మీ వ్యూస్

అంతేమరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహా ఓహో అంటూ వచ్చిన సాహో వారం తిరక్కుండానే చతికిలపడిపోయాడు. కోట్లకు కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్న కబుర్లపైనా అనుమానాలు ముసురుతున్నాయ. అంత బడ్జెట్‌తో సాధారణ సినిమాలు తీసివుంటే -తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది కార్మికులకు పని దొరికేదో కదా. అయనా, హీరో గొప్ప కోసం తప్ప ఇండస్ట్రీ గురించి ఆలోచించేదెవరు?
-్భలే రాజు, లక్కవరం
గ్రేట్ కీర్తి
మహానటిగా కీర్తిసురేష్‌కు ఉత్తమ నటి అవార్డు రావడం ఆనంద దాయకం. జడ్జిమెంటు అనేది జస్టిస్ ఆఫ్ గాడ్ అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రతిభావంతులకు గుర్తింపుదక్కదు. దశాబ్దంక్రితం ఓ కళాశాలలో వ్యాసరచన పోటీలు పెట్టారు. చిత్రమేంటంటే -మహానటి సావిత్రికి నిజ జీవితంలో పద్మశ్రీ కూడా దక్కలేదు. ఒకవిధంగి అది మంచిదే అనిపిస్తుంది. మహానటిని ఏ అవార్డుకు సమానం చేయగలం. ఎంత గొప్ప అవార్డు అయినా -ఆమె ప్రతిభకు సాటి కాకపోవచ్చు. కాని -గుర్తించి ఉండాల్సిందన్న చిన్న భావన మాత్రం మస్తిష్కాన్ని వీడదు. -ఆమె ఉదాత్త జీవితంలోని ఘట్టాలతో తెరకెక్కిన చిత్రానికైనా అవార్డు రావడం గొప్ప విషయం. ఈ విషయంలో కీర్తి సురేష్ ధన్యురాలు.
-కె అరుణ, అత్తిలి
మరీ అంతగానా..?
‘నర్తనశాల’ చిత్రంలో కథానాయకుడు, నాయకి వస్త్రాలంకరణ సన్నివేశం ఉంటుంది. కాని వారి మధ్యగల దూరం సమీకరణ దృష్టిలో ఉంటుంది. వీరాభిమన్యు చిత్రంలోనూ సంస్కృతికి అనుగుణంగా శృంగారాన్ని చూపించారు. ఆనాటి సాంఘిక చిత్రాలలోనూ శృంగారం సమపాళ్లలో కుటుంబం కలిసి చూడగలిగేలానే దర్శకులు నియమం పాటించారు. శోభనంలాంటి దృశ్యాలను రాధాకృష్ణుల పటం చూపిస్తూ -్భవయుక్తంగా చెప్పేవారు. అన్నమయ్యలో శృంగారం శృతిమించి పౌరాణిక భక్తిచిత్రం అన్న జోనర్‌కు దూరంగా సాగింది. ఇప్పటి సినిమాలు జోనర్‌తో సంబంధం లేకుండా శృంగారానికి హద్దులు చెరిపేసి మరీ చూపించేస్తున్నాయి. అలాంటి సినిమాలు చూస్తుంటే, ఎటుపోతున్నాం అన్న భవన, భయం కలుగకమానదు.
-కెవీ ప్రసాదరావు, కందుకూరు
మనమంతే..
‘వెనె్నల’ మొదటి పేజీలోని ముగ్గురు రచయితల ఆవేదన అర్ధం అయింది. నిజం చెప్పాలంటే సెన్సార్ చేయగలిగిందేమీ లేదు. భావస్వేచ్ఛ బాబాలు నానా రభస చేసి కోర్టుకెక్కితే వారికి అనుకూలంగా తీర్పులొస్తున్నాయి. ఆడ శరీరం ముడిసరుకుగా సొమ్ములు సంపాదించే వర్మ, పూరీ లాంటి వారిని అడిగితే నచ్చకపోతే చూడకండి అంటారు. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌ల సృష్టికర్తని అడిగితే అదంతా ప్రేమభాష. ప్రేమించటం చేతగాని వారికి అర్థంకాదు అంటాడు. సిగరెట్ కాల్చడం గురించి రకూల్‌ప్రీత్‌ను అడిగితే అది నేచురల్. సిగరెట్ కాల్చింది నేను కాదు. అవంతిక కాల్చింది- అని తెలివిగా చెప్పింది! ముద్దులు, హగ్గులు, గుద్దులు నటించిన నటీమణులు పాత్ర డిమాండ్ చేసింది అంటారు. ఆమాట మాటున ఎక్స్‌స్ట్రా డబ్బులు నిర్మాత నుంచి గుంజుకుంటారు. డబ్బుకోసమే ఈ వేషాలన్నీ. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరికీ డబ్బుయావ! ఎన్నో ట్రెండ్‌లు వచ్చిపోయాయి. ఈ ట్రెండ్ కూడా అంతం అవుతుందని ఆశిద్దాం.
-మరుదకాశి, కరప
సరిచేసుకోవాలి..
వెనె్నలలో ప్రతి వారం వస్తున్న ఇమందిగారి ఆనాటి హృదయాల పేరిట వ్యాసాలు చాలావరకూ కల్పనల్లే అనిపిస్తున్నాయ. గత వారంలో వచ్చిన ‘చంద్రకళ అదృశ్యకావ్యం’ కథనమైతే బాగుంది కాని, ఉన్న విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి రాసినట్టుంది. గతంలోనూ..సర్కస్‌రాముడు చిత్రం వ్యాసంలో ఆ టైంలో పూర్తిగా ఫీల్డ్‌లోకిరాని బాలకృష్ణ, యింకా పరిచయమే కాని విజయశాంతిల జంట ఇరగదీస్తుందని రాశారు. కనుక మీరు పాఠకుల అభిప్రాయాన్ని వారికి తెలియచేసి, వ్యాస రచనలో జాగ్రత్తపడేలా చేయగలరు. వీరు వ్యాసంలో చలోక్తులకన్నా విషయాలు కరెక్ట్‌గా ఉదహరిస్తే బాగుంటుంది.
-కె బాలకృష్ణ, రామచంద్రపురం
మాకెంతో ఇష్టం
ఆంధ్రభూమి దినపత్రిక ప్రతి ఆదివారం అందిస్తున్న వెనె్నల పేజీ అంటే మాకెంతో ఇష్టం. ప్రత్యేక కథనాలతోపాటు ఆసక్తికరమైన సినిమా రివ్యూలు, పాత చిత్రాల పూర్తి వివరాలు చదువుతుంటే ఆసక్తికరంగా అనిపిస్తోంది. నాకు నచ్చిన సినిమా, పాట శీర్షికల కింద అందిస్తున్న పాఠకుల కథనాలు -కొత్త చిత్రాలపైనా రాస్తే బావుంటుంది. ఇటీవలి కాలంలో కొత్త కొత్త దర్శకులు అనేక చిత్రాలను తీస్తున్నారు. రివ్యూల రూపంలో వాటిని అందిస్తున్నా, క్లుప్తంగా వాటిలోని తప్పొప్పులను ఎత్తి చూపించే కథనాల్లాంటివి ఇస్తే ఆసక్తికరంగా చదవొచ్చు. అలాగే, గతంలో ఇచ్చినట్టుగా కుర్ర దర్శకులు, హీరోల క్లుప్తమైన ఇంటర్వ్యూలు కూడా ఇస్తారని ఆశిస్తున్నాం.
-వంక రాఘవేంద్ర, భీమవరం
కొన్ని పాత్రలు ఆయన కోసమే..
ఏసుక్రీస్తు పాత్రల్లో జీవంపోసి కరుణామయుడు చిత్రం ద్వారా ఖండాంతర ఖ్యాతిపొందారు. అలాగే షిర్డిసాయిబాబా పాత్రలో ఇమిడిపోయి బాబాయే అన్నట్లు నటించాడు విజయచందర్. అలాగే కబీర్‌దాస్, వేమన చరిత్ర, ఆంధ్రకేసరి వంటి ఇత్యాది పాత్రల్లో ప్రతిభ కనపరచారు. అలనాటి దేవిలలితాంబ చిత్రంలో అహంకార పూరిత కామాంధుడైన రాజుగా మెప్పించారు. రాజాధిరాజులో కరుణ రస పాత్రలో నటించారు. జైత్రయాత్ర (నాగార్జున), గీతాంజలి (నాగార్జున) ఇటీవల వచ్చిన ఆనందోబ్రహ్మలలో నటించడమేకాక, అడపా దడపా మంచి పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే అలనాటి సినిమాల్లో క్రైమ్ ఓరియెంటెడ్ చిత్రాలలోకూడా నటించారు. సిఐడిరాజు, బస్తీమేసవాల్, రౌడీరాణి, మావూరి మొనగాళ్ళు వంటి చిత్రాల్లో ఒదిగిపోయారు. నాగేశ్వరరావుతో మరో ప్రపంచం, సుడిగుండాలు, సుపుత్రుడు చిత్రాల్లో నటించారు. అడపాదడపా టీవి సీరియల్స్‌లో సైతం దర్శనమిస్తున్నారు. ఏసుక్రీస్తు, షిర్డీసాయిబాబా పాత్రలకు పెట్టింది పేరుగా విజయచందర్‌ను చెప్పవచ్చు. అతడిని విలక్షణ నటులలో ఒక ప్రమఖుడుగా పేర్కొనవచ్చు.
-జి శ్రీరామారావు, అలంపురం