బిజినెస్

మదుపరులలో విశ్వసనీయతను పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 24: మదుపరులలో విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. ‘నేడు భారత్‌ను ఓ వెలుగు రేఖగా ప్రపంచం అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్నప్పటికీ భారత్ మాత్రమే ప్రస్తుతం 7 శాతానికిపైగా వృద్ధిరేటును అందుకునే స్థితిలో ఉంది. ప్రపంచ అభిప్రాయానికి ఇదే కారణం. భారత్‌లో మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారు. భారత్‌పట్ల మదుపరులలో అనుకూల అభిప్రాయమే ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మాపై తప్పక ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతాం. అధిక ప్రభుత్వ వ్యయంపై దృష్టి పెడతాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను ఆకర్షించేలా ముందుకెళ్తాం.’ అన్నారు. దేశ జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత అంచనా ప్రకారం 7-7.5 శాతంగా ఉంటే, అంది మున్ముందు మరింత పైకి దూసుకెళ్తుందని, అయితే ఇందుకు కార్పొరేట్ రంగం నుంచి సహకారం అవసరమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా, ఐరోపా మార్కెట్ల నుంచి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇంతకుముందు అధిక ముడి చమురు ధరలు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తే, ఇప్పుడు అదే ప్రపంచానికి తక్కువ ముడి చమురు ధరల దిగులు పట్టుకుందని అన్నారు. మొత్తంగా తమ ప్రభుత్వం సంస్కరణలను ఆపబోదని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన అన్ని నిర్ణయాలను వేగంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు.