మీ వ్యూస్

హలో గురు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ సినిమాలు వరుసగా తనే్నస్తుండటంతో -హిట్టు కోసం పట్లు పడుతున్నాడు. కాని, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నానన్న ఆలోచనకు రాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే గతవారం విడుదలైన హలో గురు ప్రేమకోసమే చిత్రానే్న తీసుకుంటే, దర్శకుడు తెలివైనవాడు కనుక మామా అల్లుళ్ల కథల్ని అటు తిప్పి, ఇటు తిప్పి మళ్లీ మళ్లీ చేసేస్తున్నాడు. కనీసం రామ్ అయనా ఆలోచించాలిగా. నేను లోకల్, సినిమా చూపిస్త మావ కథలన్నీ మామా అల్లుళ్ల చిత్రాలే. దర్శకుడు త్రినాథరావు నక్కిన తనకు తెలిసిన కానె్సప్ట్‌నే తిప్ప తిప్పి కొడుతున్నాడు. కథను వినేటపుడైనా రామ్ ఆలోచించాల్సింది. ఇక సినిమా కూడా చూసిన సన్నివేశాల్లాగే అనిపించింది. పేర్లు ఏవైనా కథలు అవే అయనపుడు -ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఈసారైనా దర్శకుడు కొత్త కథతో వస్తాడో, మామా అల్లుళ్ల కథలతో గినె్నస్‌కు ఎక్కుతాడో చూడాలి.

పి వరలక్ష్మి, వైజాగ్

వణికేదెవరు?

మన విజయ్ దేవరకొండ విజయపథంలో దూసుకుపోతూ తమిళనాట విజయ్‌తో ఢీకొనబోతున్నాడు. విజయ్ వెర్సస్ విజయ్ అన్నమాట. అక్కడ విజయ్‌కి వణుకు అంటూ ఒక చానల్ ఊహాజనిత యుద్ధం ప్రకటించింది. అసలు విషయం ఏమంటే విజయ్ దేవరకొండ నిర్మిస్తూ నటించిన నోటా చిత్రం తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 అనే చిత్రం ఒకరోజు తేడాతో విడుదలఅయ్యాయి. నిజానికి సేతుపతి వణికిపోలేదు. 96 చిత్రం హిట్ అయినట్టు వార్త. తమిళ నోటా సంగతి ఇంకా తెలియదుగాని, తెలుగు నోటా చూడనక్కరలేదంటూ సింగిల్ స్టార్ ఇచ్చింది వెనె్నల! మరి యుద్ధం, వణుకులు ఆ చానల్ సృష్టే!

- మరుదకాశి, కరప

కందకులేనిది.

నాగ చైతన్య, సమంతల మధ్య చిచ్చుపెట్టిన శైలజ, భార్యపై ఆధిపత్యం చలాయిస్తున్న నాగచైతన్య అంటూ వారి చిత్రాలు రెండూ ఒకే రోజున విడుదల అవడాన్ని పురస్కరించుకొని డాంబికాలు పలికిన ఒక చానల్ ఆ చిత్రాల కలక్షన్లుచూసి చల్లబడిపోయింది. నిజానికి జరిగిందేమిటంటే చైతన్య, సమంతలు హాయిగా అమెరికా వెళ్లి ఎంజాయ్ చేశారు. ‘అల్లుడు’ చిత్రం ఓపెనింగ్ కలక్షన్లు బాగున్నా తర్వాత పలచబడి 20 శాతం నష్టంలో బయర్స్ మునిగిపోయారు. చిన్న బడ్జెట్‌వల్ల ‘యు టర్న్’ పెట్టుబడి సాధించడంతోబాటు కొద్దోగొప్పో లాభాలు తెచ్చింది. సమంతనే విజేతగా నిలిచింది.

- చంద్రిక, రాజేంద్రనగర్

నడుస్తున్న చరిత్రే

కాస్టింగ్ కౌచ్ ఇంకా చల్లారలేదు. బాధితులెవరూ ఇప్పటివరకు పేర్లు వెల్లడించకపోయినా ఈమధ్యనే తనుశ్రీ దత్తా- నానాపటేకర్ పేరు బయటపెట్టి వివాదం రాజేసి మహిళల మద్దతు కూడగట్టుకున్నా పటేకర్ మాత్రం స్పందించలేదు. అర్జున్‌రెడ్డీ హిందీ రీమేక్‌లో ముద్దు ఎక్కువని ఒక నటి తప్పుకోగా ఎన్ని ముద్దులైనా ఫర్వాలవేదంటూ కైరా ఒప్పుకుంది. అలాగే కాస్టింగ్ కౌచ్ కూడా, కొందరు నిరాకరించినా మరికొందరు ఇష్టపడి సినిమా ఛాన్సులు కొట్టేసే వారున్నారు. తప్పు అనుకోవడం లేదు చాలా మంది. కాని కౌచ్‌కి ఒప్పుకున్న తర్వాత వాడుకొని సినిమా ఛాన్స్ ఇవ్వనప్పుడే వివాదాలు రేగుతుంటాయి. ఇది నిజం!

-ప్రవీణ్, కాకినాడ

ఎందుకంటే..

తెనాలి రామకృష్ణ చాలామందికి నచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించినప్పుడు విమర్శల హోరెత్తాయి. ఎందుకంటే ఇది చారిత్రాత్మక చిత్రం అయినా ఆ చరిత్రను వక్రీకరించారు. కల్పనలు ఎక్కువ అయ్యాయి. రామకృష్ణ ముఖ్యంగా ఒక కవి. కాని ఈ చిత్రంలో ఆయన్ని రాజనీతిజ్ఞుడుగా, ఒక మహిళా గూఢచారి గుట్టురట్టుచేసి రాయల్ని రక్షించిన సూపర్ స్పైగా చూపడమేగాక ముసలి ముస్లిం వేషంలో మామిడి మొక్కనాటి సుల్తాన్‌ని మెప్పించి అతనినుంచి విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించినట్టు చూపించడం- ఇవన్నీ కల్పనలే. కొన్ని కల్పనలు సినిమాకి అవార్డ్ రావడం వింతేకదా!

-రాజారెడ్డి, నల్గొండ

కమనీయ ‘కన్యాశుల్కం’

వినోదవారి చిత్ర నిర్మాత డి.యన్.నారాయణ దేవదాసు చిత్రాన్ని నిర్మించి దక్షిణ భారతదేశంలో ప్రశంస పొందారు. ఆ చిత్రానికి నాగేశ్వరరావు హీరోగా పనికిరారు అన్నారు! అదేవిధంగా గురజాడ రచించిన కన్యాశుల్కం చిత్రాన్ని 1955లో విడుదలచేసారు వినోద ప్రొడక్షనువారు. సంగీతం ఘంటసాల. ఇక నటవర్గం యన్.టి.ఆర్. షావుకారు జానకి, సావిత్రి, గోవిందరాజుల సుబ్బారావు, వంగర, సియస్‌ఆర్ వారి పాత్రలకు జీవంపోశారు. సంఘ సంస్కరణలకు ఈ చిత్రం పునాది. అద్భుతమైన సన్నివేశాలుకూర్పు ఛాయాగ్రహణం వనె్నతెచ్చిన చిత్రం! అందరికి ఆదర్శవంతమైన ఈ చిత్రం నేటికి 64 వసంతాలు పూర్తిచేసుకొన్నది!

-కెవి ప్రసాదరావు, కందుకూరు

వెనె్నల బావుంది

‘వెండి వెలుగులు’ శీర్షికలో సిఎస్‌ఆర్ గురించి విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. శకుని మామ ఇలాగే ఉంటారా? యిలాగే మాట్లాడతారా అనిపిస్తుంది. పైకి పెద్దమనిషిలా లోపల విషం పెట్టుకొనే పాత్రలలో సంభాషణా చాతుర్యంతో బాగా నటించారు. నటన మాటలు సహజత్వానికి ప్రతీకలే. ఈయనలాగే నాగభూషణం కూడా దుష్టపాత్రలకు జీవం పోశారు. రాజకీయ నాయకుల పాత్రలలో జీవించారు. సిఎస్‌ఆర్, నాగభూషణం వారు పాత్రలలో జీవించారు. కాని, ఆ పాత్రలకు వ్యతిరేకమైన భావజాలంతో నిజజీవితం గడిపారు. నాగభూషణం సినిమాలతో తీరికలేకపోయనా తన నాటక బృందంకోసం ‘రక్తకన్నీరు’ నాటకం వేయడం అందులో ఒకటి. ‘పిల్లలూ దేవుడు’ నాకు నచ్చిన పాట బాగున్నాయి. ఊరిస్తున్న ఖద్దరు రాజకీయ చిత్రాలు విశేషాలు బాగున్నాయి.

-పీవీఎస్ రాజు, తుని