మీ వ్యూస్

నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం విడుదలైన అశ్వత్థామ చిత్రం పేరుకు తగిన విధంగా లేదు. అశ్వత్థామ అంటే, సమాజంలో అన్యాయాలను ఎదిరించేవాడు అన్న అర్థంలో రూపొందించినా కథలో సరైన పట్టులేకపోవడంతో బోరుకొట్టించింది. ఉన్నంతలో కథానాయకుడు నాగశౌర్య పాత్రకు న్యాయం చేసినా సరైన కథ, కథనాలు పండకపోవడంతో అతని కృషిఅంతా వృధా అయింది. హీరోయిన్ అందంగా కనిపించినా సరైన నటన చేయలేకపోయింది. ఒక్క కెమెరా పనితనం బాగుంది. పేరు గొప్పగా వున్న సినిమా చప్పగా సాగి ఆసక్తి లేకుండా ఉంది.
-ఎం.సుదర్శన్‌రావు, ఒంగోలు
వెలుగునీడలు
1961లో వచ్చిన వెలుగునీడలు చిత్రంలో నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలు వున్న సన్నివేశాలు, ఆ సంభాషణలు, వారు పలికినతీరు, పలికేటప్పుడు ముఖాలలో భావాలు గుర్తుకుతెచ్చుకోండి. చిత్రం చూడనివారు చూసి పరిశీలించండి. ఇలాగ ఇప్పటి అగ్రహీరోలు అనబడేవారు సంభాషణలు చెప్పగలరా? ముఖంలో భావాలు పలికించగలరా? ఇంక తెలుగు రాని హీరోయిన్ల మాట చెప్పనేల? తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని దాటి ఇనుప యుగానికి వచ్చేసింది. ముందు ముందు ఏ యుగానికి పోతుందో ఏమో?!
-యుగంధర్, వక్కలంక
పాటలు ఉంటే..
జనవరి 26న వెనె్నలలో వచ్చిన యడవల్లి రచన సుమధురగాత్రి ఎం.ఎల్.వసంతకుమారి గురించి రాసిన వ్యాసంలో, తెలుగు చిత్రాలలో ఆమె పాడిన పాటల్ని ఉదహరించితే బాగుండేది. నాకు తెలిసిన పాటలలో భూకైలాస్ చిత్రంలో మున్నీట పవళించు నాగశయన, భలే అమ్మాయిలు చిత్రంలో సావిత్రిపై చిత్రీకరించిన పాట, రంగులరాట్నంలో బేబి రేఖపై చిత్రించిన పాట జ్ఞాపకం. మిగిలిన పాటలు ఏవైనా వుంటే ప్రచురిస్తారని ఆశిస్తున్నాను. నా ఊహ సరైందో కాదో కానీ మాయాబజార్‌లో శ్రీకరులు దేవతలు పాట పాడినట్టు గుర్తు.
-పి.రామకృష్ణ, ఆదోని
సినిమా బిట్స్
ప్రతివార పత్రికలో సినిమా బిట్స్ తప్పనిసరి. అవి ఎంత నిజమో రాసినవారికి తెలియదు. చదివినవారికీ తెలియదు. ఒక పత్రికలో తమన్నా తన పారితోషికాన్ని రెండు కోట్లకు పెంచేసి ఇస్తారా ఛస్తారా అని మొండికెత్తినట్లు వచ్చింది. అదే పత్రికలో మరోచోట వినయ విధేయ మిల్కీ బ్యూటీకి సినిమా ఛాన్సులు తగ్గిపోయి ఐటెమ్ సాంగ్‌లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అది నిజమా అని ఆమెనే అడిగితే, ఇంత అనుభవం తరువాత రొటీన్ చిత్రాలు చేయడం ఇష్టంలేక బిజీగా వుండడంవల్ల సినిమాలు తగ్గినట్లు కన్పిస్తుందేమో, నేను ఏనాడూ పనిలేకుండా లేను అంటూ ఐటెమ్‌పాటలవల్ల మంచి పేరే వచ్చింది అని చెప్పిందట. అంటే బాగా డబ్బులు వస్తున్నాయని అర్థమా? ఒకపక్క పారితోషికం కోసం మొండికెత్తుతుందని చెబుతూ, ఆమె సినిమా అవకాశాలు లేక ఐటెమ్ పాటలు చేస్తుంది అనటం ఏమిటో అర్థంకాదు. కొన్ని ఇలాంటి గాసిప్స్ రాసే పత్రికలు పాఠకుల్ని తికమకపాలు చేస్తున్నాయి.
-ఎం.గిరిధర్, కాకినాడ
ఇంటర్వ్యూ తారలు
ఇంటర్వ్యూలలో కొందరు తారలు రెచ్చిపోయి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేస్తూ ఇరుకున పడుతుంటారు. ఉదయం ఒక రాష్ట్రం, మధ్యాహ్నం ఒక రాష్ట్రం, సాయంత్రం మరో రాష్ట్రం పరుగులు తీస్తూ అలిసిపోతున్నానని, అందుకే సినిమాలు తగ్గించుకొని సెలెక్టివ్‌గా చిత్రాలు చేస్తున్నామని చెబుతారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో ఎమోషనల్‌పాత్ర చేసి భేష్ అనిపించుకున్నాను అని చెప్పింది రష్మికా మండన. కానీ ఆ చిత్రం ఢామ్ అంది. సరిలేరులో ఫుల్ ఎనర్జీ వున్న పాత్ర చేశాను, నా డాన్సుకి, నటనకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే సంతోషంగా ఉంది అని అంది. కానీ సరిలేరు చిత్రానికి ఆమె మైనస్ అయింది. పాత్ర రూపకల్పన, నటన బాగాలేవని విమర్శలు వస్తున్నాయి. ఇపుడు ఆ చిత్రంలో ఆమె వున్న కొన్ని సన్నివేశాలు తొలగించి కొత్తగా ఆమె లేని మరికొన్ని సన్నివేశాలు చేర్చారట. ఇలా వుంటాయి.. తారల ఇంటర్వ్యూల సంగతులు.
-పి.ఎస్.లక్ష్మి, బృందావని
స్వేచ్ఛగా చూడు
మొదటి రెండు బోల్డ్ సెక్సీ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్‌పుత్‌ని ఆ సన్నివేశాలు చూసి పేరెంట్స్ అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే, పేరెంట్స్‌తో కలిసి అలాంటి సన్నివేశాలు చూడడం కాస్త ఇబ్బందే అని చెబుతూ, స్వేచ్ఛగా అమ్మతో ఆ సన్నివేశాలు చర్చించే చేశాను అంది. ఇంకా నయం! అమ్మతో రిహార్సల్స్ చేశాను అనలేదు! బాలీవుడ్‌లో నటిస్తారా అని అడిగితే, నటించను అని చెప్పేసి, అవకాశం వస్తే అపుడు ఆలోచిస్తా అని అప్పుడు సర్దుకుంది. కోలీవుడ్‌కి మీరు పనికిరారు అన్న విమర్శలు వచ్చాయి కదా అని అడిగితే, ఆ విమర్శలకు ఏడ్చాను. కానీ అవకాశం వస్తే అక్కడ కూడా నటిస్తా అంది. సెల్ఫ్ బూస్ట్‌కోసం ఎన్ని తంటాలు!
-సదాప్రసాద్, గొడారిగుంట
వికటించే ప్రయత్నాలు
హిందీనటుడు అజయ్‌దేవ్‌గన్ ప్రఖ్యాత ఫుట్‌బాల్ కోచ్ బయోపిక్ నిర్మిస్తూ నటిస్తున్నాడు. తన జోడీగా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నాడు. కానీ షూటింగ్ ప్రారంభం అయ్యాక కీర్తి బరువు తగ్గించుకొని కళా కాంతి లేని ముఖంతో పీక్కుపోయినట్లు కన్పిస్తుండడంతో ఆమె పోషించవలసిన తల్లి పాత్రకు సరిపోలేదని తొలగించాడు. జీరో సైజ్ అంటూ సన్నబడిన ఇలియానా సినిమా ఛాన్సులు పోగొట్టుకుంది. బరువు తగ్గే ప్రయత్నంలో ఎన్టీఆర్, సునీల్, రవితేజ వంటివారు రోగగ్రస్తుల్లాగా నిర్జీవ ముఖాలతో కనిపించడంతో మళ్లీ బరువు పెరిగిన తరువాత ఛాన్సులు వచ్చాయి. బరువు తగ్గే ప్రయత్నాలు వికటిస్తాయి మరి!
-శాండో ప్రచండ్, శ్రీనగర్