మెదక్

ఘనంగా మహనీయుల జయంతి వేడుకల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 31: సంక్షేమ పథకాల స్పూర్తిప్రదాతలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులైన బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను గతంలో కంటే భినంగా అందిరి అభిరుచుల మేరకు నిర్వహిస్తామని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఎప్రిల్ 5,11,14తేదీల్లో జరగనున్న వేడుకలపై ఎస్సీ,ఎస్టీ,బిసి సంక్షేమ శాఖలు, వివిధ కుల సంఘాల ప్రతి నిధులతో గురువారం ఆయన కలెక్టరేట్ సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎజెసి మాట్లాడుతూ కేటాయించే నిధులతో నిబద్ధత, అంకితభావంతో వేడుకలు నిర్వహించాలని అధికారులు సంఘాల ప్రతినిధులకు సూచించారు. మహానీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆచరించేలా కరపత్రాలు రూంపొంచి పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, కార్యాలయాల్లో మహానీయుల వేడుకలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మహానీయుల జీవిత చరిత్రలపై జిల్లా స్థాయిలో వక్తృత్వ, వ్యాసరచన, పాటల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని, ఇందుకు కుల సంఘాల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సభా మర్యాదను పాటించేలా వక్తలను సంఘాలను ప్రతినిధులు ఎంపిక చేసుకోవాలని, సమస్యలను ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానటరింగ్ కమిటి సమావేశం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులందరూ జన్మదిన వేడుకల్లో విధిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. మహానీయుల విగ్రహాల వద్ద ఉన్న ఆశ్లీల పోస్టర్లు తొలగించాలని, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల మాదిరిగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. మహానీయుల కృషి ఫతిలంగా సంక్షేమ శాఖలు ఏర్పడినందున జిల్లాకేంద్రంలోనే కాకుండ వసతి గృహాలు, మండల కేంద్రాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడి చరణ్‌దాస్, సాంఘీక సంక్షేమ అధికారి రామారావు, కుల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.