తెలంగాణ

63 మందుల కంపెనీల లైసెన్సులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌ : నాణ్యమైన మందులను ఉత్పత్తి చేయని 63 కంపెనీల లైసెన్సులను రద్దు చేసినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ సంచాలకుడు అకున్‌సబర్వాల్‌ అన్నారు. గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి బ్యాంకును పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 139 బ్లడ్‌ బ్యాంకులు ఉండగా నిబంధనలు పాటించని 110 బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు మందుల షాపులతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిల్లోని మందుల నాణ్యతను పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు 160 శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌లకు పంపినట్లు వివరించారు.