మీ వ్యూస్

నిజమే మామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేనమామ మేనల్లుడన్న రియల్ లైఫ్ రిలేషన్‌ను రీల్ లైఫ్‌కి అప్లై చేస్తూ -వెంకటేష్, నాగచైతన్యలతో దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘వెంకీమామ’. నిజానికి కంటెంట్ కంటే.. కాంబినేషనే సినిమాకు ప్రాణం అంటూ ఆంధ్రభూమిలో వచ్చిన రివ్యూ అద్భుతంగా ఉంది. రిలేషన్స్‌లోని ఎమోషన్స్ చూపించే గొప్ప సినిమా అంటూ ప్రచారం చేశారే తప్ప, చిన్న పాయంట్‌ను చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి మళ్లీ చెప్పినట్టే ఉంది. వెంకటేష్ మంచి టైమింగ్‌వున్న హీరో కనుక -కథను చాకచక్యంగా లాక్కెళ్లాడుగానీ.. అంతకుమించి సినిమా నుంచి ఆశించగలిగేది ఏమీ లేదు. థియేటర్లలో ప్రత్యామ్నాయ సినిమా లేక చూడటమే తప్ప, వెంకీమామ గొప్ప కుటుంబ కథా చిత్రమైతే కాదు. సమీక్షలో రాసినట్టు -హీరోల రియల్ లైఫ్ రిలేషనే సినిమాలో ఫ్రెష్ ఫీల్. అంతే.
-పి మల్లిఖార్జున, రాజమండ్రి
ఇదో వెరైటీ
సినిమా విభిన్న శాఖల్లో సర్వశ్రేష్టులకు ఆస్కార్ అవార్డులిచ్చినట్టే చెత్త సినిమాలకు అవార్డులిచ్చే సంస్థ కూడా ఉంది. మన దేశంలోకూడా నెటిజన్లు పరమచెత్త చిత్రాలకు ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి ర్యాంక్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’కి, రెండో ర్యాంక్ ‘కళంకిని’కి, మూడో ర్యాంక్ మన ప్రభాస్ చిత్రం సాహోకి, నాల్గవ ర్యాంక్ హౌస్‌ఫుల్-4కి, ఐదవ ర్యాంక్ ‘కబీర్‌సింగ్’కి దక్కాయి. తమాషా ఏమంటే హిందీ సాహో చిన్న హిట్. హౌస్‌ఫుల్, కబీర్‌సింగ్‌లు పెద్ద హిట్లు అయ్యాయి!
-్ధర్మతేజ, గొడారిగుంట
ఎవరు కరెక్ట్
ముగ్గురు జయలలితల మధ్య పోరు ప్రారంభం అయింది. ఆ ముగ్గురు కంగన, రమ్యకృష్ణ, నిత్యమీనన్. ఈమధ్య కంగన ఫస్ట్ లుక్ విడుదల అయింది. ప్రోస్థటిక్ మేకప్‌తో భారీ బుగ్గలతో కనిపిస్తున్న ఆమె సూట్ కాలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. రమ్యకృష్ణ నటిస్తున్న వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ కూడా వచ్చింది. ఆమె ముఖంగాక వెనకభాగం జడతో కనిపించి అభిమానులకు నిరాశ కలగజేస్తే నిత్యమీనన్ ఫస్ట్‌లుక్ కూడా వచ్చేసింది. నేను మిగిలిన ఇద్దరికన్నా బాగా జయలలిత లాగా కనిపిస్తున్నా అని ప్రకటించింది. నటన, నడక, మాట తీరు, వ్యవహారశైలి ముఖ్యం.. ముఖం కాదు.
-స్నేహమాధురి, కాకినాడ
విషయమదీ..
సాధారణంగా దర్శకుడు నటీనటుల లోపాల్ని గమనిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే నయన్ నేరుగా దర్శకునికే వార్నింగ్ ఇచ్చిందంటూ అదో ఘోర నేరం అన్నట్టు బిల్డప్ ఇచ్చిందొక పత్రిక. అసలు జరిగిందేమంటే ‘గజిని’ చిత్రంలో కీలకపాత్ర అంటూ ఆమెకు చెప్పి చిత్రీకరణలో ఆమె పాత్ర ప్రాధాన్యం తగ్గించి హీరోయిన్ అసిన్‌కి ప్రాముఖ్యం ఇచ్చాడని దర్శకుడు మురుగదాస్‌పై అసంతృప్తితో ఉంది నయన్. ఇప్పుడు దర్బార్ చిత్రంలో రజనీకాంత్ పక్కన ఆమెను తీసుకున్నాడు ఆ దర్శకుడు. గజినిలో చేసినట్టు తన ప్రాముఖ్యం తగ్గిస్తే సహించేదిలేదని నయన్ వార్నింగ్ ఇచ్చింది. సహజమేకదా. ఇదేం ఘోర నేరం కాదుగా. మరెందుకా పత్రిక బిల్డప్?
-్భవదీశ్వరి, జగన్నాథపురం
పరిశీలించండి
పాఠకుల సబబైన సూచనలు పట్టించుకోవడం ఏ పత్రికకైనా తప్పదు. కాని మీరు ‘వెనె్నల’లో అన్ని చిత్రాల సమీక్షలూ కావాలి మహాప్రభో అంటూన్న పాఠకుల మొరను పట్టించుకోవడం లేదు. స్థలాభావం కారణం అయితే చిత్రం పేరు, ప్రక్కన దానికి ఎన్ని నక్షత్రాలు అర్హత వుందో అదైనా ప్రచురించవచ్చునే? ఏమంటారు?
-డి.ఎస్.శంకర్, వక్కలంక
అది పొరపాటు!
నారదుడి పాత్రకు తగిన పాత్రధారి కాంతారావు. ప్రేక్షకుల హృదయాల్లో ఆచంద్రార్క తారాస్థాయిగా నిలచారు. అందరి అభిప్రాయం వారి తొలి నారదుని పాత్ర సీతారామకల్యాణం (1961) అని అందరూ అనుకొంటారు. అదే పొరపాటు (1958) గంగాగౌరీ సంవాదం చిత్రంలో మొదటిసారిగా కాంతారావు నారద పాత్ర ధరించారు. అప్పటినుండి వారు నారద పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా రక్తికట్టించిన నటుడు. కాంతారావు పౌరాణిక, సాంఘిక, జానపద నాయకునిగా ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతీయ తెలుగు నటుడు!
-ప్రసాదరావు, కందుకూరు
ఇప్పుడిలా..!
తెలుగమ్మాయిని కాబట్టి టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదన్న ఈషా రెబ్బా మాట ఒకనాటిది. ఓ పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాటను ఆమే చెప్పింది. అదే పత్రిక ఇటీవలే ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ -తెలుగమ్మాయి కనుక అవకాశాలు రావటం లేదా? అని ప్రశ్నిస్తే -నేనలా అనుకోవడంలేదు. తెలుగమ్మాయిలూ అన్నిరకాల పాత్రల్లో అద్భుతంగా నటించి నిరూపిస్తున్నారు’ అంటూ కొత్త పాటెత్తుకుంది. ఒకప్పుడు తనకి సాంప్రదాయ పాత్రలే ఇచ్చినా, ఇప్పుడు దర్శక నిర్మాతలు అన్ని రకాల పాత్రలూ ఇస్తున్నట్టూ చెప్పుకొచ్చింది. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అన్న పాట ఇలాంటి సందర్భాల నుంచే పుట్టుకొచ్చి ఉంటుంది కదూ!
-అభిలాష, సాంబమూర్తినగర్
కృతజ్ఞతలు
డిసెంబర్ 8న ఆంధ్రభూమి వెనె్నలలో అలనాటి హాస్యనటుడు భీమన సీతారామ్ 40వ వర్థంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలతోపాటు నటించిన అనేక సినిమాల గురించి విశే్లషణతో సవివరంగా ఈ తరం పాఠకులకు అందించారు. ఆయన జ్ఞాపకాలను మా మనసులో నిక్షిప్తం చేసిన రచయితకు అభినందనలు, కృతజ్ఞతలు. వెనె్నల పేజీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులలో పఠనాసక్తిని పెంపొందిస్తున్న సంపాదక వర్గానికి అక్షరాంజలి.
-్భమనవారి కుటుంబ సభ్యులు,
హైదరాబాద్, విజయవాడ, ముంబై