మీ వ్యూస్

అల్పబుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఛానల్ సినిమా కార్యక్రమంలో రాజవౌళి అంటే అమీర్‌కి ఎందుకంత కోపం? అన్న ప్రశ్నని పదేపదే ఫ్లాష్‌చేసి చివరకు చెప్పిందేమంటే- బాహుబలి-2 మనదేశంలో దంగల్‌ని మించిపోయి కలక్షన్ల రికార్డు సాధించినందుకట! ఆ కోపంతోనే అమీర్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం నిర్మిస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాడట! అని చెప్తూ తన అల్పబుద్ధిని బయటపెట్టుకుందా చానల్. బాహుబలి చైనాలో ఫ్లాప్ అవగా దంగల్ హిట్ అయి ప్రపంచవ్యాప్త కలక్షన్లతో బాహుబలిని మించిపోయిందని ఆ చానల్‌కి తెలియదా? అయినా ఎవరైనా వీలైనంత ఎక్కువ సంపాదించాలనుకుంటారు. ఒకరు స్థాపించిన రికార్డుని మరొకరు బద్దలుకొట్టడానికి ప్రయత్నించడం సహజమే. అదికోపం కాదు. పోటీ తత్వం.

-ప్రభాస్, గాంధీనగర్

మెన్టూ...

ప్రతీ చర్యకూ వ్యతిరేక దిశలో అంతే బలమైన మరో చర్య ఉంటుందని సైన్సు చెబుతోంది. ఈమధ్య బయలుదేరిన మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా మెన్ టూ అనే ఉద్యమం ప్రారంభమైంది. ప్రారంభించినవాడు కుమార్ జాగిర్దార్. బెంగళూరులో క్రిస్ట్ అనే సంస్థద్వారా గత 15 ఏళ్లనుంచి గృహహింస, లైంగిక వేధింపుల చట్టాల్లో సవరణలుచేయాలని పోరాడుతున్నాడు. పురుషులుకూడా స్ర్తిలనుండి వేధింపులకు గురవుతున్నారని అతని వాదన. పురుషుల తరఫునే కాదు అన్యాయాలు ఎదుర్కొంటున్న స్ర్తిల తరఫున పోరాడుతానంటున్నాడు. స్ర్తిల వేధింపులకు గురైన మగవారు అనే కానె్సప్ట్‌తో తెలుగులో ఏడుచేపల కథ అనే సినిమా నిర్మాణమవుతోంది. ఈ చిత్రంలో మీటూ లాగ మెన్‌టూ ఉద్యమం కూడా రాజుకోవచ్చు..

-అభిలాష, సాంబమూర్తినగర్

ఆ సీన్ ఉండదేమో

శ్రీగారి ఆర్టికల్ ఆసక్తికరంగా ఉంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ కాంగ్రెస్‌కి బద్ధ వైరి. గవర్నర్ రామ్‌లాల్ ద్వారా ఇందిరాగాంధీ ఆయన్ని బలవంతంగా పదవినుంచి తొలగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆత్మగౌరవం అనే ఆయుధంతో పోరాడి పదవి మళ్లీ సాధించుకున్నాడాయన. ఈ విషయాలేవీ బయోపిక్ రెండో భాగంలో చూపించరనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ ఆప్తమిత్రులు! ఎలక్షన్ల ముందు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏది చూపించినా మహాకూటమి విచ్ఛిన్నం అయిపోతుంది. అది చంద్రబాబు కిష్టంఉండదు. ఈ విషయాలేవీ లేకుండా తీసే చిత్రం ఉప్పులేని పప్పులాగ ఫ్లాప్ అవవచ్చు!

-లంబకర్ణ, రాజేంద్రనగర్

వాటి మాటేంటీ..

‘రాజకీయ కథానాయకులు’ ఫీచర్ బాగున్నా చిరులోపాలున్నాయి. రానా నటించిన లీడర్, నేనేరాజు నేనే మంత్రి రాజకీయ చిత్రాల ప్రస్తావన లేదు. ఒకే ఒక్కడు రాజకీయ చిత్రమైతే విజయశాంతికి రాజకీయ బాటవేసిన ప్రతిఘటన, కర్తవ్యం కూడా రాజకీయ చిత్రాలే. వీటి ప్రస్తావనా లేదు. భరత్ భారీ విజయం సాధించిందనీ, మహేష్ నటన మెస్మరైజ్ చేసిందనటమూ వట్టి పొగడ్తలే. కొందరు బయ్యర్స్‌కి లాభం వచ్చినా మిగిలినవారు మునిగిపోయారు. మహేష్ ముఖ్యమంత్రిలా కాక హీరోలాగే కనిపించాడన్న విమర్శ ఉంది. ఇలాంటి రాజకీయ చిత్రాల్లో చూపించే పరిష్కారాలు- దుష్టులను చంపేయడం లాంటివి- అప్రజాస్వామికం, అసహజం.

-సంచిత, ఖమ్మం

ముద్దుల గోల

‘ఈ ముద్దు ఇంకెన్నాళ్లు?’ ఆర్టికిల్ బాగుంది. ముద్దు అనే కాదు ఏ భావం అయినా మనసుకు ఎక్కేలాగ దర్శకుడు చిత్రించగలగాలి. ఆ ఫీల్ ప్రేక్షకుడిలో రావాలి. కాని ప్రేమ సంకేతం అయిన ముద్దు కామ సంకేతంగా మారడమే అసలు విషాదం. ముద్దు సన్నివేశం చూసినప్పుడు ప్రేక్షకుని హృదయంలో ఉదాత్త భావం కలగాలి. అలాకాక కామం ప్రకోపిస్తే నటీనటులు దర్శకుడు ఫెయిల్ అయినట్టే. దురదృష్టవశాత్తు ఇప్పుడొస్తున్న చిత్రాలన్నింటిలో ముద్దు సన్నివేశం ఉదాత్త భావాన్ని కలగజేయడం లేదు. ఉదాత్త్భావం నిలిచి వెలుగుతుంది. కామభావం క్షణంలో తుస్సుమని ఆరిపోతుంది. ఇలాంటి ముద్దుల ట్రెండ్ త్వరలోనే అంతం అవుతుంది.

-మరుదకాశి, కరప

అదెలా...?

సినీ ప్రముఖుల మధ్య లేని ఈగో సమస్యల్ని భూతద్దంతో వెదికి ఇదిగో పొగ అదిగో పగ అంటూ పనికిమాలిన మాటలు చెప్పడం చానల్స్‌కి అలవాటే. ఒక సందర్భంలో రాజవౌళి శంకర్‌ని పొగిడాడు కాని శంకర్ మాత్రం రాజవౌళిని పొగడకపోవడం అతని సంస్కార హీనత అంటూ చెప్పుకొచ్చిందొక చానల్. పది రోజులు గడిచాక అదే చానల్ ఈమధ్య విడుదలైన 2.0 చిత్రం టీజర్ చూసి రాజవౌళి శంకర్‌కి శుభాకాంక్షలు చెప్పి అభినందించగా ‘నేను మీ అభిమానిని మీరు ఇండియాకే గర్వకారణం’ అని శంకర్ రాజవౌళికి బదులిచ్చినట్టు వివరించింది! సంస్కార హీనుడైన శంకర్ పది రోజుల్లో సంస్కారవంతుడు అయిపోయాడా?!

-స్నేహమాధురి, పెద్దాపురం

కేరాఫ్ కంచరపాలెం

ఆమధ్య వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సహజత్వానికి దగ్గరగా వినూత్నంగా బాగుంది. దర్శకుడు నాలుగు ప్రేమకథలతో కథనాన్ని చక్కగా తీశారు. ముగింపులో రాజు పాత్రలో సుందరం జోసఫ్, గడ్డం పాత్రల ప్రేమ వ్యవహారాలు తనవిగా చెప్పించారు. కాని ఎలా అని అర్ధంకాలేదు. కథ గమనం ఏ కాలానికి చెందిందో వివరణ లేదు. నేపథ్యం, పాత్రల గెటప్, బజాజ్ స్కూటర్ చూస్తుంటే 1985-90లలో జరిగినట్లు అనిపించినా సెల్‌ఫోను వాడకం చూస్తుంటే కాదని సందేహం! అందరూ కొత్తవారైనా సహజంగా నటింపచేసిన పద్ధతి కొత్తగా వుంది. నట్టుగాడి లవర్‌ని గుంట అనే పదాలు కొత్తగా వున్నా వినసొంపుగాలేదు. డైలాగ్స్‌కూడా చాలాచోట్ల సెన్సార్ కటింగ్ అవటంవలన అలాంటివి అవసరమా అనిపిస్తుంది. గడ్డం, సలీమా ప్రేమ వ్యవహారం ప్రవృత్తి వృత్తి ఎలాంటివైనా నిజాయితీ, స్వచ్ఛత బాగుంది. ఇలాంటి చిత్రాలు మరిన్ని తెలుగులో రావాలి. పెద్ద సినిమాలకు బుద్ధి చెప్పగలగాలి.

-పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి