మెదక్

పాడితో కుటుంబాలకు నిరంతర ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, అక్టోబర్ 3: పాడితోనే కుటుంబానికి నిరంతర ఆదాయం వస్తుందని దాంతో ఆ కుటుంబం బాగుంటుందని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని యావపూర్ గ్రామంలో చిన్న తరహా విజయ డైరీ, చిన్న తరహా పాల శీతలీకరన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రైతు కుటుంబం కేవలం వ్యవసాయం పైననే ఆదారపడి ఉండవద్దని వ్యవసాయంలో నష్టాలు వచ్చినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ఆదాయాలు ఉండాలని సూచించారు. మేకలు, గొర్రెలు, కోళ్ళు, గేదెలు కూరగాయలు అభివృద్ది చేసుకున్నట్లైతే ఆ కుటుంబానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం గొర్రెలు, గేదెలు, కోళ్ళను సబ్సీడీపై సరఫరా చేస్తుందని చెప్పారు. హల్దీ వాగుపై మరో 4 చెక్‌డ్యాంలు నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. విజయ డైరీకి పాలుపోసే రైతులకు లీటరుకు 4 రూపాయలు అదనంగా ఇస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఅర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, ఎంపిపి శ్రీనివాస్, జెడ్‌పిటిసి సుమన విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ గోరెభీ, నేతలు బాబుల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఎంపి సమక్ష్యంలో టిఅర్‌ఎస్‌లో చేరారు.