మీ వ్యూస్

పండగ సినిమాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి నేపథ్యంలో విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పరిశ్రమకు శుభపరిణామం. ఖైదీ నెంబర్ 150 అంటూ చిరంజీవి అభిమానుల కోసం రూపొందించిన చిత్రం బావుంది. గ్రామం కోసం కార్పొరేట్ కంపెనీలకు ఎదిరించే హీరోగా చిరంజీవి నటన సూపర్. పాటల్లో కాజల్ డ్యాన్స్‌లపరంగా తేలిపోయింది. ఇక తెలుగు చక్రవర్తి శాతకర్ణిగా బాలకృష్ణ నటన తారాస్థాయిని అందుకుంది. తండ్రి ఎన్టీఆర్‌ను మరిపించేలా బాలకృష్ణ చేయగలిగాడు. తెలుగువాడి చరిత్రను దర్శకుడు క్రిష్ అందించిన వైనం మెచ్చుకోదగ్గదే. కుటుంబ కథలకు మొగంవాచివున్న తెలుగు ప్రేక్షకుడికి పండుగ విందుభోజనం -శతమానంభవతి. మనుషులు దూరమైనపుడే అనుబంధాల విలువ తెలుస్తుందన్న అంశంతో దర్శకుడు చిత్రాన్ని తీయడం బావుంది. హీరో శర్వానంద్ మరో సంక్రాంతి హిట్టు పట్టాడు. మొత్తానికి ఈవారం సినిమాలన్నీ ఆకట్టుకున్నాయి.
-టి రఘురామ్, నరసరావుపేట

విలనిజానికి...
ఎందరో హీరోలుగా ఎదిగి తరువాతి కాలంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విలన్లుగా మారిన సంఘటనలు తెలుగు సినీ చరిత్రలో కొత్తవేం కాదు. అలనాటి జానపద హీరో కాంతారావు హీరోగా ఎంత ప్రాచుర్యం సంపాదించారో, తదనంతర కాలంలో విలన్‌గా అవతారం ఎత్తారు. దేవుడు చేసిన మనుషులు, ఎదురులేని మనిషి తదితర చిత్రాల్లో తనదైన విలనీని చూపించారు. హీరోగా అడుగిడిన రంగనాథ్ తరువాతి కాలంలో విలన్ అయ్యాడు. ఖైదీలాంటి చిత్రాల్లో విలనిజాన్ని చూపాడు. ఏది నిజం?లో హీరోగా తెరంగేట్రం చేసిన నాగభూషణం విలన్‌గానే స్థిరపడ్డాడు. కృష్ణంరాజు తొలుత హీరోగా నటించి, విలనీనీ పండించారు. సుమన్, మోహన్‌బాబు, చిరంజీవి, భానుచందర్, మాదల రంగారావు, రామకృష్ణ, వినోద్‌కుమార్, సాయికుమార్ లాంటి నటులు హీరోలుగా చేసి విలనీని పండించిన వాళ్లే. కొత్తతరంలో తారక్, ఆదిలాంటి వాళ్లూ విలనీని గొప్పగానే చేస్తున్నారు. పాత్రలకు పరభాషా నటులు అవసరం వస్తే తప్ప, మన తెలుగు విలన్లనే నటింపచేస్తే బావుంటుంది.
ఐనం రఘరామారావు, ఖమ్మం

ఆత్మవిశ్వాసమే..
శరత్కాలంలో కళామతల్లి వరప్రసాదం, 101 జిల్లాల అందగాడి వివరాలు అందించటం బావుంది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలబడిన నూతన్‌ప్రసాద్, ప్రమాదానికి గురైన తరువాతా ఆర్టిస్టుగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన తీరు శరత్కాలంలో చెప్పిన విధానం బావుంది. ఆత్మవిశ్వాసం ఉంటే కళాకారుడికి అంగవైకల్యం అడ్డుకాదని వీల్‌చైర్ నుంచే ఎన్నో పాత్రలు పోషించి, అవార్డులు అందుకున్న నూతన ప్రసాద్.. అవయవాలన్నీ బావున్న వాళ్లకూ ఆదర్శప్రాయుడే.
-యు సత్యనారాయణ, తెనాలి

కళాకారులకు అవమానమా?
అలనాటి సంగతి శీర్షికలో ఆమే పాడాలి అన్న పేరుతో సిరిసంపదలు సినిమాలో ఘటసాల, జానకి పాడిన ‘ఈ పగలు రేయిగ’ పాటను సుశీలతో పాడిస్తే బావుంటుందని సావిత్రి సలహా ఇచ్చారు. అయితే దర్శకులు పుల్లయ్య.. ఒకరిచేత పాడించిన పాటను తొలగించి వేరేవారితో పాడిస్తే ఆ కళాకారులను అవమానించడమేనని చెప్పిన సంగతి ఆనందం కలిగించింది. కానీ, ఇలాంటి వాటికి భిన్నంగా కొన్ని సంఘటనలు జరిగాయి. బిఏ సుబ్బారావు చెంచులక్ష్మి సినిమాలో ‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా’, అలాగే ‘చిలకా గోరింక/ కులికే పకాపకా’ పాటలను పిబి శ్రీనివాస్, జిక్కిలతో రికార్డు చేయించారు. కంపెనీ రికార్డులు మార్కెట్లోకి వచ్చాయి. నాగేశ్వర రావుకు ఆ పాటలు నచ్చక తిరిగి ఘంటసాల, సుశీలతో పాడించి సినిమాలో పెట్టారు. అలాగే, ఏవిఎం వారి మూగనోము చిత్రంలో పిబి శ్రీనివాస్ పాడిన ఊరుమారినా/ ఉనికి మారునా పాటను నాగేశ్వర రావే పట్టుబట్టి ఘంటసాల వారిచేత పాడించారు. అయితే, ఇలవేల్పు సినిమాలో చల్లని రాజా ఓ చందమామ పాటను మాత్రం ఘంటసాల అందుబాటులో లేకపోవడంతో రఘునాథ పాణిగ్రాహి చేత పాడించి రికార్డు చేశారు. ఎల్‌వి ప్రసాద్‌కు ఎదురు చెప్పలేక ఆ పాటను యథాతథంగా అలాగే ఉంచారు నాగేశ్వర రావు. పి పులయ్య చెప్పిందే నిజమని ఈ సంఘటనలతో అర్థమవుతుంది.
-పి రామకృష్ణ, ఆదోని

అసలు విషయం
తమన్నా నటించిన ఒక్కడొచ్చాడు దర్శకుడు సూరజ్ నటీమణుల గురించి అసభ్యంగా మాట్లాడాడని అందరూ విరుచుకుపడుతున్నారు. కానీ, అదే నిజం. మిగిలిన దర్శకులు, నిర్మాతలు బయటకు చెప్పలేకపోయినా వారి అభిప్రాయం, ప్రేక్షకుల మాట కూడా అదే. చేసేది ఐటెమ్ పాట అయినా పరువుకోసం దాన్ని స్పెషల్ సాంగ్ అని పిలుచుకుంటున్న వారికి అసలు విషయం తెలీదా? మరి ఎందుకు తమన్నా స్పెషల్ సాంగ్ పేరుతో సెక్సీ విన్యాసాలకు అంత సొమ్ము వసూలు చేసింది? మడిగట్టుకుని కూర్చుంటే కుదరదని గ్రహించటం వల్లే కాజల్ కూడా ఐటెమ్‌ను చేసింది. సూరజ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముంది మరి?
పి చంద్ర, కాకినాడ

అలనాటి సంగతి
నాణ్యతే ముఖ్యం
పద్మశ్రీ వారి మురళీకృష్ణ చిత్రం కోసం కనులు కనులు కలిసెను/ కనె్న మనసు తెలిసెను పాటను శ్రీశ్రీ రాశారు. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల 13 టేకులు తీసుకున్నారు. అయనా రికార్డింగ్ పూర్తికాలేదు. అయితే, ఘంటసాల టేకులన్నీ గాత్ర వైఫల్యం వల్ల కాదు, వాజ్య బృందంలో ఎవరో ఒకరు సరిగా వాయంచలేకపోవటం, తప్పుగా వాయించటం వల్ల. 13వ టేకు తరువాత దర్శకులు పుల్లయ్య అసంతృప్తిగానే పాటకు ఓకే చెప్పేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో నేను వెళ్లడం జరిగింది. అందుకే విషయం తెలుసు.
అయితే, అలా రికార్డు చేసిన పాట సినిమాలో లేదు. ఆ తరువాత తెలిసినది ఏమిటంటే మళ్లీ ఇంకోసారి అదే పాటను పాడించి, తరువాత సినిమాలో ఉపయోగించారని! క్వాలిటీ విషయంలో అప్పట్లో అంత శ్రద్ధ తీసుకునే వారు మరి.
డిఎస్ శంకర్, వక్కలంక