మీ వ్యూస్

కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఎంతో చిన్నది, విలువైనది. ఒక్కసారి ఆ మణిని కిందపడేసుకుంటే మళ్లీ చేతికి రాదు. విలువైన జీవితాన్ని ఏదో బలహీన క్షణంలో తీసుకున్న అనర్థ నిర్ణయంతో మధ్యలోనే ముగించేస్తే ఎంత వేదన ఆ జీవికి ఉంటుందన్న కథనంతో చిత్రీకరించిన అభినేత్రి చిత్రం యువతకు కనువిప్పు లాంటిది. ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొంటేనే జీవితం. ఏదైనా కష్టపడి సాధిస్తేనే ఆనందం. అందుకోసం నిరంతరం శ్రమించాలి. ఫలితం దక్కి తీరుతుందన్న పాజిటివ్‌గా ఆలోచనలతో ముందుకెళ్లాలి. అందుకనే ఆత్మహత్యలు ఎప్పుడూ మంచిదికాదు. మనం వేసిన విత్తనాలు పెరిగి పెద్దవై ఫలాలనిచ్చే సమయానికి మనం లేకపోతే వేరే ఎవరో తింటారు. అందుకే -శ్రమించిన మనం కనీసం ఫలితం చూడకుండా ఆత్మహత్య పేరుతో వెళ్లిపోవటం పద్ధతి కాదని చెబుతుంది ‘అభినేత్రి’. ఈమధ్యకాలంలో ఓ వైపు కమర్షియాలిటీ, మరోవైపు సందేశంతోవున్న చిత్రం రాలేదు.
-టి.రఘురామ్, నరసరావుపేట
బావుంటుంది
దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవికి సీక్వెల్‌గా తీయనున్న చిత్రానికి ‘ప్రతాప- యుగంధర’ అని పేరుపెడితే బాగుంటుంది. ప్రతాపరుద్రునిగా బాలకృష్ణ, యుగంధరునిగా సీనియర్ నటుడు కబీర్ బేడీని ఎంపిక చేస్తే సినిమా సూపర్ అనిపిస్తుంది.
-కె.వెంకటేశ్వర్లు, కరీంనగర్
ఫేవరేట్
ఆరోజుల్లో ఇల్లరికం చిత్రం మా ఫేవరేట్. పదిసార్లు చూశాం. మొన్న ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ చిత్రం గురించి చదువుతుంటే మనోఫలకంపై దృశ్యాలన్నీ కనిపించాయి. హృదయంలో పాటలన్నీ వినిపించాయి. చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు పాటలో, కొత్త కుండలో నీరు తియ్యన అనే చరణం వివాదాస్పమైంది అప్పట్లో. దానిలో బూతు వుందని తొలగించాలి అని రభస జరిగింది. దానిలో బూతు ఏమిటో మాకిప్పటికీ తెలియలేదు. మీకు తెలుసా? అయినా ఈ రోజుల్లో ఘోరమైన బూతులు సినిమాల్లో చూస్తున్నాం, వింటున్నాం. కొత్తకుండకు అభ్యంతరం ఏమిటో?!
-కె.సుధీర్, శ్రీనగరం
సమగ్రం లేదు
ఇల్లరికం సినిమాపై ఇచ్చిన ఫ్లాష్‌బ్యాక్ విశేషాలు బాగున్నాయి. కానీ రేలంగి, రమణారెడ్డి, బాలలపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రస్తావన లేకపోవడంతో ఈ వ్యాసం సమగ్రంగా లేదు అనవచ్చు. అదే అందుకు నిదర్శనం.
-డొక్కా సోమశంకరం, వక్కలంక
అతి బలవంతులు
మన హీరోలు అతి బలవంతులు వ్యాసంలో చెప్పినవేకాక మరికొన్ని నిజాలు ఉన్నాయి. చావుదెబ్బలు తిని విలన్ కుప్పకూలితే, హీరో తంతాడు. ఆ విలన్ శరీరం వంద గజాలు జారుకుంటూ వెళుతుంది! కిందపడ్డ విలన్ గుండలమీద హీరో కాలుపెట్టి డైలాగులు గుప్పిస్తాడు. అలా చేయడం మానవత్వం కాదు, దానవత్వం, కిరాతకత్వం. ప్రేక్షకుల్లోని ఇగో దానవత్వాన్ని సంతృప్తిపరచడానికే తెరపై కిరాతకాలు సృష్టిస్తున్నారు దర్శకులు. మరో వింత ఏంటంటే, పొడవాటి గుడ్డ ఓ కొస హీరో పట్టుకొని రెండో కొసని విలన్‌వైపు విసిరి లాగుతాడు. ఆ రెండో కొస విలన్ మెడకు చుట్టుకుని వాడిని హీరో వద్దకు లాక్కొస్తుంది. ఓహో! సైన్స్‌కి, సెన్స్‌కి అందని ఎంత గొప్ప సృజనాత్మకత మన దర్శకులది! నిజానికి చైనా, కొరియా చిత్రాలనుంచి వచ్చిన పైత్యం ఇది.
-ఎ.చైతన్య, వాకలపూడి
మళ్లీ రావాలి
ఒకప్పుడు పౌరాణిక చిత్రాలకు విశేషాదరణ వుండేది. ఎస్‌విఆర్, ఎన్టీఆర్, గుమ్మడి, సరోజాదేవి, సావిత్రి వంటి మహానటులు పాత్రలకు ప్రాణం పోయగా, అద్భుతమైన కథ, కథనాలు, ప్రతిభగల దర్శక నిర్మాతలు, మాధుర్యం వున్న సంగీతాన్ని అందించే సంగీత దర్శకులు ఉండేవారు. సుశీల, ఘంటసాల, ఎ.ఎం.రాజా, జిక్కి వంటి మధుర గాయకుల అమృతగానం, అభిరుచివున్న ప్రేక్షకులు వెరసి ఆనాటి పౌరాణిక జానపద చిత్రాలు ఘనవిజయం సాధించాయి. రానురాను అలాంటి చిత్రాలకు కాలం చెల్లింది. ఆదరణ కరువై వాటిని తీయడం మానేశారు. కానీ ఈ రోజుల్లో వచ్చిన అధునాతన టెక్నాలజీ, ఆధునిక గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కలగలిపి అలాంటి చిత్రాలు ఘనవిజయం సాధిస్తున్నాయి. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. ప్రేక్షకాభిరుచిలో మంచి మార్పు వచ్చింది. అందుకే మళ్లీ చారిత్రక జానపద పౌరాణిక చిత్రాలు రావాలి. సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసే నటులు, అద్భుతమైన కథ కథనాలు, ప్రేక్షకులను ఆకట్టుకునే టెక్నాలజీ, మైమరపించే మ్యూజిక్‌తో చిత్రాలు రావాలి. ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కృతజ్ఞులం
వెనె్నలలో శరత్కాలం విశేషాలు అబ్బురపరుస్తున్నాయి. షావుకారి జానకి వ్యాసం బాగుంది. నాకు నచ్చిన చిత్రం, నచ్చినపాట జనరంజకంగా సాగుతున్నాయి. సినిమా సమీక్షల విషయంలో మాత్రం మీ కచ్చితత్వానికి వీరతాడు వేయాల్సిందే. మీ వ్యూస్‌లో రకరకాల కథనాలు ఆకట్టుకుంటున్నాయి. ఇలా చిత్ర విచిత్ర సమాచారాలతో వెనె్నల పేజీ తీర్చిదిద్దుతున్నవారికి కృతజ్ఞులం.
-ఎంవి రాజు, కుతుకులూరు
ఇరుకున పెడుతున్నాడా?
ధృవ చిత్రాన్ని అరవిందస్వామి ఇరుకున పెడుతున్నాడా అని అంటే, ఔననే చెబుతున్నారు చరణ్ సన్నిహితులు. నిజానికి అరవిందస్వామి తప్పేమీ లేదు. ధృవకు మాత్రుక అయిన ‘తనిఒరువన్’లో విలన్ అరవిందస్వామి హీరో జయం రవిని డామినేట్ చేసి బాగా నటించాడట. రవిని ఎవరూ పట్టించుకోలేదు. అందరూ అరవిందస్వామినే పొగుడుతుంటే, రవికి పెద్దగా అభిమానులు లేకపోవడంవల్ల సమస్య రాలేదు. కానీ, తెలుగులో చరణ్‌ని అరవింద్‌స్వామి డామినేట్ చేసి నటిస్తే అభిమానులతో సమస్యే వస్తుంది. అందుకే ఇప్పుడు కథను మార్చి హీరోని బూస్ట్ చేసేవిధంగా రాద్దామనుకున్నా అసలుకే ఎసరు వస్తుంది. పోనీ అరవిందస్వామిని పాత్రను తగ్గిస్తే చిత్రం దెబ్బతింటుంది. ఇది అసలు సమస్య. ఏం చేస్తారో మరి!
-బి.చంద్రిక, రాజేంద్రనగరం