మీ వ్యూస్

అందాల పారిజాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికి చిరునామా ఆమెదే. విశ్వసుందరీమణులెందరున్నా మణికిరీటం మాత్రం ఆమెకే. ఆమె ప్రతి కదలికలో అందం జాలువారుతుంది. ఆమెను చూస్తే కోట్ల గుండెలు ఝల్లుమంటాయి. ఆమె నటిస్తే కళ్ళు తెరకే అప్పజెప్పబడతాయి. ఆమె డాన్స్ చేస్తుంటే తెరమీద ఆమె తప్ప ఇంకెవరూ కనిపించరు. స్ర్తిది అందమా ఏదీ అంటే వేలు నీవైపే చూపుతుంది.
బెబ్బులి పులి, సర్దార్ పాపారాయుడు, చాల్‌బాజ్ సినిమాలేవీ గుర్తులేదు. కానీ అందులోని నీ నవ్వు మాత్రమే గుర్తుండిపోతుంది. కోట్లాది ప్రజల గుండె లయ తప్పించిన ఓ చాందినీ, మగవారి ఆరాధ్య దేవతవి నువ్వు, ఆడవారు అనుకరించే బ్యూటీ సింబల్‌వి నువ్వు. శ్రీదేవిలా ఉన్నానా అంటూ అమ్మాయిలూ, శ్రీదేవి పోలికలతో రంగానే్నలిన నటీమణులు. ఇల్లాలంటే నీలా అనురాగ దేవతలా ఉండాలని ఆశపడ్డారు మగవారు. పురుషాధిక్య సినీ ప్రపంచంలో స్ర్తి శక్తినీ, అందాన్ని చాటినావు. నీ కాల్షీట్లకోసం దర్శక నిర్మాతలు పడిగాపులు పడేట్లు చేసినావు. పదారువేలమంది గోపికలతో ఉన్న కృష్ణుణ్ణే చూపించే సినిమావోళ్ళు నీ దగ్గరికొచ్చినపుడు మాత్రం ఒక రాధ ఇద్దరు కృష్ణులను చూ పించి నీకే పెద్ద పీట వేస్తారు. నిన్ను చూసి కథలల్లబడ్డాయి, నీ కోసం కథలు రాయబడ్డాయి. నిన్నుచూసి, నీ నిబద్ధత చూసి వేరే భాషల నటులందరూ దక్షిణాదికొచ్చి నటనలో ఓనమాలు నేర్చుకెళ్లారు.
అందరూ సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం తపిస్తారు, కానీ తమ సినిమాల్లో శ్రీదేవి ఒక్కసారి నటిస్తే చాలని పరితపించేవారు నిర్మాతలు. ఎవరైనా తమ సినిమాలలో శ్రీదేవి వుంటే బాగుండునని ఆశపడ్డారు. సినీ రంగంలో రెడ్ కార్పెట్ నీది. అలాంటి అందం, క్రమశిక్షణ నీది. నీవే భాషలో నటించినా విజయబావుటానెగరేశావు. అగ్రశేణిలో వెలిగే తారవైనావు. తరాలేవైనా అందరూ నీ అందానికి దాసోహమే. తరతరాలకూ నిలిచిపోయిన సొగసు సిరిదేవివి నీవు.
4వ ఏట నటనారంగంలో అడుగిడి 54వ ఏట దేవతల లోకానికి వెళ్లిపోయావ్. కేవలం నటనకోసమే పుట్టిన నిలువెత్తు సుందర చిత్రపటం నీవు. అమ్మ లేకుండా అడుగు వెయ్యలేదు. అమ్మ మాట జవదాటలేదు. ఆమె చితికి నిప్పంటించిన కొడుకువైనావు.
నీవు నటిస్తే చాలు సినిమాలు శతదినోత్సవాలూ జరుపుకున్నాయి. శతవసంతాలకోకిల కంటికెదురుగా, వీనులకు, కన్నులకు విందు చేస్తుంటే బాక్సాఫీసులు మోత మోగించాయి. చిత్రసీమ ద్వారా నీకు కాదు, నీ ద్వారా చిత్రసీమకు గుర్తింపు వచ్చింది. బూచాడమ్మా అంటూ బడిపంతులులో చిన్నగా చిలిపి అల్లరి చేసి, మనోహరుడైన కృష్ణుని రూపంలో మనసులు దోచిన యశోదా కృష్ణుడవైనావు. జూలీ అంటూ టీనేజ్‌కి పాఠాలు చెప్పి పదహారేళ్ళ అమ్మాయి ప్రాయానికి పసిడి వనె్నలు సిరిమల్లెపువ్వువయ్యావు. నీ అందానికి పట్ట్భాషేకం చేస్తూ 500 రోజులు ప్రేమాభిషేకం జరిపించారు ముగ్ధులైన ప్రేక్షకలోకం. వేటగాళ్ళను, బెబ్బులిపులులను, కొదమసింహాలను మచ్చిక చేసుకున్న ఆకుచాటు పిందెవి నువ్వు. వెల్లువొచ్చిన గోదావరి నువ్వు. కేవలం గ్లామరే, నటనేదీ అని పెదవి విరిచిన పెద్దలే భేష్ అనేట్లు ఆకలి రాజ్యంలో కన్నీళ్ళొలికింపజేశావు. వసంతకోకిలవై వహ్వా అనిపించావు. నిన్ను చూశాకా దర్శకేంద్రునికి అన్పించింది ఈ అందాన్ని ప్రపంచానికి చూపించాలని. యశ్‌చోప్రాకి తన కలల అప్సరస కళ్ళ ముందుకొచ్చిందనిపించింది. హిమ్మత్‌వాలాతో జితేంద్రకు జీవితాన్నిచ్చావ్. బాలీవుడ్‌కు తోఫా అయ్యావ్. నాగమణులంత అందమైన నగీనావి నువ్వు. జగదేక వీరులు కూడా ఆ అతిలోక సౌందర్యానికి సాహో అనాల్సిందే. పేరు మిస్టర్ ఇండియా. సిన్మా అంత పెద్దగా గుర్తులేదు. కానీ అందులో ఐ లవ్ యూ అని నువ్వు విసిరిన విరుపునకు ఇండియానే గుమెత్తిపోయింది. అమితాబ్‌తో పోటీపడి నటించి నీ నటనకు పరాకాష్ఠను చూపిస్తూ ఖుదానే గవా చేశావ్. స్టీవెన్ స్పీల్‌బర్గ్ నీ కోసం కథ తయారుచేసుకుని బతిమిలాడినా కాల్షీట్లు లేని బిజీ షెడ్యూల్‌తో ఉండినావు కానీ హాలీవుడ్‌కి కూడా వెళితేనా.. ఎంజెలీనానే నిష్క్రమించేది.
గుండెతో ఆఖరి పోరాటంచేసిన మా కార్తీకదీపం కొండెక్కింది. చందనం లాంటి మా చాంద్‌నీ ఆ చందమామలో కలిసిపోయింది.
-సరోజ వింజామర

శ్రీదేవి..
చిరునవ్వు చెరగని మోవి
చిలిపి కళ్ళతో బాక్సాపీస్
కొల్లగొట్టే మాయావి
వెండితెరకి అబ్బిన నెత్తావి
తానే ఓ సౌందర్యపు పగడాల దీవి
తెలుగు, తమిళ, హిందీ మూవీ..
మూడు దశాబ్దాలుగా,
ఆమె శాసించిన రాజ్యాలైనాయి
***
పురుషాధిక్యత పురివిప్పి నర్తించునచట
తాత వయసు హీరోలు
లేత వయసు నాయికలతో
నటియించునకటా!
హీరోయిన్ పాత్ర మూడేళ్ళ ముచ్చట
అచ్చట తొడగొట్టి నిలిచేనొక తారక
తండ్రీ కొడుకుల సరసన
రాణించిన నాయిక
ఆమె అందాల శ్రీదేవి గాక
మరెవరూ కాదిక
చలనచిత్ర రంగానికి, తిరుగులేని ఏలిక
***
దేవీ భావ్యమా, శ్రీదేవీ భావ్యమా!
భువిని వీడి హఠాత్తుగా
దివిని చేరుట భావ్యమా,
ఓ సౌందర్య కావ్యమా! ఇది భావ్యవా.
-డా. డి.వి.జి.శంకరరావు పార్వతీపురం