మీ వ్యూస్

నేలమట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొనే్నళ్లుగా హిట్ సినిమా ఎరుగని వెటరన్ యాక్టర్ రవితేజకి తాజా చిత్రం ‘నేల టికెట్’ ఫలితం ‘నేలమట్టం’ అయిన తీరున అట్టర్‌ఫ్లాప్ అయ్యి, అతగాడ్కి తీవ్ర నిరాశని మిగిల్చింది. కాలానికి తగ్గరీతిన, తననుతాను మలచుకోగల్గితేనే మనిషికి ఏ రంగంలో అయినా విజయం సాధ్యం అవుతుంది. రవితేజ గత 15, 16 ఏళ్లుగా అదే వెటకార పూరిత నటనతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుండటంతో అతని చిత్రాలు ఫట్‌మంటున్నాయి. ‘టచ్‌చేసి చూడు’లాంటి ఫోర్స్‌ఫుల్ టైటిల్‌తో వచ్చిన అతని గత చిత్రం ఫ్లాప్ అవటంతో కనీసం ఈ చిత్రం అయినా హిట్ అవుతుందేమో అని ఆశిస్తే ఇదీ అదే రకంగా అట్టర్‌ఫ్లాప్ అయింది. అతను తన నటనాశైలిని మార్చుకోక తప్పదు.
-జహంగీర్‌ఖాన్, ముదినేపల్లి, కృష్ణాజిల్లా

చాలా బాగుంది
‘కుడి ఎడమైన ఆత్రేయ గీతాలు’ వ్యాసం చాలా బాగుంది. ఒకరు పాడిన పాట ఇంకొకరి పేరున రావడం అటుంచితే ‘విజ్ఞులు’ పాట బాగులేదు, వద్దు అన్న పాటలు హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇల్లరికం చిత్రంలో ‘నిలువవే వాలు కనుల దానా’ పాట అక్కినేనికి నచ్చలేదు. అలానే ‘నమ్మినబంటు’ చిత్రంలో ‘చెంగు చెంగునా గంతులువేయండీ’ పాట బుర్రకథ బాణీలో ఉంది, వద్దు అన్నారట కొందరు. దర్శక నిర్మాతలు వాటిని చిత్రించి ప్రివ్యూ ప్రదర్శిస్తే అక్కినేని భార్య అన్నపూర్ణ ఇల్లరికం పాటను తెగ మెచ్చుకుందట. రెండు పాటలూ హిట్ అయ్యాయి. ఆ రెండింటినీ రాసింది ఒకరే. కొసరాజు రాఘవయ్య!
- ప్రసాద్, పెద్దాపురం

సమగ్రంగా లేదు
‘మహానటి’కి నాలుగు స్టార్స్ యివ్వడం సముచితం. కాని సమీక్ష సమగ్రంగా లేదు. సావిత్రి బయోపిక్‌లో సమంత, విజయ్‌ల ప్రేమాయణం ఏమిటి? జెమినీ, సావిత్రిల మబ్బుల్లో పాట వాళ్ళు నిజ జీవితంలో పాడుకున్నారా? ఈ పాట పెట్టేటప్పుడు బయోపిక్ తీస్తున్నామని దర్శకుడు మర్చిపోయినట్లుంది. దొంగరాముడులో ‘రారోయి మా యింటికి’, మాయాబజార్‌లోని ‘నీవేనా’ స్టిల్సు బయటకువచ్చాయి కాని చిత్రంలో లేవు. ఎందుకు తొలగించబడ్డాయి? ప్రకాష్‌రాజు మంచి నటుడు కాని చక్రపాణిగా ఏమాత్రం సరిపోలేదు. చిత్రం సమీక్షించేటప్పుడు ప్లస్‌లూ, మైనస్‌లూ కూడా వ్రాయాలి. అలాకానపుడు సమీక్ష నిష్పక్షపాతంగా వుంది అని అనుకోలేము.
- డి.శశిధర్, వక్కలంక

మహానటి
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ అమోఘంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఆసాంతం అలనాటి సావిత్రి నటిస్తున్నట్లే ఫీల్‌అయ్యాం, కీర్తి హావభావాలు, ఆహార్యం, నటన అన్నీ కీర్తిశేషులు సావిత్రి లాగే ఉన్నాయి. దర్శకులు నాగ్‌అశ్విన్ ప్రతిభ అత్యుత్తమంగా ఉంది. సినిమాలోని సన్నివేశాలన్నీ బలంగాఉన్నాయి. బలహీనమైన సన్నివేశాలు ఒక్కటీ లేవు. నటి సావిత్రి బయోపిక్ ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ శ్లాఘించే విధంగా ఉంది. సాధారణంగా బయోపిక్ సినిమాలు వివాదాస్పదంగా తయారవుతాయి. కాని సావిత్రిగారు పరమపదించిన 37 ఏళ్ళ తర్వాత అత్యంత మనోరంజకంగా ఎవరి మనోభావాలు నొప్పించకుండా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. సావిత్రిలోని వ్యక్తిగత బలహీనతలు, బలాలు అన్నీ సినిమాలో ఉన్నదున్నట్లుగా చూపించారు. మొత్తంమీద తెలుగు సినీ పరిశ్రమ తీరుతెన్నులను కళ్ళకుకట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాలో కీర్తి, దుల్కర్ సల్మాన్ జంటతోపాటు రాజేంద్రప్రసాద్, భానుప్రియ జంట, సమంత, విజయ్ దేవరకొండ జంటల నటన చాలా బాగుంది.
- జి.అశోక్, గోదూర్

అలరించలేదు
నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జునుల యుద్ధం’ ఏమాత్రం అలరించలేదు. దాదాపు సినిమా అంతా బోర్‌కొట్టించారు. నాని నటన కూడా రొటీనే తప్ప నవ్యత లేదు. ఇది మల్టీస్టారర్‌గా తీసినా బాగుండేది. కాకపోతే డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్క్రిన్‌ప్లే ఏదో కొత్త కానె్సప్ట్‌తో రాసుకోవటం వలన కొత్తదనంకోసం ద్విపాత్రాభినయం ఆలోచన చేసినట్లు ఉంది. చిత్ర ప్రారంభమే గందరగోళం. అర్ధంకాని నాని డైలాగ్ డెలివరీ! దానికి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ కుదరలేదు. ఇంటర్ లీడ్ సన్నివేశాలతో పల్లెటూరి నాని కృష్ణ పాత్ర సీను ఎండింగ్‌తో రాక్‌స్టార్ నాని తాలూకు సీను ప్రారంభమయ్యేదే ఒకసారి అటు ఇంకోసారి ఇటు సన్నివేశాలు మార్చుకుంటూ కథనం అల్లుకునే విధానం సరిగా కుదరలేదు. విశ్రాంతి సమయంలో వచ్చే సన్నివేశాలే బాగుండి విశ్రాంతి తర్వాత ఇద్దరు నానీలను కలుపుతూ సినిమాను క్లైమాక్స్‌వరకు లాక్కొచ్చారు. విలన్ పాత్ర కథకు పాత్రకు లింక్ కుదరలేదు. కేవలం కిడ్నాప్‌లతో క్లైమాక్స్‌వరకు కథను నడిపి పేలవంగా సినిమా కానిచ్చారు. హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ బాగాచేసింది. సంగీతం, పాటలు బాగాలేవు. కెమెరా అంతంత మాత్రమే! పాత్రధారులు కూడ రొటీన్‌గా నటించారు. ఒక్క బ్రహ్మాజీ మాత్రమే పాత్రను మెప్పించాడు. ఈ సినిమా నాని విజయాలకు బ్రేక్ అయ్యింది. ఈ ప్లాప్‌తో జాగ్రత్తపడాలి.
-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

చివరకు ఏమైంది?
‘్భరత్’చిత్రం చూసి మహేశ్ రాజకీయాల్లోకి వచ్చి భరత్‌లాగానే గ్రామానికి 5కోట్లు ఇస్తూ రాగద్వేషాలకు అతీతంగా ధనవ్యామోహాలకు లొంగక సిఎంగా పాలన సాగించాలని ఒక పాఠకుడు సూచించారు. నవలల్లో చదివినంత తియ్యగా సినిమాల్లో చూపించినంత ఈజీగా నిజజీవితంలో రాజకీయాలుండవు. ఠాగూర్ సినిమా వచ్చిన తర్వాత చిరంజీవి పార్టీ ప్రారంభించినప్పుడు ప్రజలెన్నో ఆశలుపెట్టుకున్నారు. చివరకు ఏమైంది? ఆరోజుల్లో అవినీతి నిరోధక సంఘాలు ఏర్పాటుచేశారు చిరు అభిమానులు. అవి ఇప్పుడెక్కడ ఉన్నాయి? సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అనవసర భ్రమలు పెట్టుకోవద్దు. మహేశ్ రాజకీయాల్లోకి రానని చెప్పేశాడు కూడా!
- లక్ష్మీ, బృందావనం