క్రీడాభూమి

మెక్‌హాలె సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ టెన్నిస్

నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి ముగురుజాపై విజయం
ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 13: ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి గాబినే ముగురుజాకు చుక్కెదురైంది. క్రిస్టినా మెక్‌హాలె ఆమెపై 7-5, 6-1 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అమెరికాకు చెందిన మెక్‌హాలె ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 63వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ముగురుజా విజయం ఖాయమని క్రీడా పండితులు జోస్యం చెప్పారు. అయితే, వారి అంచనాలకు భిన్నంగా మెక్‌హాలె చెలరేగిపోయింది. మొదటి సెట్‌లో ముగురుజా నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ తట్టుకొని నిలిచింది. రెండో సెట్‌లో మెక్‌హాలెకు ఏ దశలోనూ ముగురుజా దీటుగా నిలవలేకపోయింది. కాగా, ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి కూడా రెండో రౌండ్ నుంచి నిష్క్రమించింది. ఆమెను షుయ్ జాంగ్ 4-6, 7-6, 7-5 తేడాతో అతి కష్టం మీద ఓడించింది. స్లొయేన్ స్టెఫెన్స్‌పై యూగెనీ బుచార్డ్ 7-5, 7-5 స్కోరుతో గెలిచింది. అనా ఇవానోవిచ్ 2-6, 6-2, 7-6 ఆధిక్యంతో కామిలా గియార్జీపై గెలుపొందగా, జరినా దియాస్‌పై విక్టోరియా అజరెన్కా 2-6, 6-4, 7-6 తేడాతో విజయం సాధించింది. యనినా విక్‌మేయర్‌పై సమంతా స్టొసుర్ 2-6, 6-4, 7-6 తేడాతో నెగ్గింది. కరోలినా ప్లిస్కోవా 6-4, 6-4 ఆధిక్యంతో షెల్బీ రోజర్స్‌ను ఓడించింది. (చిత్రం) క్రిస్టినా మెక్‌హాలె
ముర్రే ముందంజ
పురుషుల విభాగంలో ఆండీ ముర్రే 6-4, 7-6 తేడాతో మార్సెల్ గ్రానొలెర్స్‌పై విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు. స్టానిస్లాస్ వావ్రిన్కా 6-3, 6-2 ఆధిక్యంతో ఇల్యా మార్చెన్కోను, డేవిడ్ గోఫిన్ 3-6, 6-3, 7-6 స్కోరుతో ఫ్రానె్సస్ టియాఫోను ఓడించారు. ఆండ్రి కుజ్నెత్సొవ్ 6-4, 6-2 తేడాతో జెరెమీ చార్డీపై గెలిచాడు. బొర్నా కొరిక్ 6-2, 6-2 స్కోరుతో తొమాజ్ బెలుసీని ఇంటిదారి పట్టించాడు.