మీ వ్యూస్

భలే రకుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నగాక మొన్నవచ్చి నటనలో ఇంకా ఓనమాలు కూడా పూర్తిచేయని రకుల్ -మీడియా ముందు ఇచ్చే స్టేట్‌మెంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఈమధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ ‘ఏ భాషలోనైనా నటన ఒకటే కదా!’ అనేసింది. అనుభవ రాహిత్యంతో కూడిన పెద్ద మాట ఇది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువ సంభాషణలతో నటన చూపించాల్సి ఉంటుంది. కానీ హిందీ, మలయాళం చిత్రాల్లో చిన్న చిన్న డైలాగులతో అండర్‌ప్లే చూపించాల్సి ఉంటుంది. తెలుగు నటి శారద ఓ మలయాళ చిత్రం శోభనం సన్నివేశంలో -గదిలోకి వెళ్లే నవ వధువులా తలొంచుకుని సిగ్గుల మొగ్గై ముడుచుకుపోతూ గదిలోకి ప్రవేశించిందట. దర్శకుడు కట్ చెప్పాడట. ఎందుకూ అంటే ‘శోభనం సిగ్గుపడాల్సి అంశం కాదు. ఫ్రీగా కాస్త సంతోషం, సంకోచం, ఆత్రం కలగలిపి చూపించమన్నాడట. భాషలను బట్టి నటన మారుతుందన్న విషయాన్ని రకుల్ తెలుసుకోవాలి.
-ఎం గజలక్ష్మి, సూళ్లూరుపేట
గ్రేట్ కవి
పద్మ పురస్కారాలు ప్రకటించిన ప్రతిసారీ -ఎన్టీఆర్‌కి భారతరత్న ప్రస్తావన రావడం, ఇవ్వలేదన్న రుసరుసలు మామూలే. ఎందుకో ఈసారి అది కనిపించలేదు. ఇక రాదని డిసైడైనట్టున్నారు. ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాలతో తగవెందుకని కేంద్రం అనుకుందో ఏమో -చెరో రెండేసి పద్మాలు ప్రకటించేసింది. తమాషా ఏంటంటే సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి తెలంగాణ కోటాలో పద్మం లభించటం. అదీ -రాష్ట్ర ప్రభుత్వమే సిఫార్స్ చేయడం. ఇది ప్రస్తావనకు వచ్చినపుడు ఆయన స్పందించిన తీరు మరీ అద్భుతం. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ పద్మం కోసం దరఖాస్తు పెట్టుకోవడం నాకు నచ్చని విషయం. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం చేసిన సిఫార్స్‌ను గౌరవించితీరాలి. ఆ విషయంలో ఒకింత ఆనందం. స్ర్తిలను కించపర్చేలా, యువత పెడధోరణులపై పాటలు నేను రాయను, రాయలేను అంటూ ఉద్ఘాటించారు శాస్ర్తీ. శ్లాఘనీయం కదూ.
శాంతిసమీర, వాకలపూడి
భలే తమాషా
హీరోల ‘సారీ’ల స్ట్రాటజీ సరికొత్తగా ఉంది. ఈ ట్రెండ్ కూడా టాలీవుడ్‌లో పుట్టింది కాదు. ఏదోక‘వుడ్’ ఫీలై మొదలెడితే, మనవాళ్లు గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఆమధ్య థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం బాక్సాఫీజ్ దగ్గర బోర్లాపడటంతో -అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం ఆడియన్స్‌కు రీచ్‌కాలేకపోయినందుకు, వైఫల్యానికి నేనే బాధ్యత వహిస్తానంటూ పబ్లిక్‌గా ప్రకటించాడు. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కాస్తో కూస్తో నిజాయితీని ప్రదర్శిస్తున్న విజయ్ దేవరకొండ సైతం తన సినిమాల విషయంలో వైఫల్యాలను అంగీకరిస్తూనే ఉన్నాడు. తాజాగా రామ్‌చరణ్ ఇదే స్ట్రాటజీని ప్రయోగించాడు. అయితే, వివిరా డిజాస్టర్ అన్న విషయాన్ని పబ్లిక్‌గా చెప్పుకోలేక -ఆడియన్స్‌కి వినోదాన్ని పంచలేకపోయిందంటూ ప్రకటన మాత్రమే విడుదల చేశాడు. పబ్లిక్‌లో ఒప్పుకోడానికి ఇగో అడ్డొచ్చిందేమో. రామ్‌చరణ్ సినిమాలన్నీ సూపర్ హిట్లని చెప్పలేం. ఇదే మాదిరి పోయిన చిత్రాలూ ఎన్నో ఉన్నాయి. అప్పుడులేని బాధ, సారీ ఇప్పుడు చెప్పాలని ఎందుకనిపించిందో. ఆలోచిస్తే మనకే విషయం బోధపడుతుంది. కాదంటారా?
పిల్లా శ్రీలేఖ, తుని
అంతేమరి
హస్యభరిత చిత్రమంటూ ఈమధ్య వచ్చిన ఎఫ్-2 చిత్రాన్ని మీడియా, ఆడియన్స్ తెగ మోసేశారు. ఏదైనా ఓ చిత్రాన్ని ‘మంచి’దని చెప్పాలంటే -ఆర్థిక కోణంలో కాదు, సామాజిక కోణాన్ని చూడాలన్న స్పృహ కరవవుతోంది. వసూళ్లు బాగా చేసింది కనుక గొప్ప సినిమా అంటూ ఇటు మీడియా, అటు యూనిట్, మధ్యలో ఆడియన్స్ తెగ మాట్లాడేశారు. ఏ చెట్టూలేని చోట ఆముదపు మొక్కే మహా వృక్షమన్న సామెత గుర్తుకొచ్చింది ఇది చూస్తే. సన్నితమైన హాస్యాన్ని (ఏనాడో) మర్చిపోయి మోటు హాస్యాన్ని ఆదరిస్తున్నారు కదా అని కించిత్ బాధ కలిగింది. ఈ సినిమా ప్రచారం జరిగినంద, వసూళ్లు చేసినంత గొప్ప చిత్రమైతే కాదన్నది నాలాంటోళ్ల అభిప్రాయం.
-సి ముకుంద, అన్నవరం

బంగారం తీస్తుందేమో
మణికర్ణిక హిట్టుతో కంగన, క్రిష్‌ల తగవు తారాస్థాయికి చేరడం చూశాం. 70శాతం చిత్రానికి దర్శకత్వం వహించింది నేనే అని కంగన అనగానే, కథలో వేలెట్టి చరిత్రను వక్రీకరించి నేను షూట్ చేసిన సన్నివేశాలు తొలగించి అవే సన్నివేశాలను కంగన రీషూట్ చేసిందంటూ క్రిష్ గొంతు పెంచాడు. ‘నేను చేసింది బంగారం, ఆమె చూపించింది వెండి’ అంటూ కంగన ప్రతిభపై సెటైర్లు వేశాడు. మణికర్ణికను వదిలేసి ఎంతో తపనతో ఎన్టీఆర్ బయోపిక్‌ను భుజానికెత్తుకున్న క్రిష్, బంగారంలాంటి యన్‌టిఆర్‌ను వెండిగానూ చూపలేక ఇనుపముక్క చేసేశాడెందుకో. ఎదుటివాళ్ల ప్రతిభను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం చాలా కష్టం. విమర్శలు గుప్పించటం మహా తేలిక. గొప్ప దర్శకుడు ఈ విషయంలో ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడో. సరే, ఇదిలావుంటే తనేంటో నిరూపించుకోడానికి ఇప్పుడు కంగన మరో చాలెంజ్‌ను తీసుకుంది. అది -తన బయోపిక్‌కు తనే దర్వకత్వం వహిస్తానని. మరి తనను తను ఎలా చూపించుకుంటుందో చూడాలి.
-్భనవకృతి, అల్లవరం
ముమ్మాటికీ నిజం
బయోపిక్‌లకు కామా! -కథనం చాలా బావుంది. నూటికి నూరు పాళ్లు నిజమది. మన దృష్టిలో సినిమా నవరసభరితంగా ఉండాలి. కానీ, ఎవరి జీవితమూ నరరస భరితం కాదు. అందుకని ప్రధాన పాత్రకు చుట్టూవున్నవారి జీవితాల నుంచి రొమాన్స్, కామెడీ, విషాదం, స్వార్థంలాంటి అంశాలూ, సెంటిమెంట్ ద్వారా ప్రధాన పాత్రను పరిపుష్టం చేయాలి. పువ్వులు ఎన్ని రకాలైనా క్రమపద్ధతిలో సౌష్టవంగా దండగుచ్చితే పూలహారం కనువిందు చేస్తూ ఇంపుగా ఉంటుంది. పద్ధతీ పాడూ లేకుండా పుష్పాల్ని దండగుచ్చితే కనువిందు చేయదు. అలాగే బయోపిక్ కూర్చాలంటే ఆలోచన, శ్రద్ధ ఉండాలి. అనవసరమైన హైప్ పెంచకూడదు. అందుకే యాత్ర చిత్రం బయోపిక్ కాదంటూ ముందుజాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు.
-కృష్ణ, కొండయ్యపాలెం