మెదక్

బోరు బావిలో..పసివాడి ప్రాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్కల్, నవంబర్ 28: బోరుబావిలో పడి పోయిన బాలుడి ప్రాణాలు కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పుల్కల్ మండల పరిధిలోని బొమ్మరెడ్డిగూడెంలో కుమ్మరి రాములుకు చెందిన పొలంలో శుక్రవారం రాత్రి రెండు బోర్లు తవ్వించారు. వేసిన బోర్లలో చుక్క నీరు రాకపోవడంతో మరో వేసేందుకు ప్రయత్నించి తెల్లవారడంతో బోరు డ్రిల్లింగ్ చేయడంలో జాప్యం చేశారు. ఈ క్రమంలో రాములు పొలం పక్కనే ఉన్న బైరు సాయిలు-మొగులమ్మ దంపతులకు చెందిన చిన్న కుమారుడు రాకేష్ ఉదయం 6.30గంటల ప్రాంతంలో అన్న బాల్‌రాజ్‌తో కలిసి ఆడుకునేందుకు బోరు బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాకేష్ బోరు బావిలో పడిపోయాడు. గమనించిన అన్న బాల్‌రాజ్ రాకేష్‌ను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమైనాడు. అక్కడి నుండి రోధిస్తూ బాల్‌రాజ్ బోర్ మోటర్ సిబ్బందికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కుటుంబీకులకు సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పుల్కల్ ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాకేష్ ప్రాణాలు కాపాడేందుకు ఎస్‌ఐ సత్యనారాయణ 108 సిబ్బందికి సమాచారం అందించి బోరు బావిలో ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ నగేష్, సిఐ నాగయ్య, తహసీల్ధార్ శివరాం చేరుకొని జెసిబి, హిటాచీలతో బోరుబావి వద్ద తవ్వకాలను ప్రారంభించారు. సహాయక చర్యలు చేపట్టడంలో పెద్ద పెద్ద రాళ్లు తీవ్ర అంతరాయం కలిగిస్తుండడంతో అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికి ఏమాత్రం వెనుకాడని అధికారులు రాకేష్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా సంఘటన స్థలాన్ని జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సందర్శించి సహాయక చర్యలు పర్యవెక్షిస్తూ కుటుంబీకులను ఓదారుస్తున్నారు. రాకేష్ తండ్రి నిరుపేద కావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు రాకేష్ క్షేమంగా తిరిగి రావాలని రోధిస్తూనే ఉన్నారు. దీంతో గ్రామంలోనే కాకుండా మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఘటన స్థలానికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాధచాయలు అలుముకున్నాయి. జిల్లాలో ఎన్నడు కనివిని ఎరుగని రాకేష్ ఘటనతో జిల్లావ్యాప్తంగా ఉత్కంటకు గురి చేసింది.

కలిసికట్టుగా విజయం సాధిద్దాం

నారాయణఖేడ్ నవంబర్ 28: కార్యకర్తలే పార్టీకి పునాది అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామెదార్ రాజనర్సింహ అన్నారు. ఖేడ్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం ఖేడ్ పట్టంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎంపి సురేష్‌శెట్కార్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో అయన మాట్లాడుతూ పార్టీలో గ్రూపులు ఉన్నా పక్కకుపెట్టి కలిసి కట్టుగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డికి ఉప ఎన్నికల్లో ఓట్లేసీ గెలిపించాలని పిలుపునిచ్చారు. వర్గాల జోలికి వెళ్లితే సర్వనాశనం అవుతారని అది మరిచి పోవాలని కార్యకర్తలకు సూచించారు. గతంలో సురేష్‌శెట్కార్, కిష్టారెడ్డి కుటుంబీకులు మధ్య ఉన్న విబేధాలు సమసిపోయాయని అన్నారు. సురేష్‌శెట్కార్ నాయకత్వంలో పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డిని గెలిపించాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుదలతో ఒట్లేసీ గెలిపించే వ్యక్తులని ఆత్మగౌరవం ఉన్నవారన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మంత్రుల మాటలను నమ్మవద్దన్నారు. అభివృద్ధి పేరుతో ఖేడ్‌లో ప్రజలను మొసం చేయాలని ప్రయత్నం చేసిన వారు కెసిఆర్ మాటలకు మోసపోరని దామోదార్ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8సార్లు పట్టం కట్టిన ఘనత ఖేడ్ ప్రజలకు ఉందన్నారు. మంత్రులు లేనిపోని కల్లబొల్లి మాటలుచెబుతూ కులాల వారీగా ఓటర్లను మొసం చేస్తున్నారని వారు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపిస్తారని అన్నారు. మాజీ ఎంపి సురేష్‌శెట్కార్ మాట్లాడుతూ 60 ఏళ్లుగా ఖేడ్‌ను పాలించిన పాలకులు వెనుకబడేశారని అరోపణ చేయడం మానుకోవాలని టిఆర్‌ఎస్ నాయకులకు మంత్రులకు హితవు పలికారు. ఖేడ్‌లో ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని డిగ్రీకాలేజి, పాలిటెక్నిక్ కళాశాల, ప్రతి మండలానికి జూనియర్ కాలేజిలు, కస్తూర్భా పాఠశాలలు మంజూరుచేసి నిరుపే బాలికలకు, విద్యార్థులను అదుకున్నామని తెలిపారు. రోడ్లు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేసి ఎస్సీ బీసీ, ఎస్టీలకు ఆదుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న సంజివరెడ్డికి వచ్చే ఉప ఉన్నికల్లో ఓట్లేసీ గెలిపించాలని నియోజక వర్గం కార్యకర్తలకు నాయకులకు పిలుపు నిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టిఆర్‌ఎస్ అమలు చేయలేదన్నారు. తప్ప కుండా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఎమిటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కోట్టే సత్తా కెసిఅర్‌కు లేదనే విషయం ఉప ఎన్నికల్లో నిరుపించాలని అయన పిలునిచ్చారు. డిసిసి అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కెసిఅర్ రైతులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు అరోపించారు. బ్యాంకు రుణాలు మాఫీలో విఫలం, ఉద్యోగాలు ఇస్తామని ఇంత వరకు నోటిఫికేషన్ వేయడంలేదని నిరుద్యోగులు ఆవేదనతో ఉన్నారని మండి పడ్డారు. డబూల్ బేడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఏక్కడా ఒక ఇల్లు ఇవ్వలేదని తెలిపారు. ఎస్సీలకు మూడు ఎకరాలు భూములు ఇస్తామని ఎవరికీ ఇవ్వడంలేదని అందులో పూర్తిగా విఫలమైయరని అరోపించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అభ్యర్థి సంజివరెడ్డి, మాజీ డిసిసిబి బ్యాంకు చైర్మెన్ .పాల్‌రెడ్డి, శ్రావన్‌కుమార్‌రెడ్డి సోమేశ్వర్, ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు శంకరయ్యస్వామి, రషిద్, అనంద్‌శెట్కార్, సంగమేశ్వర్, సత్యనారాయణ, సంగయ్య న్యాయవాది, జెడ్‌పిటిసి సంఘితాశెట్కార్, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తహెర్‌అల్లీ, పండరిరెడ్డి, అశోక్, అశోక్‌రెడ్డి సంగారెడ్డి, యువజన నాయకుడు వినోద్‌పాటిల్, హన్మంతు, సురేందర్, మానిక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.