మెదక్

మర్కుక్ గ్రామంలో డెంగీ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, సెప్టెంబర్ 30: మండల పరిధిలోని మర్కుక్ గ్రామంలో డెంగీ వ్యాధి ప్రబలడంతో బాలుడు ఆసుపత్రిలో చేరడంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయ. వివరాల్లోకి వెళ్తే మర్కుక్ గ్రామానికి చెందిన పోకల రామవ్వ, పోకల యశ్వంత్‌లు గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. యశ్వంత్ తండ్రి రాజు గ్రామంలో పిఎంపి డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ 10 రోజుల నుంచి ఆయనే వైద్యం అందిస్తున్నాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోగా 4 రోజుల క్రితం గజ్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించగా అక్కడి వైద్యులు యశ్వంత్‌కు డెంగీ లక్షణాలున్నాయని తెలిపి వీరిని వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాలని సూచించారు. దీంతో రాజు రామవ్వను, యశ్వంత్‌లను గురువారం రోజు ఇసిఐఎల్ అంకుర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నాడు. కాగా గ్రామంలో డెంగీ వ్యాధి ప్రబలిందని వైద్యులు గ్రామంలో ఎలాంటి వైద్యం చేయకపోగా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
వైద్య సేవలందిస్తున్నాం
అయితే ఫోన్ ద్వారా స్థానిక డాక్టర్ రవికుమార్‌ను వివరణ కోరగా తమకు సమాచారం అందిన వెంటనే గ్రామంలో సిబ్బందితో పర్యటించామని, మందులు కూడా అందిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా మర్కుక్ ఆసుపత్రి సిబ్బందినే కాకుండా ములుగు ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది సహకారం కూడా తీసుకొని గ్రామాలలో క్యాంప్‌ను నిర్వహించి వ్యాధికి సంబందించిన మందులు అందజేస్తామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.