మెదక్

శ్రీ మహాలక్ష్మీదేవిగా ఏడుపాయల వనదుర్గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 7: శుద్ద సత్వస్వరూపిణి అయిన జగత్‌జనని విష్ణు భగవానుని హృదయేశ్వరి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో ఏడుపాయల వనదుర్గ్భావాని మాత భక్తజనావలికి దర్శనమిచ్చింది. ఏడుపాయల్లో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో వనదుర్గాదేవి భక్తజనావళికి దర్శనమిచ్చింది. గోఖుల్ షెడ్‌లోని ఉత్సవ మండలంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో పెసర రంగు పట్టువస్త్రంలో అమ్మవారు అత్యంత సుందరంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద బ్రాహ్మణ పండితులు సనాతన శర్మ, ఆలయ అర్చకులు నర్సింహ్మాచారి, ఆర్.శంకర్‌శర్మ, పార్థివశర్మ, మురళీధర్, రాజశేఖర్, నాగరాజు, రాము తదితర అర్చకులు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అత్యంత సుందరంగా అలంకరించి వేద మంత్రోచ్చరణల మధ్య భక్తుల జయజయ ధ్వనాల నడుమ అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాలక్ష్మీదేవి అమ్మవారు 18 చేతులతో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుద్దం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, శంఖం గంట, శూలం, పాశం, సుదర్శనచక్రం ధరించి ప్రవాలమని వర్ణంతో తారమపువ్వుపై చిరునవ్వుతో పలకరించే త్రిమూర్తియే మహాలక్ష్మీ అవతారంతో భక్తులను మంత్రముగ్దులను చేస్తూ అత్యంత ఆకర్షనీయంగా దర్శినమిచ్చింది. శ్రీ మహాలక్ష్మీని కొలిస్తే వారి కుటుంభాల్లో సఖల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని వేద బ్రాహ్మణ పండితులు సనాతన శర్మ తెలిపారు. భక్తులు పెద్దయేత్తున తరలివచ్చి ఉత్సవ మండలంలో శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకొని కుంకుమార్చన తదిత విశేషాలంకరణ పూజలు చేశారు. ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, పి.మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ భక్తులకు అందుబాటులో ఉండి తమ తమ సేవలందించారు.