మీ వ్యూస్

గ్రేట్.. శర్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ సీజన్ నడుస్తుంది. వరుసగా పడుతున్న సినిమాలతో సీనియర్ హీరోలకు చాలెంజ్ చేసే స్థాయిక ఎదుగుతున్నాడు. పర్ఫార్మెన్స్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎంచుకుంటున్న పాత్రలు కెరీర్‌ను ‘బుల్లెట్ ట్రైన్’లా పరిగెత్తిస్తున్నాయి. ఇటీవలి వచ్చిన శతమానంభవతి చిత్రం చూసినపుడు -పాత్రను పండించటంలో శర్వా స్టామినా కనిపించింది. మరో రెండు మూడు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయంటే -నానిలాంటి బిజీ హీరోలకు చెక్ పెట్టగలుతాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. చిత్రంలో అనుపమ నటన చాలా బావుంది.
-పిఎల్ మల్లిక, తిరుపతి

తగ్గని మెగా పవర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం చిరు అభిమానులకు చక్కటి ఆనందాన్ని అందించింది. కత్తికి రీమేక్ అయినా, రైతు సమస్యలు ప్రధానంగా నిర్మించిన చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ మరింత హుషారుగా కనిపించారు స్టెప్స్, పాటలు, డైలాగ్‌లు శెభాష్ అనిపిస్తాయి. నటి కాజోల్ మరింత అందంగా కనిపించింది. దర్శకుని ప్రతిభ, దేవిశ్రీప్రసాద్ సంగీతం సూపర్.
-పిజి రామనందనం, తుని

నృత్య నాయికి
పాత సినిమాల్లో నృత్యాలన్నీ శాస్తబ్రద్ధంగా లయ తప్పకుండా సంగీత భరితమై ఉండేవి. నృత్య గీతం అనగానే గుర్తుకొచ్చేది కచ్చితంగా నృత్య కళాకారిణి ఎల్ విజయలక్ష్మే. శరత్‌కాలంలో రాసినట్టు ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారికి హీరోయిన్‌గా నటించడమేగాక నెగిటివ్ పాత్రలు వేసినా అసభ్యం అనిపించకుడా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాపరంగా పేరుప్రతిష్టలు సంపాదించి కూడా నృత్యనాయికి వెండి తెర మీద వెలుగుతున్నప్పుడే సినిమాలకు స్వస్తి పలికింది. ఆనాటి మరికొంతమంది నటీమణులు నృత్యాలు చేసినా విజయలక్ష్మి సాటి రాలేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికిందరాబాద్

స్క్రీన్‌ప్లే మాయాజాలం
విభిన్నమైన కథ, పాత్రలు ఎంచుకునే నారా రోహిత్ నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా ఫరవాలేదు అనిపించింది. ఇంకాస్త జాగ్రత్తపడితే బాగుండేది. రైల్వేరాజు పాత్ర పర్లేదు. కాని ఇంతియాజ్ పాత్రలో నారా రోహిత్ నటించడానికి ఏమీ లేదు. పైగా అత్యంత స్వార్ధపరునిగా వ్యక్తిగత కక్ష తీర్చుకునే ఓ పోలీసు అధికారిగా నటించాడు. తన కుటుంబాన్ని అన్నలు చంపారని వాళ్లని, వాళ్ల కుటుంబాలని సర్వనాశనం చేస్తూ, కలెక్టర్‌నే బ్లాక్‌మెయిల్ చేసి బెదిరిస్తూ తన చెల్లిని కాపాడాడని ఒక రౌడీని వదిలేసి, ఇలా పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తూ తేలిపోయాడు. నారా రోహిత్‌ని అభిమానించే వారికి కూడా పెద్దగా నచ్చని పాత్ర అది. రైల్వే రాజు పాత్ర ముందు ఇంతియాజ్ పాత్ర ఓ మరుగుజ్జుగా అనిపించింది.
-పగడాల పాండు, హైదరాబాద్

శాతకర్ణి పరుగు
తెలుగుజాతి గర్వించే రీతిలో నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చరిత్ర కావ్యంలా దర్శకుడు క్రిష్ చక్కటి ప్రతిభతో తీర్చిదిద్దాడు. బాలకృష్ణ నటనకు ఈ చిత్రం మరో మైలురాయి. సంభాషణలు అందించిన సాయిమాధవ్ అభినందనీయుడు. హేమమాలిలి, శ్రేయలు చక్కగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. యుద్ధ ప్రక్రియలు, అలనాటి వస్తధ్రారణ ఆకట్టుకుంది. గత చిత్రాలకు భిన్నంగా ఉచ్ఛారణ, శరీరాకృతి.. ఇటువంటి చిత్రాలకు తనకుతానే సాటి అన్నట్టు జీవించిన బాలకృష్ణ శాతకర్ణిగా మైమరిపించారు. ఏడాదికి కనీసం ఒక్క చిత్రమైనా తెలుగు పరిశ్రమ నుంచి రావాలని అభిలషిస్తున్నాం. చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోద పన్ను మినహాయించడం అభినందనీయం! చరిత్రగాథలు మరిన్ని రావాలి!
-ఎల్ ప్రపుల్లచంద్ర, ధర్మవరం
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

కమర్షియల్ ఆలోచనే
బాలీవుడ్ బయోపిక్ జపం చేస్తోంది. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని విజేతగా నిలిచిన ఆదర్శప్రాయుల జీవితం ప్రేరణగా బయోపిక్ తీయాలి. కాని కళంకితుల జీవితాలకు మెరుగులద్ది వాస్తవాల్ని వక్రీకరించి, లేదా తొలగించి, హీరో భజన చేసే చిత్రాలు బయోపిక్‌లుగా చలామణి అయిపోతున్నాయి. అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్, మ్యాచ్ ఫిక్సింగ్ కళంకితుడు అజరుద్దీన్‌లపై తీసిన చిత్రాలు మెరుగులు అద్దబడి కల్పిత కథ అని తెరమీద చూపించి బయట బయోపిక్‌లుగా ప్రచారం చేసుకున్నవే. ఇప్పుడు ఉగ్రవాదులతో చేయి కలిపి, ఆయుధాలు కేసులో జైలుకెళ్లి వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ తీస్తారట! హత విధీ!
-మైథిలి, సర్పవరం

ఎందుకీ పొగడ్తలు
చిరంజీవి 150వ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో గుంటూరులో వైభవంగా జరిగిన దాసరి నారాయణరావు, సుబ్బిరామిరెడ్డి తదితర ప్రముఖులంతా హాజరై చిరంజీవిని పొగడ్తల్లో ముంచేశారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయనకు తగిన కథ దొరకక తమిళంలో ఓ కుర్రాడు నటించిన కత్తి సినిమా దొరికింది. మంచి స్క్రిప్ట్ దొరికితే కోటి రూపాయలు ఇస్తానన్నాడు చిరంజీవి ఓ రోజు. 62ఏళ్ల వయస్సుగల ఆయన ఇంకా 25ఏళ్ల కుర్రాడిగా నటించడం, ఆయన కుమార్తె వయసున్న కాజల్‌తో గెంతటం, పొగడ్తల్లో ముంచిన వాళ్లకి నచ్చిందా? తారేజమీన్‌పర్, దంగల్, పికెలాంటి సినిమాలను తన వయస్సుకు తగిన విధంగా మార్చుకొని, నటించలేడా? ఈ సినిమాలో 25ఏళ్ల కుర్రాడిగా చిరు కనిపిస్తాడని దాసరి పొగడటం విడ్డూరం.
-యండి యూసుఫ్, కాజీపేట

ఇంతేనా..!
తెలుగు పరిశ్రమలో చిత్రమైన ధోరణి కనిపిస్తోంది. కొందరు హీరోలు వైవిధ్యమైన కథలతో వస్తుంటే, ఇంకొందరు పరభాషా కథలు ఏరి తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే సరైన కథలు దొరకక ఎప్పుడో ఒకే అనిపించుకున్న చిత్రాలనే సీక్వెల్స్ పేరిట కాస్త అటూ ఇటూ చేసి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి తెలుగు పరిశ్రమలో ఇంతకు ముందొచ్చిన చాలా సీక్వెల్స్ ఒక్కటీ ఆడియన్స్‌ని ఆకట్టుకోలేక పోయాయి. అయినా, గత్యంతరంలేని పరిస్థితుల్లో ‘హిట్టు’ చిత్రాల సీక్వెల్స్ కోసం ఎగబడటం చూస్తుంటే -పరిశ్రమ స్టామినా దిగజారిపోతోందా? అనిపిస్తోంది.
-అరవింద్, సికింద్రాబాద్