మెదక్

అయతలో అంతటా తానై పర్యవేక్షించిన మంత్రి హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 26: భక్తులకు సర్దిచెప్పడంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోమారు సఫలీకృతులయ్యారు. ఆరు మాసాల క్రితం జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించగా వేలాది మంది భక్తులు ఇక్కట్లకు గురికాగా పోలీసులు నిస్సహాయతలో పడిపోయారు. వర్షం కురియడంతో రోడ్లన్నీ బురదమయంగా మారగా ఓ కారు అందులో ఇరుక్కుపోయి మరిన్ని ఇబ్బందులు కలిగించింది. ఈ నేపథ్యంలో పుష్కరాలను పర్యవేక్షిస్తూ అటువైపు వెళ్లి హరీష్‌రావు స్వయంగా కారును నెట్టి బురద నుంచి బయటపడవేసి ట్రాఫిక్‌లో ఇరుక్కున్న భక్తులకు విముక్తి కల్పించారు. జగత్ శాంతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహింపజేస్తున్న అయుత చండీ మహాయాగానికి కూడా లక్షలాది మంది హాజరు కావడంతో క్యూలైన్లలో బారులు తీరారు. ఎముకలు కొరికే చలిలో ఇరుక్కుపోయిన భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు శుక్రవారం రాత్రి మంత్రి హరీష్‌రావు, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌తో కలిసి తనదైన శైలీలో స్పందించారు. బారికేడ్లకు బయట నిలబడిన మంత్రి భక్తులను చూస్తూ నవ్వులు చిందిస్తూ త్వరత్వరగా వెళ్లాలని పరుగులు పెట్టించారు. మంత్రి హరీష్‌రావు పుణ్యమా అని తాము త్వరగా దర్శనం చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నామని అనేక మంది భక్తులు సంతోషం వ్యక్తం చేసారు. భోజనశాల వద్దకు సైతం వెళ్లి సంయమనం పాటించి తృప్తిగా భోజనం చేయాలంటూ భక్తులకు నచ్చజెప్పడం ఒక్క హరీష్‌రావుకే సాధ్యమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండటం, అదే సమయంలో ముఖ్య అతిథులు, వేద పండితులను సిఎం సత్కరించే కార్యక్రమంలో నిమగ్నమైన మంత్రి హరీష్‌రావు మరోమారు చక్కగా స్పందించారు. వ్యాఖ్యాత వద్దకు చేరుకున్న మంత్రి హరీష్‌రావు క్యూ లైన్‌లో ఉన్న భక్తులు సహనం వహించాలని, యాగశాలలో క్యూలో ఉన్న భక్తులు త్వరగా దర్శించుకుని వెళ్లాలని, యాగశాలలను సాయంత్రానికి శుభ్రం చేయాలని, స్వియ నియంత్రణ పాటించాలని మాట్లాడే తాను హరీష్‌రావును అంటూ భక్తులకు సంకేతాలు పంపించారు.