మెదక్

విద్యార్థులకు సాంకేతిక పరిశోధనలపై ఆసక్తి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 9 : విద్యార్థులు చిన్ననాటి నుండి సాంకేతిక పరిశోధనలపై అవగాహన పెంపొందిస్తే రేపతి తరాలకు కొత్త చైతన్యం, పట్టుదల కలుగుతాయని..్భవిష్యత్తులో గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదిగే అవకాశం ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక మల్ట్ఫిర్పస్ హైస్కూల్‌లో సతీష్ దావన్ స్పేస్ సెంటర్ (షార్) శ్రీహరికోట ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరిక్ష రంగంలో నూతన జరుగుతున్న ఆవిష్కరణల వల్ల అన్ని రంగాలకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సాంకేతికత రోజురోజుకు పెరుగుతుందని, సాంకితికతను మానవ సమాజ అభివృద్ధికి దోహద పడాలన్నారు. ప్రపంచమంత అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని, పెరుగుతున్న టెక్నాలజీ కేవలం మంచికే వినియోగించాలన్నారు. టెక్నాలజీతో మంచి, చెడు ఉందని మంత్రి హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీని పక్కదారి పడితే ఏంతో ప్రమాదమన్నారు. అధిక వర్షాలు, తుఫాన్‌లు, వాతవారణ వివరాలను టెక్నాలజీతో ముందుగానే తెలుసుకొని నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఇస్రొ శాటిలైట్‌తో ఇరిగేషన్ శాఖ ఒప్పందం చేసుకుందన్నారు. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ఎంత పరిమాణం ఉందని, నీరు ఎంతో ఖచ్చితంగా చెప్పె అవకాశం ఉందన్నారు. ఈరోజు టెలికాం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పరిశోధనలు ఏంతోగానే దోహదపడుతున్నాయన్నారు. ఇస్రోతో కలసి పనిచేయటం వల్ల భవిష్యత్తు తరానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. షార్ అంతర్జాల వారోత్సవాలు సిద్దిపేటలో ఏర్పాటు చేయటం నిర్వహకులను అభినందించారు. సిద్దిపేట ప్రాంత విద్యార్థులకు ఎగ్జిబిషన్‌ను చూపించాలని కోరారు. శార్ డైరెక్టర్ కున్ని కృష్ణన్ మాట్లాడుతూ ప్రతియేట అక్టోబర్ 4నుండి 10 వరకు అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్గించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసంవత్సరం తెలంగాణ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనలపై రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు అవగాహన కల్పిస్తున్నామని, ఈ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీంతో విద్యార్థులు అంతరిక్ష పరిశోదనలపై అవగాహన పెంచుకొని భవిష్యత్తులో శాస్తవ్రేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఇస్ట్రో డిప్యూటీ డైరెక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగిరథ, మిషన్ కాకతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు మ్యాపింగ్‌కు ఏంతో దోహద పడుతుందన్నారు. అంతరిక్ష పరిశోధనలకు సర్కార్ బాసటగా నిలుస్తుందన్నారు. దీంతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు. నేటి విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో గొప్ప శాస్తవ్రేత్తలుగా రాణించి దేశానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ షార్ వారోత్సవాలు పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. ఇస్రో శాస్తవ్రేత్తలు సిద్దిపేటకు రావటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. సెలవు రోజుల్లో కాకుండ వేలాది మంది విద్యార్థుల మధ్య పెద్దఎత్తున వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఆనంతరం విద్యార్థుల మల్ట్ఫిర్పస్ స్కూల్ సతీష్ దావన్ స్పేస్ సెంటర్ ఏగ్జిబిషన్‌ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించి, ఆనంతరం షార్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో షార్ ప్రతినిధులు వీరబత్తిని సురేష్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డిఎస్పీ నర్సింహరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.