మీ వ్యూస్

మళ్లీ తీయొచ్చుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాలు -అతుకుల బొంతలా తయారయ్యాయ. వ్యాపార దృష్టితో నాలుగైదు సూపర్‌హిట్ సినిమాల సన్నివేశాలు కాపీకొట్టి, చేతనైనంతగా అతికించి ఇదే సినిమా అంటున్నారు. అంటే పాత మిక్స్‌డ్ పచ్చడికి కొత్త తాలింపన్న మాట. అతుకులు సరిగ్గా అమరి కొత్త డిజైన్‌లా కనిపించేవన్నీ హిట్ అవుతుంటే -అతుకులన్నీ మాసికల్లా కనిపించే ఫెయిలవుతున్న సినిమాలే ఎక్కువనిపిస్తోంది. ఎందుకు? ఈ పాత కథల పచ్చళ్లు? కొత్త కథలు దొరకడం లేదా? కథలే దొరక్కపోతే తెలుగు సినిమాల్లోని మంచి కథలతో విజయం సాధించిన చిత్రాలు పాతవి చాలా ఉన్నాయి. ఆ కథలనే యథాతథంగా తీస్తే సక్సెస్ రేటు పెరుగుతుందేమో. హాస్య చిత్రాలు, కుటుంబ కథా, యాక్షన్, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత చిత్రాలను మళ్లీ తీస్తే బెటరేమో కదా.
-ఎస్ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఎస్.. ఓకే
సూర్య కథానాయకుడిగా వచ్చిన ఎస్-3 బావుంది. సూర్య, అనుష్క బాగా నటించారు. ముసిముసి నవ్వుల పాట వినసొంపు. అయితే, హరీశ్ జైరాజ్ సంగీతం కాస్త పల్చబడింది. దర్శకుడు హరి తన పాత స్టయిల్‌నే నమ్ముకుని సినిమాను పరిగెత్తంచడం వరకూ ఓకే. ఇంకోసారి పరిగెత్తే స్క్రీన్‌ప్లేనే ప్రయోగిస్తే మాత్రం -ఎదురుదెబ్బ తగలడం ఖాయం. సీక్వెల్‌గా వచ్చినాగానీ, పాత రెండు పార్టులంత గొప్ప సినిమా అని మాత్రం చెప్పలేం.
-సిహెచ్‌ఎస్ మనస్విత, బాగ్‌అంబర్‌పేట

బలవంతపు దేశభక్తి
సంక్రాంతికి సినిమాకు వెడితే మూడు సినిమాలు హాయిగా ఉన్నాయి. ప్రేక్షకులంతా జాతీయగీతం వినిపించే సమయంలో లేచి నిలబడ్డారు. మూడో చిత్రం హాలులో మాత్రం జనం పల్చగావుండి మూడో క్లాసులో వారు ఎదుటి కుర్చీలపై కాళ్లు పెట్టి మరీ కూర్చున్నారు. జాతీయగీతం ప్రదర్శిస్తుంటే అలా కూర్చోవడం బాధ అనిపించింది. దేశభక్తి అనేది సందర్భానుసారం ప్రజల మనసుల నుంచి పుట్టాలేగానీ, ఈ బలవంతపు చర్యవల్ల కాదనిపించింది. వంద తప్పులు చేసిన దోషి తప్పించుకున్నా ఫరవాలేదుగానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్న న్యాయసూత్రాన్ని నమ్మే మన దేశంలో -దేశభక్తి ప్రదర్శించకున్నా ఫరవాలేదుగానీ కించపర్చే దృశ్యం ఒక్కటి కంటపడినా భరించలేం అనిపిస్తుంది. కాదంటారా?
-యుగంధర్, ఒక్కలంక

ఇవా సినిమాలు?
వినోదం పంచడానికి చిత్రాలు తీస్తున్నాం అని దర్శకులు అంటున్నారు. వారి దృష్టిలో వినోదమంటే బూతులు, చెంపదెబ్బలు, తన్నులేనా? ఓ సినిమాలో హీరోగారు ప్రయాణికులకు నిద్రాభంగం కలిగిస్తూ కర్ణకఠోరంగా పాటలు పాడటం, మరొకరిచేత బలవంతంగా పాటలు పాడించడం ఇదా వినోదం! రవితేజ నటించిన కృష్ణ సినిమాను ఓ బస్సు ప్రయాణంలో చూడక తప్పలేదు. ఓ అరగంట చూసేసరికి వెగటు తన్నుకొచ్చింది. ఆ సినిమాలో రవితేజ నటన, మాటలు, శరీర భాష దుర్భరంగా ఉన్నాయి. ఎన్నో మంచి చిత్రాలు తీసిన వినాయక్ ఇలాంటి వెకిలి హాస్యం కూడా తీయగలడా? అని ఇటీవల చానెల్‌లో సినిమా చూసి దిగ్భ్రమ చెందాం. దర్శకులు దృష్టిలో వినోదం అంటే ఇదా? అన్న అనుమానం పుట్టుకొస్తుంది.
-ఆర్.సత్య, కరప

అదే మనకి లేదు
ఏ సమస్య వచ్చినా తమిళులు ఏకమై స్పందించినట్టుగా ఆంధ్రులు కలిసి స్పందించరు. ఇది చరిత్ర చెప్పిన నిజం. జల్లికట్టు నిషేధించరాదంటూ తమిళ నటీనటులతోపాటు ఎఆర్ రెహమాన్, విశ్వనాథన్ ఆనంద్‌లాంటి ప్రముఖులు కూడా స్పందించారు. శశికళ, పన్నీర్‌ల వార్‌లో కూడా కమల్, గౌతమి, కుష్బూలాంటి నటీనటులు పన్నీర్ వైపుమొగ్గారు. అదే ఆంధ్రలో అయితే హోదాకోసం జరిపే పోరాటంలో టాలీవుడ్ నుంచి ఒకటి రెండు గొంతుకలు వినిపించాయి కానీ, మిగతా వారెవరూ పెద్దగా స్పందించలేదు. గొంత విప్పలేదు సరికదా, విప్పిన వాళ్లతో గొంతు కలపలేదు కూడా. తమిళుల్లో చురుకు పాలు, రాష్ట్భ్రామానం ఎక్కువ. ఆంధ్రులకు అదే లేదేమోననిపిస్తుంది.
-ఎన్.గిరిధర్, కాకినాడ

అదృష్ట రేఖ
శరత్‌కాలమ్‌లో అదృష్టరేఖ అంటూ వాణిశ్రీ నట జీవితాన్ని సింపుల్‌గా రాయడం బావుంది. హాస్యనటిగా, చెలికత్తెగా స్క్రీన్‌కు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కళాభినేత్రి, నవలానాయిక అనిపించుకుంది. రెండు దశాబ్దాలకు పైగా ఆనాటి ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రవేసిన వాణిశ్రీ గురించి చక్కగా వివరించారు. వాణిశ్రీ కట్టు బొట్టు అలంకరణ అనుకరించడం ఆనాటి మహిళా ప్రేక్షకులకు ఓ సరదా. అగ్ర నటులు ఎన్టీఆర్, ఎఎన్నార్‌ల స్థాయికి ఎదిగి వారితో కథానాయికగా నటించి, ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఘనత ఆమెది. వాణిశ్రీని శరత్‌కాలమ్‌లో సాక్షాత్కరింపజేసి పాఠకులకు ఆనందం కలిగించారు.
-యు సత్యనారాయణ, తెనాలి

మల్టీస్టారర్లు
ఆనాటి నుండి ఈనాటి వరకు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు స్నేహ పూర్వక వాతావరణానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడానికి ముందుకొచ్చారు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్, భూకైలాస్, సత్యం శివం, చరణదాసి వంటివి ఒక ఎత్తయితే మంచి మిత్రులు, పుట్టినిల్లు మెట్టినిల్లు, మండే గుండెలు, ముందడుగు, కురుక్షేత్రం, కృష్ణార్జునులు వంటివి మరో ఎత్తుగా ప్రేక్షకుల్ని అలరించాయి. నాగేశ్వరరావు, కృష్ణ కలిసి నటించిన హేమాహేమీలు, అలాగే ఎన్టీఆర్, కృష్ణ నటించిన దేవుడుచేసిన మనుషులు, వయ్యారిభామలు వగలమారి భర్తలు ప్రేక్షకుల్ని అలరించాయి. అడవి సింహాలు, యుద్ధం, విశ్వనాథ నాయకుడు, ఈనాడు, మసాలా, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తోడుదొంగలు, పులి బెబ్బులి లాంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇలాంటి సినిమాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చరిత్ర చెబుతోంది. దానికితోడు హీరోల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొని, రచయితలు మంచి కథలు సృజించే అనువైన వాతావరణం ఏర్పడుతుంది. మల్టీస్టారర్లు చేయడానికి హీరోలు ముందుకు రావాలి.
-ఎ రఘురామారావు, ఖమ్మం