మీ వ్యూస్

కలర్‌ఫుల్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హథీరామ్ భక్తికథను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సరళంగా చెప్పడంలో దర్శకుడు రాఘవేంద్రరావు తన అనుభవాన్ని రంగరించారు. రొమాన్స్‌నైనా, భక్తినైనా -స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా డిజైన్ చేయడంలో తెలుగు దర్శకుల్లో రాఘవేంద్ర రావును మించినవారు లేరు. ఆ విషయాన్ని ఓం నమో వేంకటేశాయ చిత్రంతో మరోసారి రుజువు చేసుకున్నాడు దర్శకుడు. భక్తిరసానికి సంబంధించి నాగార్జునను ఒక ఐకాన్‌గా ప్రేక్షకులకు అలవాటు చేసేసిన రాఘవేంద్రరావు, ఈ చిత్రంలోనూ నాగ్ ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయో వాటిపైనే దృష్టిపెట్టినట్టు అనిపించింది. నాగార్జునకు ఇది మంచి సినిమాయే అయినా -ఇంతకుముందు చేసిన భక్తి చిత్రాలతో పోలిస్తే వైవిధ్యం చూపించటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ప్రయోగం పేరిట ప్రచారం చేసుకోవటానికే తప్ప, నాగ్ ట్రాక్‌లో ఇదో గొప్ప సినిమా అని మాత్రం చెప్పలేం. సినిమా క్రెడిబిలిటీ అంతా -రాఘవేంద్రరావుదే.
-కాకర్ల గోపీనాథ్,
రాజమండ్రి
ఎంతకాలం చూస్తారు?
తన చిత్రానికి తెలంగాణలో 23 థియేటర్లు దొరికాయిగానీ, ఆంధ్రలో అతి కష్టంమీద దొరికిన కొద్ది థియేటర్ల, పెద్ద చిత్రం రాగానే సినిమాను తొలగించారని, చూడాలనుకున్న వాళ్లు చూడలేకపోయారని ఆర్ నారాయణమూర్తి ఆక్రోశించారు. థియేటర్లపై గుత్త్ధాకారాన్ని నిరసించారు. మార్కెట్ పోకడ ఆయనకు తెలియనిదా? జనవరి పండగ సీజన్‌లో పెద్ద చిత్రాలు ఉన్నాయని తెలిసి కూడా ఆ సీజన్‌లోనే తన చిత్రాన్ని వదిలితే, అంతే జరుగుతుందని. సూర్య, పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లే పోటీ వద్దని తమ చిత్రాలను వెనక్కి జరుపుకున్నారు. నారాయణ మూర్తి తన చిత్రాన్ని తగిన సమయంలో వదలాల్సింది. అయినా ఆయన చిత్రాలు ఒకటి చూస్తే చాలు, అన్ని చిత్రాల్లోనూ అదే నటన, అదే పోకడ, అవే మాటలు, పాటలు. తీరేదీ మారదు. అలాంటి చిత్రాలు ఎవరు ఎంతకాలం చూస్తారు.
పి శాండీ, కాకినాడ
అద్భుతం
అలనాడు ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చలన చిత్రాలు చూసిన నాటి ప్రేక్షకులు నేటికీ మరువలేకపోతున్నారు. కీలుగుర్రం, అనార్కలి, పాతాళభైరవి, జ్వాలాదీప రహస్యం, రాజమకుటం, సువర్ణసుందరి, పరమానందయ్య శిష్యుల కథ, జగదేకవీరుని కథ, కంచుకోట, మల్లీశ్వరి.. ఇంకా ఎన్నో పేరెన్నికగన్న సినిమాలు, వాటిని రూపొందించిన సంస్థలు అపూర్వమైనవి.
అప్పటి సినిమాలనే ఇప్పటికీ ఎన్నోసార్లు చూస్తూ ఆనందం పొందుతున్నారు. ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నూటికి నూరుపాళ్లు స్వర్ణయుగం అని చెప్పే మాట. అలాంటి చిత్రాలు కాలానికి ఎదురు నిలిచి నేటికీ మరపురాని ఆపాతమధురాలుగా నిలిచాయి. ఈవారం సహస్త్ర శిరచ్చేద అపూర్వ చింతామణి విశే్లషణ ఎంతగానో ఆకట్టుకుంది. అలనాటి తారలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నది, వారి చిరునామాలు తెలియచేసే శీర్షిక ప్రవేశపెడితే బావుంటుంది.
జి సుధాకర పట్నాయక్, కాకినాడ
లోకలే..!
గతంలో వచ్చిన ఇడియట్, నువ్వేనువ్వే, సినిమా చూపిస్తమావ లాంటి హిట్టు సినిమాల్లోంచి ముఖ్యమైన పాయింట్లు తీసుకుని నేను లోకల్ సినిమాగా మలిచారు. అయితే, సినిమా ఏమాత్రం బోరు కొట్టకుండా వినోదాత్మకంగా మలిచారు. నేను లోకల్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. నాని ఈ సినిమాలో టాప్‌గేర్‌లో నటించాడు. కామెడీ, ఎమోషన్స్, లవ్‌ట్రాక్, ఫైట్స్, డ్యాన్సులు.. అన్నీ తన భుజస్కందాలపై మోశాడు. కామెడీ పంచ్‌లు పేలాయి. సంగీతం ప్లస్ అయ్యింది. ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా రెండు గంటలపాటు సినిమాను లాగించేయడం వలన బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే చేసింది.
సి ప్రతాప్, శ్రీకాకుళం
మంచి నిర్ణయం
నడి వయసులో నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ కథ ఆధారంగా బయోపిక్ నిర్మించాలని నిర్ణయించుకోవడం అభినందనీయం. వాస్తవంగా ఈ అవకాశం ఇంకొకరి చేతికి చిక్కకూడదు. నందమూరి వారసులే తీయాలి. ముఖ్యమైన పాత్రల్లో వారసులే కనిపించాలి. ఈ సినిమాను మనం చిత్రంలాగ చరిత్రలో గుర్తుండిపోయేలా తీయాలి. ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్లు, సమకాలీకుల పాత్రలుండేలా కథను రూపొందిస్తే సంపూర్ణత చేకూరుతుంది.
కవి, పెనుగొండ
ఐదు ఆటలు!
ఆధునిక జీవన శైలిలో -పగలంతా పని చేసి రాత్రి విశ్రాంతి తీసుకోవాలనే రూల్స్ ఏమీ లేవు. అర్థరాత్రి షిఫ్టులతో కూడా జనం బిజీగానే ఉంటుంది. సో, అర్థరాత్రి సినిమాలు ప్రదర్శించినా చూడ్డానికి సిద్ధంగానే ఉండే కాలమిది. తెలంగాణలో ఇక నుంచి ఐదో ఆటా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచన బావుంది. కనీసం చివరి ఆటలో చిన్న సినిమాలు విడుదల చేసుకోవడానికి అవకాశమిచ్చినా ప్రయోజనం ఉంటుంది. పెద్ద సినిమాలు పడినా, చిన్న సినిమాలు విడుదలకు అవకాశం కలుగుతుంది. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి ఎంత తొందరగా తెస్తే అంత మంచిది.
-విఆర్‌ఆర్ రాజు, హైదరాబాద్
అది తగదు!
ఓ మహిళా నిర్మాత రూపొందించిన టీవీ సీరియల్‌లో గాయాలతో స్పృహతప్పి ఐసియులోవున్న వ్యక్తి వద్దకు అందరూ వచ్చేస్తూ, అతన్ని కుదిపేస్తూ డైలాగులు చెబుతారు. అతడ్ని హత్య చేయడానికి వచ్చినవాడు సిబ్బంది యూనిఫాం ధరించి తిరుగుతుంటే, డాక్టర్ అతిడితో మాట్లాడతాడు. సిబ్బంది ఎవరో తెలియని అయోమయం డాక్టర్ పాత్ర అది. చివరకు వాడు బాధితునికి అమర్చిన ఆక్సిజన్ కనెక్షన్ తొలగించి పోతాడు. ఆస్పత్రి సిబ్బంది ఇది గమనించరు. పెద్ద ఆస్పత్రుల్లో ఐసియు ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటుందా? చాలా సినిమాలలో, సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు పెడుతున్నారు. ఆస్పత్రిలో ఎవరైనా దూరి ఈజీగా హత్యలు చేసేయొచ్చు అన్న భావన కలుగచేయడం దర్శక నిర్మాతలకు తగని పని.
సి మైథిలి, సర్పవరం