మీ వ్యూస్

ఉత్కంఠగా ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకేవారం రెండు వైవిథ్యమైన తెలుగు సినిమాలు విడదలైనా -ఎవరు? ముందు రణరంగం నిలవలేకపోయంది. థ్రిల్లర్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన అడివి శేష్, తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను పూర్తిగా విజయం వైపు నడిపించాడు. సమవుజ్జీగా రెజీనా సైతం తన పాత్రను అద్భుతంగా పోషించటంతో -ఆడియన్స్ కుర్చీల అంచున కూర్చుని మరీ సినిమా చూడాల్సి వచ్చింది. సినిమాకు సంబంధించి కథను అంత బిగింపుగా నడిపించిన దర్శకుడు, సపోర్టింగ్ రోల్‌లో ప్రధాన పాత్రలకు బలాన్నిచ్చిన నవీన్‌చంద్రను ప్రత్యేకంగా అభినందించాలి. ఇక రణరంగం సినిమా కూడా తీసిపారేయతగ్గ చిత్రమైతే కాదు. గ్యాంగ్‌స్టర్‌గా హీరో శర్వానంద్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. కాకపోతే కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. శర్వా -కల్యాణి ప్రియదర్శన్ మధ్య నడిచిన లవ్ ట్రాక్‌నే పూర్తిగా సినిమా చేసేసినా అద్భుతంగా ఉండేదేమో. మధురమైన ప్రేమ కథను సింపుల్ చెప్పడంలోనే దర్శకుడి పట్టు కనిపించింది. కాకపోతే -సినిమా హిట్టుకాలేదు. బ్యాడ్‌లక్.
-ఎల్వీ మహీంద్ర, డి గన్నవరం.
భళా తెలుగు సినిమా
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈసారి తెలుగు సినిమాలు తళుక్కున మెరిశాయి. ముఖ్యంగా దివంగత సావిత్రి జీవిత కథ ‘మహానటి’కి మూడు జాతీయ పురస్కారాలు సహా తెలుగు చిత్రాలకు 7 పురస్కారాలు దక్కడం భలే ఆనందాన్నిచ్చింది. కీర్తిసురేశ్ నటన అద్భుతమంటూ జ్యూరీ కొనియాడుతూ జాతీయ పురస్కారం ప్రకటించటం గర్వంగా అనిపించింది. దేశంలో ఏటా వివిధ భాషల్లో వందల సినిమాలు విడుదలవుతున్నా సినిమాలన్నింటా వ్యాపార దృక్పథమే తప్ప సాంకేతిక, నైతిక విలువలు శూన్యం. ప్రస్తుతం పురస్కారాలు పొందిన సినిమాలను ఇకనైనా ఆదర్శంగా తీసుకొని, వాసిగల చిత్రాలకు రూపకల్పన చేసి నిజమైన తెలుగోడి, భారతీయుడి సినిమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.
-జి.అశోక్, జగిత్యాల జిల్లా
మహానటే
భారతీయ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సావిత్రి ఎప్పటికీ మహానటి. అమ్మగా, వదినగా, భార్యగా, చెల్లిగా.. అసాధారణ అభినయాన్ని ప్రదర్శించి ‘మహానటి’ అనిపించుకున్న సావిత్రి జీవిత కథకు జాతీయ పురస్కారం దక్కడం -ఆమెను సజీవం చేసినట్టయ్యింది. ఆ పాత్ర పోషించిన కీర్తిసురేశ్ అభినయాన్నీ తక్కువ చేయలేం. సావిత్రి సజీవంగా దిగివచ్చిందా అన్నంత చక్కగా పాత్రలో లీనమైంది కీర్తిసురేష్. ఆ పాత్ర చుట్టూవున్న ప్రపంచాన్ని సైతం దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించటంతో -సినిమా జాతీయ అవార్డు స్థాయికి వెళ్లిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పైరవీల ప్రమేయం లేదని చెప్పడానికి, మహానటి ఎంపికను సైతం ప్రస్తావించొచ్చు.
-శ్రీనివాస్ కె, బోడుప్పల్
నచ్చాడు రాక్షసుడు
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా బాగుంది. ఒంటిచేత్తో ఎంతమంది విలన్లనైనా చితక బాదడం, విదేశాల్లో నాయికతో పాటలు వగైరా సినిమాటిక్ అతి ఈ సినిమాలో లేదు. కాకపోతే ఇప్పుడొస్తున్న చాలా చిత్రాల్లాగే కర్ణకఠోరమైన నేపథ్య సంగీతం, కొన్నిచోట్ల మాటలు అర్ధంకాకుండా హోరెత్తించటంలాంటివి ఇబ్బంది పెట్టాయి. తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసినా -ఆ భావన కలుగకుండా స్ట్రెయిట్ తెలుగు చిత్రంలా చేయటం మెచ్చదగినది.
-గిరిజా రమణుడు, వక్కలంక
అదే పెద్ద కామెడీ
తెలుగు సినిమాల ప్రమోషన్స్ మరీ కామెడీ సీన్లను మించి ఉంటున్నాయి. సినిమా విడుదలకు ముందు -ప్రీ రిలీజ్ పేరిట సాగుతోన్న తంతు మరీ నవ్వు పుట్టిస్తోంది. ఒకరిని ఒకరు శక్తికిమించి పొగుడుకోవడం చూస్తుంటే -తెలుగు సినిమాల్లో ఇంతకంటే గొప్ప కామెడీ ఏముంటుంది? అనిపిస్తోంది. సినిమా విడుదలై ఢమాల్‌మందన్న టాక్ నడుస్తున్నా -సాయంత్రానికే సక్సెస్ మీట్‌లు పెట్టడం చూస్తుంటే నవ్వుకోక ఏం చేయాలి? ఎవరి సినిమా వాళ్లిష్టం, ఎవరి గొప్పలు వాళ్లవి. కాదనడానికి ఎవ్వరూ సాహసించరు. కాకపోతే -ఏ చానెల్ తిప్పినా సక్సెస్ మీట్లు, ఆహా ఓహోలు కనిపిస్తుంటే చూడలేక చస్తున్నాం.
-పి రాజేంద్ర, తిరుపతి
అదృష్టవంతుడు..
ఎక్కడో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం మీదవున్న అక్కినేనిని ఘంటసాల బలరామయ్య (దర్శకులు) చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడగారట. అలా 1944లో వచ్చిన సీతారామ జననంలో రాముడి పాత్ర ధరించడం కాకతాళీయంగా జరిగిన సంఘటన. ఆ తదుపరి అక్కినేని 1953లో దేవదాసు చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించడం, దీనికితోడు ఘంటసాల వెంకటేశ్వరరావు వారికి పాడటం అన్నీ కలిసొచ్చిన విషయాలు. ఆయన స్వయంకృషి మాటెలావున్నా, ముందు అదృష్టం అనే ఓ విత్తనం పడాలిగా. అందుకే అనేవారు పెద్దలు -పూర్వజన్మ సుకృతాన్నిబట్టి జీవితం నడుస్తుందని.
-కెవి ప్రసాదరావు, కందుకూరు
భలేవుంది
‘హాస్యానికి అల్లురికం’ అంటూ రామలింగయ్య గురించి చెప్పిన విషయాలు హాయినిచ్చాయి. హాస్యం అనగానే అల్లుతోపాటు అలనాటి శివరావు, జోగారావు, నల్లరామ్మూర్తి, పేకేటి.. తరువాతి తరంలో రేలంగి, రాజబాబు, రాజేంద్రప్రసాద్, పద్మనాభం, బాలకృష్ణ (అంజిగాడు), సునీల్, చలంలాంటి వాళ్లూ జ్ఞాపకం వస్తారు. వీళ్లందరికీ నవ్వించడమే పని. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. పద్మనాభం కొత్తలో హాలీవుడ్ హాస్యగాడు జెర్రీలూయిస్‌నీ అనుకరించినట్టు కనిపించినా, తర్వాత సొంత శైలి అలవర్చుకున్నాడు. బ్రహ్మానందం, ఎల్‌బి శ్రీరాం, ఎంఎస్ నారాయణ- వీళ్లని మర్చిపోగలమా?
-సుధీర్, శ్రీనగర్