకు పరిహారం అందుతుందన్నారు.
ఎల్లాపూర్ వద్ద మంజీర వంతెన సందర్శన
పేరూర్ సమీపంలోగల మంజీర నదిపై గల వంతెనను డిప్యూటీ స్పీకర్, జిలాల ప్రత్యేక అధికారి, కలెక్టర్‌లు సందర్శించారు. మంజీర నది ఉద్ధృతంగా ప్రవహించడంతో రెండు రోజులపాటు రాకపోకలు నిలిచిపోయిన విషయం తెల్సిందే. సోమవారం రాత్రి నుండి వాహనాలకు అనుమతించారు. వంతెన వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వరద ఉధృతిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఆర్‌డిఓ నగేశ్, తహశీల్దాన్ అమీనొద్దిన్, నీటి పారుదల శాఖ ఇఇ ఏసయ్య, ఎంపిపి లక్ష్మీకిష్టయ్య, జడ్‌పిటిసి లావణ్యాశ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రెబెల్‌సన్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, నాయకులు కిష్టయ్య తదితరులున్నారు.