మీ వ్యూస్

ఈ ఆత్మలన్నీ అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతికేళ్ల క్రితం దెయ్యం, ఆత్మలంటూ భయపెట్టే కథలతో సినిమా తీస్తే -థ్రిల్లింగ్‌గా చూసేవారు. ప్రపంచం మొత్తం ఆధునిక సాంకేతికత చుట్టూ తిరుగుతుంటే -ఇంకా పాతికేళ్ల క్రితంనాటి స్క్రీన్‌ప్లే, సన్నివేశాలతో సినిమాలు తీస్తే -అచ్చంగా చిత్రాంగదలానే ఉంటాయి. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలపు కథలు, సన్నివేశాలు రూపొందిస్తేనే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అరిగిపోయిన పాత రీళ్ల కథలను తిరగదోడితే ఎందుకు చూస్తారు. అదిగో ఇదిగో అంటూ ‘చిత్రాంగద’ చిత్రం కోసం తెగ ప్రమోషన్ చేసినా -సినిమా వర్కవుట్ అవ్వకపోవడానికి అసలు కారణం ఇదే. ఆత్మలు ఇంకా మనిషిని పట్టి పీడించటంలాంటి పాత కథనాలు వదిలేసి, దర్శకులు, కథకులు కొత్తగా ఆలోచిస్తే -హారర్ సినిమాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. లేదంటే హారర్ సినిమాలన్నీ -్భయపెట్టే సినిమాల్లా కాకుండా భయపడే సినిమాలైపోవడం ఖాయం.
-మిత్రబృంద, గోకవరం

మళ్లీ.. మూస
ఒకటీ రెండూ కాదు, వారానికి వారం ఇబ్బడిముబ్బడిగా చిన్న సినిమాలు వచ్చిపడుతున్నా -ఒక్కటీ చూడదగ్గదిగా ఉండటం లేదు. చిన్న సినిమాను, కొత్త దర్శకులను ప్రోత్సాహిద్దామన్న ఆలోచన ఆడియన్స్‌లోవున్నా, అందుకు వాళ్లే ఆస్కారం ఇవ్వడం లేదు. డెబ్యూట్ డైరెక్టర్స్ లెక్కలేనంత మంది వస్తున్నా -ఒక్కరి ఆలోచనల్లోనూ నోవెల్టీ ఉండటం లేదు. చిన్న సినిమాకు మంచి రోజులొచ్చాయని గత ఏడాది అనిపించినా, ఈ ఏడాది గత మూడు నెలల్లో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలేవీ ఒక మోస్తరు కూడా లేకపోవడంతో -నిరుత్సాహం కనిపిస్తుంది. గత ఏడాదిపడిన ‘క్షణం’లాంటి సినిమా ఒకట్రెండు పడితే తప్ప చిన్న సినిమాకు ఊపొచ్చే పరిస్థితి కనిపించటం లేదు.
కెవిపి రావు, కందుకూరు

పంటికింద రాయలా..
‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమాన్ని నాగార్జున బాగానే నిర్వహించాడు. ఇది ముఖ్యంగా వినోద కార్యక్రమం. అందువల్ల తేలిక ప్రశ్నలు, అనవసర ప్రసంగాలు, నాగ్‌ని బూస్ట్ చేయడం సాగింది. చిరంజీవి నిర్వహణలోనూ అదే ఒరవడి. అయితే పొగడ్తలు భజన స్థాయికి చేరుకొని విసిగిస్తున్నాయి. చిరంజీవి మాటతీరు ముద్దముద్దగా ఉండి పెదవుల కదలిక ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. వాయిస్ మనోరంజకంగా లేదు. నాగ్ తీరు సహజంగా ఉంటే చిరు తీరు తెచ్చిపెట్టుకున్నట్టు అసహజంగా ఉంటోంది. ఈ లోపాలను సరిదిద్దుకుంటే చిరుస్థాయి పెరుగుతుంది.
- ధర్మతేజ, గొడారిగుంట

ఎందుకీ మకతిక
ఇంచుమించు అన్ని పత్రికల్లోనూ సినిమా బిట్స్ ఉంటున్నాయి. అయితే ఒకే అంశంపై వివిధ పత్రికల్లో రకరకాల అభిప్రాయాలు చెప్పి పాఠకుల్ని తికమక పెడుతున్నారు. భర్తనుంచి విడిపోయిన అమలాపాల్‌కి మాజీ మామ సినిమాలు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆమె రెంటికీ చెడిన రేవడి అయిందని ఒక పత్రికలో వచ్చింది. కాని ఇప్పుడామె చేతి నిండా సినిమాలున్నాయి. బాబు బంగారంలో నయన్ అసహ్యంగా ఉంది. పైగా ఆమె కండిషన్లుపెడుతూ నిర్మాతల్ని హడల గొడుతోంది. ఆమె చాప్టర్‌క్లోజ్ అయినట్టే ఒక పత్రికలో వచ్చింది. కానీ ‘అత్యధికులు కోరుకుంటున్న బ్యూటీ’ పురస్కారం పొందింది నయన్. పత్రికలు సంయమనంతో వార్తలు రాస్తే పాఠకులు సంతోషిస్తారు.
ఎస్ రావు జె, తుని

అవీ వాళ్ల.. ఆలోచనలు
నటుడు శివ బాలాజీకి పవన్ అంటే బోలెడు అభిమానంట. జనసేన ప్రకటనలు మరింత ప్రభావితం చేయగా పవన్‌కి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని దీర్ఘంగా ఆలోచించి ప్రత్యేకంగా చేయించిన కత్తిని బహుమతిగా ఇచ్చాట్ట. సినిమాల్లో అయితే విలన్‌ని కత్తితో నరికేస్తే సమస్య తీరిపోతుంది. కాని ప్రజాస్వామ్యంలో కత్తులు తుపాకులు పనికిరావు. సామరస్యంగా చర్చించి పరిష్కరించాలి. అలాంటప్పుడు ఉపయోగంలేని కత్తిని బహూకరించడం అర్ధరహితం.
- చంపక్, మాధవనగర్

హేట్సాఫ్ ఘాజి
రానా కథానాయకుడిగా నటించిన ఘాజి ఇటీవల చూసిన సినిమాల్లో బాగా నచ్చింది. ముఖ్యంగా కె.కె.మీనన్, అతుల్ కలకర్ణిల యాక్షన్ చిత్రానికి వనె్న తెచ్చింది. సముద్రంలోపల జరిగే వైవిధ్యమైన కథనాన్ని ఎన్నుకొని సినిమా రూపొందించిన దర్శక నిర్మాతలకు అభినందనలు చెప్పాలి. దేశభక్తితో సాగే ప్రతి సన్నివేశం ఇప్పటి ప్రేక్షకులకు నిజంగా కావాలసిన సినిమాలా నిలబడింది. ఈవారం వచ్చిన ఏడెనిమిది చెత్త చిత్రాలన్నీ పారిపోగా, థియేటర్లలోకి మళ్లీ ఘాజి వచ్చి సందడి చేస్తోంది.
-టి.రఘురామ్, నరసరావుపేట

అగ్గిరాముడు వ్యాసం బాగుంది
వెనె్నల్లో అగ్గిరాముడు గురించి రాసిన వ్యాసం బాగుంది. తమిళంలో మలైకళ్ళన్, హిందీలో ఆజాద్‌గా తీశారు. తమిళంలో ఎంజిఆర్, భానుమతి, హిందీలో దిలీప్‌కుమార్, మీనాకుమారి నటించారు. ఈ మూడు చిత్రాలు సేలంలో రూపొందించారు. ఎన్టీఆర్, ఎంజిఆర్ స్నేహ బంధానికి ఈ చిత్రమే నాంది. ఈ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు మద్రాస్‌నుండి ఎన్టీఆర్‌కు టెలిగ్రామ్ రావడం, చిత్ర నిర్మాత దర్శకునికి చెప్పడం జరిగింది. దానికి ఎంజిఆర్ షూటింగ్ ఆపనవసరం లేదని, ఎన్టీఆర్ పాత్ర తానే చేస్తానన్నారు. బహుశా ముసలి వేషం వేసినప్పుడు అయి వుంటుంది! ఎస్‌ఎం శ్రీరాములునాయుడు హిందీలో నౌషాద్‌ని సంప్రదించారు. టైమ్ లేదు కనుక 20, 25 రోజుల్లో రికార్డ్ చేయమన్నారు. దీనికి పారితోషికం లక్ష రూపాయలు ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించారు. వెంటనే సి రామచంద్రను బుక్ చేశారు. ఆయన పాటల్ని హిట్ చేశారు. లతామంగేష్కర్ పాడిన ‘నా బోలే నా బోలే నా బోలే’(ఈ పాటను భానుమతి చింతామణిలో రావోయి రావోయి ఓ మాధవ’గా పాడారు. దేఖోజీ బహార్ ఆరుూ పాట అదే చిత్రంలో పున్నమి చకోరినోయి అంటూ పాడారు) లత, చితల్‌కర్ పాడిన కిత్నా హసీమై వౌసమ్.. సాయి, సుబ్బులపై చిత్రీకరించిన అప్లం చప్లం పాటలు నేటికీ హిట్టే. 1954లో కలిసిన ఎంజిఆర్, ఎన్టీఆర్ దిలీప్‌కుమార్‌లు 1967 సంవత్సరంలో రామ్‌ఔర్‌శ్యామ్ చిత్రానికి కలిశారు. తెలుగులో రాముడు-్భముడుగా, తమిళంలో యంగవీట్ పిళ్లైగా వచ్చాయి.
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు