తెలంగాణ

మేడారంలో పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో గురువారం సమ్మక్క, సారలమ్మల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా, నేడు సమ్మక్కను తీసుకువస్తున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు సులభంగా దర్శనం చేసుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు రాత్రి 7 గంటల సమయానికి గద్దెపైకి సమ్మక్క రానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి జాతరకు పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేశారు.