మీ వ్యూస్

మంచి సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల ఫ్లాష్‌బ్యాక్ అట్ 50లో ప్రచురించిన ‘ఇల్లరికం’ చిత్రం విశేషాలు చాలా బాగున్నాయి. ఇందులో అందరినీ అలరించే వాటిల్లో రేలంగి చెప్పిన అల్లుడి కథ. అందులో ఆయనా, రమణారెడ్డి ప్రదర్శించిన నటన ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి. ఇందులో కొన్ని మనోహరమైన సన్నివేశాలు చాలా నిండుగా చిత్రీకరించారు. హాస్య సన్నివేశాలు అన్నీ హుషారుగా నడిచి నటీనటుల ప్రతిభ తెలుస్తుంది. మంచి సినిమాను గుర్తు చేసినందుకు రచయిత్రికి అభినందనలు.
-డిఎస్ శంకర్, వక్కలంక
అయినా అంతే..
‘కోట్లకొద్దీ వినోదం’ వ్యాసం విశే్లషణాత్మకంగా ఉంది. అయితే కోట్లు ఖర్చుపెట్టినంత మాత్రాన ఆ సినిమా కోట్లు కురిపించేస్తుందని అనుకోలేం. ఈ విషయాన్ని అజ్ఞాతవాసి, స్పైడర్‌లాంటి ఎన్నో చిత్రాలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటాయి. అందుకే -నిర్మాతలు కూడా తెలివి తెచ్చుకుంటున్నారని అనిపిస్తుంది. అదెలాఅంటే, బడ్జెట్ లెక్కలు చూసుకునే శంకర్‌కి ఝలక్ ఇచ్చారన్న కథనాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కుదరకే భారతీయుడు-2 ఆగిపోయిందట. 60కోట్లు బడ్జెట్ అనుకున్న డిస్కోరాజాని 40 కోట్లతో సరిపెట్టమని దర్శకుడిని ఆదేశించాడట నిర్మాత. తాజా చిత్రం ‘మహర్షి’ 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినా.. కలక్షన్ల వర్షం అని దిల్‌రాజు ప్రకటిస్తున్నా ప్రేక్షకులు మాత్రం కథాకథనాలు పాత చిత్రాల మాదిరే ఉందంటూ అసంతృప్తితోనే కనిపిస్తున్నారు. అందువల్ల ప్రకటిస్తున్న కలక్షన్లు అనుమానాస్పదమే. ఏదేమైనా -తెలుగు సినిమా బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగేయడం మంచిది.
-కృష్ణ, కొండయ్యపాలెం
సాఫ్ట్’వేర్ కథే
మహేష్‌బాబు హీరోగా ముగ్గురు అగ్ర నిర్మాతలైన పివిడి ప్రసాద్, దిల్‌రాజు, చలసాని అశ్వినీదత్‌లు వందకోట్ల వ్యయంతో నిర్మించిన మహర్షి చిత్రం కేవలం మహేష్‌బాబు అభిమానుల కోసమే అనిపిస్తుంది. కంపెనీ సిఈవోగా మహేష్ నటన బావుంది. హీరోయిన్ పూజాహెగ్డే పాటలకే పరిమితమైంది. మహేష్ అమ్మానాన్నలు ప్రకాష్‌రాజ్, జయసుధలు పర్వాలేదనిపించే రొటీన్ పెర్ఫార్మెనే్స ఇచ్చారు. పూజాహెగ్డే తాతలుగా సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులను కుర్చీలకే పరిమితం చేసినా పాత్రలకు న్యాయం చేశారు. రామవరం గ్రామంలో భూములు లాక్కొని ఇండస్ట్రీ పెట్టే జగపతిబాబు విలనిజంలో మార్పేమీ లేదు. ఇక అల్లరి నరేష్ పోషించిన రవి పాత్రపై మాత్రం దర్శకుడు ఫోకస్ పెట్టాడు. సిఎంగా నాజర్ నటన హైలెట్. ఇన్ని ప్లస్సులున్నా -చిత్రబృందం ప్రకటిస్తున్నట్టు కోట్లకు కోట్లు వసూలు చేసేస్తుందన్న విషయంలో అనుమానాలు లేకపోలేదు.
-కె శ్రీనివాస్, హైదరాబాద్
పనికిరాడన్నారు..
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నిర్మించిన ‘సొంతూరు’ చిత్రంలో ఓ నాటక సన్నివేశంలో ఎన్టీఆర్ కృష్ణుని పాత్ర ధరించారు. కాని కృష్ణునిగా ఆయనను ప్రేక్షకులు అంగీకరించ లేదు. దానికి కారణం అలంకరణ. ఆ తదుపరి 1957లో మాయాబజార్ చిత్రంలో కెవి రెడ్డి -ఎన్టీఆర్‌ను కృష్ణుని పాత్రకు సన్నాహాలు చేస్తుంటే నిర్మాతలు అంగీకరించలేదు. కృష్ణుని పాత్రలో రామారావును తీర్చిదిద్ది సినిమా విజయవంతం చేస్తానని హామీ ఇచ్చారు కెవి రెడ్డి. ఆయన చెప్పినట్టుగానే -ఆ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుని పాత్రకు వచ్చిన యశస్సు చెప్పక్కరలేదు. పాండవులు లేకుండా చిత్రాన్ని నవరస భరితంగా పాండవులు లేరన్న సందేహం ప్రేక్షకులకు రాకుండా మాయాబజార్ చిత్రాన్ని మలచిన ఘనత కెవి రెడ్డిదే. అలాంటి దర్శకుల్ని మళ్లీ మనం చూస్తామా.
-కెవిపి రావు, కందుకూరు
అయతే మాత్రం..
వినోదాత్మకమే తప్ప సందేశాత్మక సినిమాలు చేయడం లేదు. సందేశాలెవరూ వినరు? చూడరంటూంటారు మన నిర్మాతలు. అలాగని సందేశాన్ని దెబ్బతీసేలా వినోదం ఉండకూడదుగా అంటే మాత్రం మాట్లాడారు. ఈమధ్య చానెల్లో చూసిన ఓ సినిమా బిట్‌ను గుర్తు చేసుకుందాం. గట్టున కూర్చున్న అల్లు అర్జున్ సిగరెట్ పీలుస్తూ, సగం కాలిన పీక రెండు వేళ్లమధ్య పెట్టుకొని ఆ చేతిని పక్కకి వాల్చుతాడు. అక్కడ కాజల్ కూర్చుని ఉంటుంది. క్షణం తర్వాత కాజల్ నోటినుంచి పొగ వదులుతుంది. అంటే అర్జున్ సగం పీల్చిన సిగరెట్‌ను కాజల్ పీల్చి పొగ వదిలింది అనుకోవాలి. ఇది వినోదమా? మద్యం మానండి, పొగ తాగకండి అంటూ ప్రభుత్వ ప్రకటనలను స్క్రీన్‌పై గుప్పిస్తూనే, అలాంటి సన్నివేశాలను చొప్పించటం వల్ల హీరోయిజం పెరుగుతుందా? అలాంటి సన్నివేశాలకు ఎందుకు ఓకే చెబుతారు? ఇలాంటి బాధ్యతారహిత సన్నివేశాలు అవసరమా?
-శాంతిసమీర, వాకలపూడి
ఆర్భాటం ఎక్కువ
‘కోట్లకొద్దీ వినోదం’ కథనం బావుంది. ఖర్చుపెడితే సరిపోదు, సొమ్ము తిరిగి వచ్చేలా చేసే కథలో దమ్ముండాలి. అదంత సులువేం కాదు. మన చిత్రాల్లో అద్భుతమైన సెట్స్, కనువిందు చేసే ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం- వీటికోసమే ఎక్కువగా ఖర్చుపెడతారన్నది నిజం. పైగా విదేశాల్లో చిత్రీకరణ. కాని సినిమాకు ఆత్మలాంటి కథ, కథనాల గురించి తగిన శ్రద్ధ తీసుకోవడం లేదన్నది ఈమధ్య వచ్చిన అనేక సినిమాలు రుజువు చేశాయి, చేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ విదేశీ చిత్రాలకు స్క్రిప్ట్ తయారు చేయడానికే ఇద్దరు ముగ్గుర్ని నియమించి కనీసం రెండేళ్లు కృషి చేసి, చాలామంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఆ తరువాతే లాక్ చేస్తారని అనేక కథనాల్లో చదువుతుంటాం. శంకర్ చిత్రం 2.0, అమీర్‌ఖాన్ చిత్రం థగ్స్.. చీదేయడానికి కారణం కథనం సరిగా లేకపోవటమే. రజినీకాంత్ చిత్రాలకే దిక్కులేకుండా పోడానికి స్క్రిప్టే కారణం. మన భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘అసలు’ తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ!
-సుభాష్, శ్రీనగర్