మీ వ్యూస్

ఎందుకా ప్రచారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైత్రీ మూవీ మేకర్స్ చాలా హిట్ చిత్రాలే తీసింది. తాజాగా విజయ్ దేవరకొండతో ‘హీరో’ చిత్రం తీయాలనుకుంది. ‘డియర్ కామ్రేడ్’ బకెట్ తనే్నయడంతో -హీరోని వెనక్కి లాగేసింది మైత్రీ మూవీస్. పూరీ వరుస ఫ్లాపులతో సతమతమవుతూ మహేశ్‌తో ‘జనగణమన’ ప్లాన్ చేసినా మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు పూరీకి. దాంతో ఆ చిత్రాన్ని విజయ్‌దేవరకొండతో తీసి హిట్ చేసి మహేశ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పూరీ ప్రయత్నిస్తున్నట్టు ఒక చానల్ ప్రచారం మొదలెట్టింది. ఒక హీరోతో ఒక చిత్రాన్ని అనుకొని బడ్జెట్‌లు, కాల్షీట్‌లూ కుదరక ఇంకో హీరోతో ఆ చిత్రాన్ని తీయడం సర్వసాధారణమే. అలాంటి ఉదాహరణలు చిత్రసీమలో ఎన్నో ఉంటాయి. అంతమాత్రానికే పగ పట్టడం, ప్రతీకారం తీర్చుకోవటం లాంటి వార్తలు వ్యాపింప జేయటం మంచిది కాదు. విజయ్‌తో ‘జనగణమన’ తీసి అది ఫ్లాపైతే మళ్లీ విజయ్ ముఖం చూస్తాడా పూరి? తాజా వార్త ఏమంటే పూరీ ‘జనగణమన’కు మంగళం పాడేసి -తన మార్క్ ప్రేమ కథతోనే దేవరకొండతో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.
-చంపక్, మాధవరం
అదేనా బాధ్యత
నల్లమల అడవుల్ని నరికేస్తారా? పర్యావరణంలో ఆక్సిజన్ లేకుండా చేసేస్తారా? అంటూ స్టార్లనుంచి చోటా మోటా సెలబ్రిటీల వరకూ స్థాయినిమించిన కోపోద్రిక్త స్టేట్‌మెంట్లు ఇస్తుంటే నవ్వొస్తుంది. సినిమావోళ్లు కనుక వాళ్లేం మాట్లాడినా మీడియా కొండతలు చేసి ప్రచురిస్తుంటే -పడి పడి నవ్వాలనిపిస్తుంది. అడవుల పరిరక్షణకు అంతా నడుంకట్టాలి. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కాకపోతే -సెలబ్రిటీలు స్టేట్‌మెంట్లిస్తే సరిపోతుందా? నిజంగా అడవుల పట్ల మమకారం ఉన్నవాళ్లు, అదో సామాజిక బాధ్యతగా ఫీలయ్యేవాళ్లు క్షేత్రంలోకి దిగొచ్చుగా. కనీసం క్షేత్రస్థాయిలో ‘నల్లమల’పట్ల తమ వాదన వినిపిస్తున్న ఉద్యమ గొంతులతో శృతికలిపొచ్చుగా. సమాజ హితవుకోరే సెలబ్రిటీలు కొద్ది సమయం వెచ్చించి -నరికివేతకు గురవుతున్న ప్రాంతాల్లో పర్యటించి జనాన్ని చైతన్యపర్చాలిగా. పోతే ఏంపోతుంది డూడ్, స్టేట్‌మెంటే కదా! అన్నట్టు సామాజిక బాధ్యతను మేనేజర్లు, పీఆర్వోలతో స్టేట్‌మెంట్లకు పరిమితం చేయడాన్ని ఏమనాలి?
-జి చైతన్య, ఒంగోలు
హాస్యభూషణం
విలక్షణ నటుడిగా దాదాపు అన్నిరకాల పాత్రలు పోషించిన గొప్ప వ్యక్తి నాగభూషణం. విలన్ పాత్రకు కొత్త ఒరవడి దిద్ది -అంతకుముందున్న ‘వికటాట్టహాసాలు’ ఏవీ లేకుండా మాటల్లో ‘పంచ్’ విసిరిన మొదటి నటుడు ఆయనే. తమాషా ఏంటంటే మంచి పాత్రలు పోషించే గుమ్మడి ‘ఏది నిజం’, అక్కినేని ‘్భలేరంగడు’ చిత్రాల్లో ఆయనకు విలన్‌గా నటించడం. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. ‘మంచి మనసులు’ చిత్రంనుంచి ఆయన విలనిజానికి ఆడియన్స్ బాగా కనెక్టయ్యారు. హీరోల్లో అక్కినేని, కృష్ణ పక్కన ఎక్కువ సినిమాలు చేశారు నాగభూషణం. ‘నేనంటే నేనే’ చిత్రంలో పూర్తిస్థాయి స్ర్తివేషంలో ‘డొక్కలో పొడుస్తా’ అంటూ నవ్విస్తారు. ‘ఒకేరక్తం’ చిత్రంలో ఆడవేషంలో ఆయనకొక పాట కూడా వుంది. ‘కురుక్షేత్రము’ చిత్రంలో ఇది సూన్నతము అంటూ శకుని వేషంలో కనిపించడం మరో విశేషం. అందుకే ఆయన హాస్యభూషణమయ్యారు.
-టి సదా, తిరుపతి
సుమధుర రాజా
ఎఎం రాజా స్వర్ణయుగపు చిత్రకాలంలో గాయకునిగా ప్రవేశించి చెరగని ముద్రవేసిన వ్యక్తి. ఎన్నో చిత్రాల్లో ఎన్నో పాటలు పాడి ఆయనకంటూ ఓ శైలిని సృష్టించుకున్నారు. ఆయన పూర్తి పేరు అనిమేల మన్మద రాజా (ఎఎమ్ రాజా). 1951లో చిత్రరంగంలోకి గాయకునిగా ప్రవేశించి విజయావారి మిస్సమ్మ, పెళ్ళికానుక, విప్రనారాయణ తదితర చిత్రాలలో గాయకునిగా ప్రసిద్ధిచెందారు. ఆయన సుమధుర కంఠం అలౌకిక ఆనందానుభూతి కలిగిస్తుంది. జిక్కి వీరి భార్య. ఇద్దరు కలసి పాడిన చిత్రాలు అదో తీపివనం. విధివశాత్తు 1989లో రైలు ఎక్కబోతూ ప్రమాదానికి గురై ఈ లోకం విడిచిపెట్టారు. ఇప్పటికి ఆయన పాటలు రేడియోలో వింటుంటే -ఆ పాత రోజుల అనుభూతి ఎంతో ఆనందంగా ఉంటుంది. శ్రోతలను మైమరిపించేందుకే ఆ కంఠాన్ని ఎఎం రాజాకు భగవంతుడు ప్రసాదించడాని ఒక్కోసారి అనిపిస్తుంటుంది.
-కేవీపీ రావు, కందుకూరు
భలే ఎవరు?
ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల్లో ఎవరు?ది ఓ ప్రత్యేక శైలి అనిపించింది. ఎవరు? సినిమా తరువాత చాలా చిత్రాలే విడుదలైనా -ఇంకా ఎవరు? మర్చిపోలేనంతగా ముద్రవేసింది. తొలిసారి దర్శకత్వం వహించినా వెంకట్ రాంజీ పనితనం అద్భుతమనే చెప్పాలి. కొన్నిచోట్ల హీరోయిన్ ఎక్స్‌పోజింగ్స్ ఎబ్బెట్టు అనిపించినా -పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో రెజీనా ‘ఓహ్’ అనిపించింది. ఇక కథానాయక పాత్రధారి అడివి శేష్ ఒంటి భుజంపై సినిమా నడిపించేసినంతగా రాణించాడు. సంగీతం, సంభాషణలు, ఫొటోగ్రఫీ, లొకేషన్లు, బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా ఒక విభాగానికి మించి మరో విభాగం పనితనం చూపటంతో -ప్రేక్షకులు ఎవరు?కి పట్టంకట్టేశారు. వానాకాలంలోనూ భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఎవరు?ను ఎన్నిసార్లైనా ప్రస్తావించుకోవచ్చు.
-సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్
పరమ రొటీన్
పత్రికల్లో వచ్చే తారల ఇంటర్వ్యూలన్నీ పరమ రొటీన్. రొటీన్ ప్రశ్నలు, బోరింగ్ సమాధానాలే ఉంటుంటాయి. తాజా చిత్ర విజయానికి ఎలా ఫీలవుతున్నారు? ఇదో ప్రశ్న. బ్రహ్మాండం అన్నది బోరింగ్ ఆన్సర్. ఇటీవల ఒక పత్రికలో రష్మిక మండన్న ఇంటర్వ్యూ వచ్చింది. ‘డియర్ కామ్రేడ్’ విజయంతో జోరుమీదున్నారు? అని విలేఖరి అనగానే -విజయం ఎవరికైనా ఉత్సాహాన్నిస్తుంది అని మండన్న సమాధానం. తమాషా ఏమంటే ఆ చిత్రం నిర్మాతకు లాభం తెచ్చినా, బయ్యర్లు 30 నుంచి 50 శాతం నష్టపోయారని ట్రేడ్ వర్గాల వార్త. నిర్మాత లాభపడి.. బయ్యర్లు మునిగిపోతే అది నిజమైన విజయమా? పాఠకుల్ని ఎందుకిలా మోసం చెయ్యడం? అందుకే మీడియా, తారలపై జనానికి విశ్వాసం పోతుంది.
-శాండోప్రచండ్, శ్రీనగర్