మెదక్

మాతల్లి బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 29: మహిళలు మహదానందంతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సంబురాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. సంస్కృతి, సంప్రదాయం, సమిష్టితత్వం, తెలంగాణ జానపద గేయాలకు దర్పణం పడుతూ కేవలం మహిళలు మాత్రమే పాల్గొనే పండుగల్లో ఈ పండుగ ప్రత్యేకత. తెలంగాణ జిల్లాల్లో అత్యంత వేడుకగా, మహిళలు ఇష్టంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ మహాలయ అమాస్య నాటి నుంచి దుర్గాష్టమి వరకు సంతోషంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండుగ తెలంగాణాలో విభిన్న సంస్కృతి, సాంప్రదాయాల మద్య ఏర్పడింది. మహిళలు తమ బాధలను, కష్టాలను, తమలోనే దిగమింగుకుని, పుట్టింటికి వచ్చినప్పుడు ఆ బాధల నుంచి విముక్తి పొందిన అనుభూతి పొందుతారనే విశ్వాసం నెలకొంది. బతుకమ్మ పండుగ గురించి రకరకాలుగా కథలు చెబుతున్నా ఆడపడుచుల గొంతుల్లోంచి జాలువారే జానపద గేయాలకు వేధికగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోగాల భారీన పడి ఆడపిల్లలు మృతి చెందుతుండటంతో వారి ఆయుష్షును పెంచాలనే ఉద్దేశంతోనే ఈశ్వరుడి ఇష్టసఖి అయిన గౌరమ్మ (బతుకమ్మ)కు మహిళలు పూజిస్తారని చెప్పుకోవడం విశేషం. రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించడం ద్వారా మహిళల జీవితాలు కూడా రంగుల హరివిల్లుగా వికసించాలని కాంక్షించేవారని చెప్పుకుంటారు. మహాలయ అమావాస్య నాటి సాయంత్రం వేళ బతుకమ్మ పండగ సంబరాల వారోత్సవం ప్రారంభమవుతుంది. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పేర్కొంటారు. చివరి రోజున జరుపుకునే బతుకమ్మను పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన బతుకమ్మ పండుగ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. బతుకమ్మ పండుగ వస్తుందంటే ప్రతి ఇంట్లో బాలికలు, యువతులు, పండు ముత్తయిదువలతో సందడి నెలకొంటుంది. తొమ్మిది రోజులు వీధులన్నీ పూల తోటల్లా కనిపిస్తాయి. తంగేడు, గూనుగు, గడ్డిపువ్వులు, అడవి చేమంతులు, బంతిపూలు, చేమంతి, ముద్దమందారం తదితర పూలను సేకరించి కనులకింపైన బతుకమ్మలను పేర్చుకుంటారు. వేలాది రూపాయల ఖరీదు చేసే కొత్త బట్టలు ధరించడం, నగలను అలంకరించుకుని మహిళలు నృత్య బంగిమలతో పురాణ కథలు, చారిత్రక, జానపద, భక్తి ప్రధానమైన పలు పాటలను ఉయ్యాలో అంటూ ఆలపిస్తారు. కాలియందియెలు గల్లుమనగా, గాజుల సవ్వడితో సృతితప్పకుండ చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆకట్టుకునే పాటలతో ఆటలాడుతారు. పురాణాలు, రాజుల చరిత్ర, అత్తాకోడళ్ల పొట్లాటలు, కట్న కానుకలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పుట్టింటి ఆత్మీయ అనురాగాలు తదితర విషయాలపై పాటల రూపంలో పాడుతారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగ రోజున సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగ సంబరాల్లో పాల్గొని పెద్ద బతుకమ్మను చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. పసుపు,కుంకుమలను ఒకచోట కలిపి మహిళలంతా ఒకరికి ఒకరు వాయనంగా ఇచ్చుకుంటారు. కల్మశం, కపటాలు లేకుండా అందరు కలిసిపోతారు. వివాహమైన తరువాత విడిపోయిన చిన్ననాటి స్నేహితులు బతుకమ్మ పండుగకు తప్పనిసరిగా పుట్టింటికి రావడంతో అంత ఒకచోట చేరి గత స్మృతులను నెమరువేసుకుంటారు. కులం, మతం, పేద, ధనిక, అధికార హోదాలన్నింటిని పక్కన పెట్టి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి ఉండేందుకే ఇలాంటి పండుగలను సమానత్వాన్ని పండుగల ద్వారా చాటి చెప్పారు. ఇలాంటి సంప్రదాయ పండుగలు వచ్చినప్పుడు రోజు కూలీలకు ఉపాధి చూపిస్తున్నాయి. యాంత్రిక జీవనానికి అలవాటుపడిన నేటి సమాజంలో కూలీల ప్రాధాన్యత పెరిగింది. అటవి ప్రాంతాల్లో ప్రకృతి ప్రసాదించిన పూలను తీసుకువచ్చి విక్రయించి నిరుపేదలు ఉపాధి పొందుతున్నారు. పూల కొరత వల్ల ఈత, తాటి, వెదురు బొంగులతో బతుకమ్మలను తయారు చేసి వాటికి రంగుల కాగితం పూలను అలకరించి విక్రయిస్తున్నారు. మహిళలు ఎంతో ఇష్టంగా వంటిపై ధరించే గాజులు, బాలికల రెడిమేడ్ దుస్తువులు, అలంకార సామాగ్రి (కాస్మోటిక్స్), ఆభరణాల తయారీదారులుకు భళే గిరాకి వస్తోంది. ఎంత పాశ్చాత్య పోకడలకు వెళ్లినా పండుగ వచ్చిందంటే మహిళలు సంప్రదాయ పద్దతులను పాటించడం పరిపాటి. తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు ప్రపంచ దేశాలకు విస్తరించిందంటే మన పండుగుల ప్రాశస్తానికి నిదర్శనం. న్యూజెర్సీ, మలేషియా, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో నివాసం ఉంటున్న భారతీయ మహిళలు బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించడం శుభపరిణామం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యేడాది పుష్కళంగా వర్షాలు కురియడంతో జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నెల 30న మహాలయా అమాస్యతో ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 9వ తేదీతో ముగియనున్నాయి.